వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నివేళల కేవలం తిండికి లేక పడిన వెతలు.. తిండిపెట్టేవారు కొందరు అవలంభించిన కటుధోరణి.. కొందరిని ఆశ్రయించవలసి వచ్చినప్పటి మనోభావాలు.. పండితబ్రువులతో నడిచిన గొడవలు.. పంతాలు పట్టింపులు.. కొందరిలో రసికతా రాహిత్యం.. జరిగిన సన్మానాలు.. అవమానాలు అన్నీ ఈ గ్రంథంలో జంకులేకుండా వెలిబుచ్చారు శ్రీపాదవారు. ఆనాటి పెద్దలతో, ధనవంతులతో తాను అనుభవించిన కష్టసుఖాలు.. కొందరు ఆత్మీయుల ఓదార్పులు. అన్నీ.. అన్నీ.. గ్రంథం చదవడానికి ఉపక్రమించగానే కాలచక్రం కొన్ని క్షణాలపాటు ఆగి వెనుదిరిగి ఒక శతాబ్ది వెనుకకు తిరిగి ఆగిపోతుంది. అప్పటి గోదావరీ తీరస్థ ప్రదేశాలు.. అప్పటి పల్లెలు.. పట్నాలు.. ఆ గాలి.. వృక్షాలు.. పూవులు.. అప్పటి రైళ్ళు.. అప్పటి చెన్నపట్నం... అప్పటి సంగీత సాహిత్యాది కళలు.. అవధానాలు.. వాటి రాణింపు, చివరకు బెంగాలీ రవీంద్రుడు, బంకించంద్రలను గురించి కూడా అన్నీ విదితమవుతాయి.
అంతా ఒకప్పటి మహా సాహిత్య ఋషివరుని శ్వాస.. గుండెల చప్పుడు.. ఒక జీవుని వేదన...
ఇతర విషయాలలో వలెనే మాట పట్టింపు విషయంలోనూ శ్రీపాదవారు మహాకఠినులు. నిండు మనసులు నవ్య నవనీత సమానము. పల్కు దారుణ ఖండల శస్తత్రుల్యము అన్నట్టూ.. మాట ‘వజ్రాదపితధోరణి’, అన్నట్టూ.. ఒకప్పుడు ఒక మిత్రుని ఇంటిలో ఏదో వాగ్వాద సందర్భంలో కసి పెరిగి ‘ఇక నీ యింటి గడపతొక్కేది లేదు’ అన్నారు శ్రీపాదవారు. కాని ఆ మిత్రుణ్ణి కలియక ఉండలేరు మరి ఒక్కనాడైనా.. మరునాడు ఉదయమే వెళ్ళారు మిత్రుడి ఇంటికి. ఆనాడే కాదు, తరువాత ప్రతి దినమూ వెళ్ళారు. కాని గడపదాటి లోపలికి అడుగుపెట్టనే లేదెన్నడూ. బయటనే కూర్చుని తృప్తిగా కబుర్లు చెప్పుకుని, తృప్తిగా తిని మరీ వెళ్లేవారు.
చివరకు మరణ సమయానికి ముందు అనేక బాధల దొంతరల మధ్య అనారోగ్యంతో బాధపడుతూ పురిపండా అప్పలస్వామిగారికి వ్రాసిన చివరి లేఖ.. వీలునామా వంటిది. చదువరుల కన్నులు చెమ్మగిల్లజేసే, గుండెలు పిండి చేసే దారుణమైన లేఖ..తో ఈ గ్రంథం ముగుస్తుంది. తెలుగువారికి అవశ్య పఠనీయమైన గ్రంథం అనుభవాలూ- జ్ఞాపకాలూనూ.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య