వినమరుగైన

ఇదీ నా గొడవ ( కాళోజీ నారాయణరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిములలో కూడా ఎక్కువ తక్కువలు ఎలా వుండేవో వివరించారు. గ్రంథాలయోద్యమాన్ని చూసి బెదిరిపోయి నైజాం సర్కార్ గస్తీ నిషాన్ తిరపన్ (రాజపత్రం నెం.53) జారీ చేసింది. ఇది వాక్స్వాతంత్య్రాన్ని నిరాకరించింది. దీనితో సంస్థాన ప్రజలు తమ కష్టసుఖాలు ఎవరికీ చెప్పుకోలేని వారయ్యారు.
బ్రిటీషు ఇండియాలో కొనసాగిన స్వాతంత్రోద్యమం తెలంగాణలో కూడా ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. నైజాంలో బాధ్యతాయుత ప్రభుత్వ పాలన కావాలని కోరారు. ఈ ఉద్యమాలన్నింటిలో కాళోజీ పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ జెండాలు ఎగురవేసేవారు. రజాకార్లకు కాళోజీ భయపడేవాడు కాదు. అప్పటికే రజాకార్లు మొగిలయ్యను హత్యచేశారు. ఆ తర్వాత డాక్టర్ నారాయణరెడ్డిని చంపేశారు. పరిస్థితి చూసి పారిపోయే రకం కాదు కాళోజీ. వెనుకా ముందాడే స్వభావం కాదాయనది. ప్రజల కన్యాయం జరిగితే వాళ్ల పక్షాన అడగటం, రాయడం. ఆనాటినుండి ఈనాటివరకూ అదే ఆయన పద్ధతి. అప్పటి ప్రధాని మీర్జా ఇస్మాయిల్ వరంగల్‌లో పరిస్థితులు విచారించటానికి వెళ్తున్నట్లు తెలిసి, వరంగల్ పరిస్థితి ఉద్రిక్తంగా వుందని, శాంతిని నెలకొల్పేటందుకు నువ్వు పోతున్నవ్. ఆ పరిస్థితికి నేను కారకుడినని జిల్లా నుంచి బహిష్కరించినవు. నేను వరంగల్ వాడిని.. నన్ను తీస్కపోకుండ నువ్వు పోయి విచారణ చేస్తే మాత్రం అది బూటకపువిచారణ అవుతుంది అని కవరులో పెట్టి ప్రధాని బంగ్లాకు పట్టుకుపోయి, అందినదని రసీదుమీద సంతకం తీసుకుని వచ్చారు కాళోజీ. ఎవరేమి అవకతవకలు చేసినా, తన పార్టీ వారైనా కాంగ్రెస్ వారైనా సరే, 70 ఏండ్ల నుండి సాకుతున్న అన్నగారైనా సరే- ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచన లేకుండా- విమర్శించటం కాళోజీ పద్ధతి. ఇది ఆయన స్వభావం. అటువంటి సందర్భాలెన్నో కాళోజీ ఈ ఆత్మకథలో ఉదహరించారు.
కాళోజీ స్పందించిన రెండు కొత్త పదాలు ఈ ఆత్మకథలో కనబడతాయి. మొదటిది నా ఇజం.
నానా యిజాల కడుగున చూడ
నా యిజందే అగుపడును జాడ
అన్నారు ఒక కవితలో. రెండవ పదం పార్టీవ్రత్యం. అంటే పార్టీ సభ్యులు, పార్టీ ఏది చెబితే అది నమ్మడం, చేయడం. పార్టీకో లేక సిద్ధాంతానికో నిబద్ధుడైతే ఇక అతనికి భావ స్వేచ్ఛ వుండదనీ, స్వతంత్రత ఉండదనీ కాళోజీ అనుభవం. ఆ స్వీయానుభవమే ఆయన్ను పార్టీవ్రత్యం అనే హేళనాపూర్వకమైన పదాన్ని సృష్టించేట్లు చేసింది.
భాష విషయంలో కాళోజీ వాడుక భాషావాది. ఒకని భాష విషయంలో యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం అంటారాయన. అంతేకాదు ఇంకా ఇలా అంటున్నారు. ఒకరకంగా చూస్తే వేషంకన్నా భాష రక్తమాంసాల్లో కలిసిపోయి వుంటది.
ఏ ప్రాంతంవారు ఆ ప్రాంతం వాడుక భాషలోనే రాయాలి. భాషాశాస్త్రం ప్రకారం చూస్తే ఏ భాషకయినా జీవధాతువు మాండలికం. మాండలికంలో తేడాలు, యాసలు, వ్యత్యాసాలు వుండటమే భాషకు జీవలక్షణాలు అంటున్నారు. అభివృద్ధి పొందిన రెండు జిల్లాల భాష మాండలీకమే తెలుగు.

ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొత్తపల్లి రవిబాబు