వినమరుగైన

అక్షర తూణీరం కె. వి. రమణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మంచి సాహిత్య విమర్శకులు లేరనే మాట చాలా తరచుగా విన్పిస్తుంది. ముఖ్యంగా ఈ విమర్శ సృజనాత్మక సాహిత్యకారుల నుంచి రావటం గమనార్హం. తెలుగుసాహిత్యం వృద్ధి చెందినంతగా సాహిత్య విమర్శ వృద్ధి చెందలేదనేది కూడా వొఠ్ఠి ఆరోపణ మాత్రమే. నిజానికి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రని ఏ మాత్రం పరిశీలించినా ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలేననే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే తెలుగు సాహిత్యం గత వంద సంవత్సరాలలో శక్తివంతమైన సాహిత్య విమర్శకుల్ని చాలామందిని చూసింది. అసామాన్య ప్రతిభ కనపర్చిన సాహిత్య విమర్శకులు అనేకమంది తెలుగు సాహిత్య గతిని నిర్దేశించగలిగారు. ఈ పరంపరలో వచ్చిన విమర్శకులలో కె.వి.ఆర్.గా సుప్రసిద్ధులైన కె.వి.రమణారెడ్డి ఒకరు.
తెలుగు సాహిత్య విమర్శకుల్లో ఒక ప్రత్యేక లక్షణం ఏమంటే, విమర్శకులు ఎక్కువమంది స్వయంగా సృజనాత్మక రచయితలు కావడం. గురజాడ నుండి కె.వి.ఆర్ దాకా సాహిత్య విమర్శకులు దాదాపు అందరూ కవులో, కథకులో, నవలా రచయితలో కావటం విశేషం. కె.వి.ఆర్ కవి, విమర్శకుడు.
సాహిత్య విమర్శలో కె.వి.ఆర్‌ది చాలా విస్తృత ప్రపంచం. కె.వి.ఆర్ అంత విస్తృతంగా విమర్శ రాసినవాళ్ళు తెలుగులో మరొకరు కనిపించరు. అలాగే కె.వి.ఆర్‌లాగా ఎక్కడా రాజీపడని విమర్శకులు అరుదు. తెలుగులో మరీ అరుదు. అవసరం వచ్చినపుడు శ్రీశ్రీని సైతం నిలదీయటానికి వెనుకాడని విమర్శకుడు, విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఈ యుగపు విశిష్ట రచనల్లో ఒకటిగా ప్రకటించగల ప్రజాస్వామికవాది కె.వి.ఆర్. ‘వివాదం ఎక్కడ వుందో రమణారెడ్డి అక్కడ’ అని ప్రకటించిన అత్యంత వివాదాస్పద విమర్శకుడిగా పేరుపొందిన కె.వి.ఆర్ వివాదాల్ని భావ సంఘర్షణలో భాగంగా చూశాడు తప్ప వైయుక్తికంగా ఎప్పుడూ పరిగణించలేదు.
దాదాపు అర్ధశతాబ్దంపాటు తెలుగు సాహిత్య విమర్శ క్షేత్రంలో గొప్ప నిబద్ధతలో విమర్శ రాసిన కె.వి.ఆర్. 1961-62ల మధ్య విశాలాంధ్ర పత్రికలో అక్షర తూణీరం అనే శీర్షికలో జాతీయ, అంతర్జాతీయ సాహిత్యంమీద గొప్ప విశే్లషణాత్మక వ్యాసాలు రాశారు. ఇవి ఈ మధ్య అదే పేరుతో పుస్తకంగా కూడా వెలువడ్డాయి. శైలీగతమయిన సమస్య కొంత వున్నప్పటికీ కెవిఆర్ విమర్శ రంగంలో తన పాత్ర ఏమిటో స్పష్టంగా తెలిసినవారు. తన గురించి తాను కెవిఆర్ చాలా స్పష్టంగా ఇలా చెప్పుకున్నారు. ‘‘వివాదాలను నేనై ఎన్నడూ కల్పించలేదు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

బి. తిరుపతిరావు