వినమరుగైన

ఆరుయుగాల ఆంధ్రకవిత (ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర సిద్ధులు, యుగకర్తలైన కవులతోపాటు పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, కేతన, మారన, మంచన, గోన బుద్ధారెడ్డి, నాచన సోమన, గౌరన, జక్కన, నంది మల్లయ, ఘంట సింగయ, సంకుసాల నృసింహకవి, తెలగన, కందుకూరి రుద్రకవి, రంగాజమ్మ, శేషం వెంకటపతి, ముద్దుపళని- సుమారుగా 43 మంది ప్రాచీనాంధ్రకవుల- కవయిత్రుల కావ్య స్వరూపాలను కళ్ల ఎదుట నిలబెట్టారు విలక్షణగా. ఈ దృష్టితోనే గ్రంథ నామధేయం క్రింద బ్రాకెట్లో ఆరు ఋతువులుగా భావించి వింగడించిన ఆంధ్ర కవితా సమీక్ష అని పేర్కొన్నారు శాస్ర్తీగారు.మనుచరిత్రలోని నిడుద పెనె్నఱి గుంపు జడ గట్ట సగరు ముమ్మనుమండు తపముగైకొనిన చోటు అనే పద్యంలో తపస్వియైన భగీరథుని నిష్ట ప్రవరుని నిష్ఠను సూచిస్తోందనీ, జగతికి మినే్నఱు దిగడం ప్రవరుడు లోయలోకి దిగడం అనుకోవచ్చనీ, పుచ్చడీకతనం పోగొట్టుకొని గిరి కన్య పతిసేవకు శ్రమించడం వరూధిని సిగ్గు వదలి శ్రోత్రియుని వరించడానికి సూచన అనీ ఇంతకు మునుపు ఏ సాహిత్య చరిత్రకారులూ చెప్పని క్రొత్త విషయాన్ని చెప్పారు ఇంద్రగంటివారు.
అలాగే భాస్కర రామాయణంలోని ఎల్లసుఖంబులు చేకొనజెల్లుట వనమ నంద - చిక్కిన మరి పాటిల్లునె? వెనె్నల దినముల నల్లో నేరేళ్లుకాక యావలఁగలవే అన్న పద్యంలోని అల్లోనేరేళ్ళు అంటే పండుగావనీ, ఆడపిల్లలు వెనె్నలరేలలో గంతులు వేస్తూ పాడుకునే పాటలనీ, ఆ వెనె్నల పోతే, ఆ ఆట పాట లింకెక్కడ ఉంటాయని చెబితే సంస్కృత భావం తెలుగులో మొలచినట్టుంటుందని ఆ కవితలోని తెనుగుదనాన్ని అపూర్వంగా విశదీకరించారు. అన్నట్టు - ప్రాచీనాంధ్ర కవులది అనువాదం కాదనీ వాళ్లు ఆ మాటను వాడలేదనీ, వాళ్లది తెలుగు సేత, ఆంధ్రీకరణమనే పలకాలంటారు వీరు చాలాచోట్ల. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని చదివి ఆనందిస్తాం. సందేహం లేదు. కాని ఏ ఘట్టమూ మనసుమీద ముద్రకొట్టదు. దాని వ్యంగ్యాన్ని విప్పుకొని తృప్తిపడవలసిందే. పాపరాజు వాచ్యంమీదనే మొగ్గు చూపి చకితులను చేస్తాడు- ఉపమాద్యలంకారాలతో వ్యంగ్యం అప్రధానమై వాచ్యమే శోభాతిశయం గలిగిస్తుంది కదా! ఈ తులనాత్మక సమీక్ష- ఆయా కవుల యెడ వీరికి గల అంచనాను స్పష్టంగా ఏ మూలుగులూ లేకుండా వ్యక్తం చేస్తోంది. పోతన కైత అంటే జోతలు చేయడానికి ఎవరికైనా చేతులు లేవకమానదు. వీరికీ అటువంటి భావమే ఉంది.
కాని విమర్శ సందర్భంలో కేవలం ఆ దృష్టి పనికిరాదు గదా!

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

రామడుగు వెంకటేశ్వర శర్మ