వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కథకుల్లో పాలగుమ్మి పద్మరాజుగారికొక విశిష్టస్థానముంది. కొడవటిగంటిగారిలా, త్రిపురనేని గోపీచంద్ గారిలా ఆయన ఎక్కువ కథలు రాయలేదు. బుచ్చిబాబుగారిలా చాలా పరిమితంగా రాశారు.
ఆయన్లో వున్న విలక్షణమైన విశేషమేమిటంటే- కథావస్తువుల్ని ఎంచుకోవడంలో ప్రదర్శించిన వైవిధ్యం.
ఒక రచయిత సుప్రసిద్ధుడవాలంటే- రుూవైవిధ్యమనేది ఎంతో అవసరం.
పద్మరాజుగారు రచించిన కొన్ని అద్భుతమైన కథలు సేకరించి, సంకలనంగా వెలువడిన కథా సంపుటి-గాలివాన.
ఇందులో గాలివానతోబాటు మొత్తం 18 కథలున్నాయి. అన్నీ వేటికవి ప్రత్యేకత, నిండుతనం సంతరించుకున్నవే.
గాలివాన!
ఆ రోజుల్లో ప్రతి తెలుగు పాఠకుడికి తెలిసిన కథ. తెలుగు కథా సాహిత్యంలో ఓ అమూల్యరత్నం.
చాలా సంవత్సరాల క్రితం ప్రపంచ స్థాయిలో కథల పోటీ జరిగింది. తెలుగులో రుూ పోటీ నిర్వహించే బాధ్యత ఆంధ్రపత్రిక వారు తీసుకున్నారు. ఆ పోటీలో పద్మరాజు గారి గాలివానకు తెలుగులో ప్రథమ బహుమతి, తర్వాత దశలో జాతీయ స్థాయిలో రెండవ బాహుమతి లభించాయి. అంతటితో ఆగలేదు. అంతర్జాతీయ స్థాయికి వెళ్లినపుడు అక్కడ కూడా ద్వితీయ బహుమతి గెలుచుకుంది. దానితో ఆయన పేరు సాహిత్య ప్రపంచంలో మార్మోగింది. అంతవరకు రచయితలకు, కొంతమంది మేధావులకు మాత్రమే పరిమితమై వున్న ఆయన అప్పట్నుంచే పాఠకుల రచయితగా కూడా పాపులయ్యారు.
గాలివాన కథలోని విశేషమేమిటి?
ఇది ఒక బిహేవిరియజానికి సంబంధించిన కథ. మనిషి ప్రవృత్తి చాలా విచిత్రంగా వుంటుంది. ఏదయితే తన వ్యకిత్వమనుకునీ, క్రమశిక్షణ అనీ నియమావళి ఏర్పరచుకుని, ఆ పరిధిలో నుండే ప్రకాశించాలని చూస్తాడో, ఓ ప్రత్యేక పరిస్థితిలో ఇరుక్కునే సరికి.. అవన్నీ గాలికి ఎగిరిపోయి, అతన్లో అంతర్ముఖంగా వున్న సామాన్యమైన మనిషి బయటకు వస్తాడు. ఈ వ్యక్తిత్వం, క్రమశిక్షణా ఓ భేషజమా? పరిస్థితుల వొత్తిడికి తట్టుకుని నిలబడలగవా..?
ఈ ప్రశ్నలకు.. గాలివాన కథలోకి వెళితే సమాధానం దొరుకుతుంది.
ఆకాశం మబ్బు మబ్బుగా వుండి, వాన రాబోతూన్న వాతావరణంలో రావుగారు రైలెక్కుతారు. అది పరుపుల పెట్టె.
ఆ కంపార్ట్‌మెంట్‌లో ఆయనతోబాటు ఓ ముసలాయన, క్రొత్తగా పెళ్ళయినట్లు కనిపించే ఓ జంట యింకా కొందరుంటారు.
రావుగారిది విజయవంతమైన జీవితం. సమాజంలో, యింట్లో ఓ కమాండ్‌తో జీవిస్తూ వుంటాడు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

కొమ్మూరి వేణుగోపాలరావు