వినమరుగైన

అమరావతికథలు.. శంకరమంచి సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవస్థలోని దుర్లక్షణాలుగా అందరూ గుర్తించిన కొన్ని కాలదోషం పట్టిన సామాజిక అవగుణాలను చిత్రించి గూడా ఏ వ్యాఖ్యానమూ చెయ్యడు. బహుభార్యా కుటుంబ కథలు- భోగ కాంతా వ్యవస్థ-జంతు బలులిచ్చే కొలువులు- ఇట్లాంటివాటిలో రచయిత ఏ పక్షాన ఉన్నాడో ఇతమిద్ధం కాదు. వాదనలతో సమర్థించటం, కాపుకాయటం- నిరాకరించటం- సమర్థించటం- అతని స్వభావం కాదు- ‘‘వ్యవస్థ గురించి కాదు నా పట్టింపు. అందులోని జీవుల స్పందనలు, ప్రతిస్పందనలు వారిలోని స్వభావ సౌకుమార్యాలు-అవీ నాకు ముఖ్యం’’ అన్నట్లుంటారు. సిద్ధాంత భారాలను నెత్తిన వేసుకొనని పాఠకులకు ఈ కథలు మంచి అనుభవాన్నిస్తాయి.
పద్యానికి నాలుగే పాదాలన్నట్లు వంద అమరావతి కథలలో ప్రతిదానికి మూడే పేజీల పరిమితి. ఎంత కథనయినా అతి చిన్న శిల్పంలో ఇమిడ్చే అమరావతి శిల్పిలాగా ఈ కథలు కూడా పరిమితిని నియమాన్ని పాటించాయి. ఒకే ప్రాంత నేపథ్యాలతో కథా శతకం వ్రాసిన ఏకైక తెలుగు కథకుడు సత్యం శంకరమంచి. శంకరమంచి గారివి మంచి కథలేనా గొప్ప కథలు కూడా ఉన్నాయా! అంటే - గొప్ప, మంచి అనే విశేషణాల నిర్వచనాల కసరత్తులోనికి వెళ్లాలి. ఈ కథలన్నీ అందమైనబొమ్మలు. చలం అన్నట్లు ‘మంచికో చెడ్డకో చీల్చి కదిలించేవి కావు’. శ్రీశ్రీ అన్నట్లు ‘పెను నిద్దుర వదిలించేవి కావు’. కాని రచయితకు ఒక నిర్దష్టమైన దృక్కోణం ఉన్నట్లు పుస్తకం చదివి, మూసిన తర్వాత అర్థం అవుతుంది. జీవితం గానుగలో నలిగే మనుష్యుల మీద సానుభూతి, గానుగ అంచుమీద కనిపించే అందం స్వల్పమే అయినా అందులోనే తృప్తిపడే జీవుల నిండు మనసు- కర్కశత్వం లేని సామరస్యం. ఇవి రచయితకు ఇష్టమయిన జీవన లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ కథలలోని రెండు వాక్యాలు శంకరమంచి సత్యంగారి జీవసారాన్ని సూచిస్తుంది. ఒకరోజెల్లిపోయింది కథలో కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతకాలని-రాగి చెంబులో చేప పిల్ల కథలో ‘‘ముత్యం చిప్పలో ముత్యంలాగా బ్రతకటం కాదు. నీళ్లలో చేపలిల్లలాగా బ్రతకాలి’’ అన్న వాక్యాలు సత్యంగారి జీవితానికి శీర్షికలు. ఈ కోణం గొప్పదే ననుకొన్నవాళ్లకు ఇవి గొప్ప కథలు. దీన్ని అంగీకరించని వాళ్లకు గూడా ఇవి తప్పకుండా అందమైన మంచి కథలు.
కథానికా సాహిత్యానికి శంకరమంచి కూర్చిన ప్రత్యేకమైన సోయగాలు ఏమిటి అని ప్రశ్నించి అమరావతి కథలను ప్రక్రియా వికాసంలో ఏ మలుపు దగ్గర నిలబెట్టాలి అని ఆలోచిస్తే- ఇవి వస్తువుకన్నా కథానికా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయనిపిస్తుంది. వ్రాసే నేర్పు వుంటే ఏదైనా కథా వస్తువేనని, మనోలాలిత్యం శిల్ప నైపుణ్యం, కవితా కోణంతోకూడా అందమైన కథలు వ్రాయవచ్చునని సత్యంగారు నిరూపించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
-సశేషం

వావిలాల సుబ్బారావు