వినమరుగైన

అమరావతికథలు.. శంకరమంచి సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్తంభన అనే కథ, బిందురేఖ అనే కథ మళ్లీ మళ్లీ చదివితే కథలు కవితాకథలు కావటం అంటే ఏమిటో తెలుస్తుంది. అమరావతిలో ఒక్కసారిగా గాలి స్తంభించిపోయింది. ఉక్కపోసింది. ఇంతలో ఎక్కడనుండో గాలి వచ్చింది. ఆ తెమ్మర ఎక్కడ నుండి ఎంతెంత హాయిగా ఎవరెవర్ని పలకరించి వచ్చిందో- ఏ కొమ్మలు రెమ్మలు- ఏ గుడిసెలు గోపురాలు పలకరిస్తూపోయి- వేలకొద్దీ దీపాలు కలిగిన బౌద్ధ స్థూపం ఈనాటికి ఆరిపోయిన దీపాలతినె్నదాకా భావించుకుంటూ- గాలిలో ఈదుకుంటూ వెళ్తాడు రచయిత. ఎన్నడు మళ్లీ గాలి వీచునో, ఎన్నడు ఈ గడ్డలో తిరిగి ప్రాణం పోసుకొనునో అంటూ నిస్పృహలో పడిపోతాడు రచయిత- కథ అయిపోతుంది.
కథ కొంత ఎక్కువ ఉన్నవి గూడా ఉన్నాయి. వాటిలో కూడా అంతర్నాదంలాగా ఓ ప్రశాంత విషాదం ఆ మంచి రోజులు అయిపోయినాయి గదా అన్న ఓ కాకతీ విషాదం వినిపిస్తుంది. నిండు కుండ బొమ్మ అనే కథ బౌద్ధ శిల్పాలలో పూర్ణకుంభ ఫలకానికి చెందినది. గతించిన తన బిడ్డ జ్ఞాపకార్థం ఓ చర్మకారుడు చెక్కించాడు. దానికి శాసనాధారం ఉంది. అది కరుణ రసార్ద్రమయిన కథ అయింది. సత్యంగారి చేతిలో అటునించి నరుక్కురండి వేంకటాద్రినాయని వారి కాలం నాటి కథ. గాయత్రి, శిఖరం కథలు చారిత్రక ఉదంతాలు-ఇవి తప్ప తక్కిన అన్ని కథలలోని వాతావరణం రచయితకు పూర్తిగా పరిచయం అయిందే. చారిత్రక నేపథ్యం వున్న కథలు తప్ప తక్కిన కథలకు 1940-55 మధ్య సంవత్సరాలే కథాకాలం.అప్పుడప్పుడే అమరావతి యాంత్రికయుగంలోకి ప్రవేశిస్తున్నది. ఒక వేరుశనక్కాయల ఫ్యాక్టరీ- బొగ్గుతో నడిచే బస్సులు-ఇవి అక్కడకు వచ్చిన మొదటి యంత్రాలు- అది రచయితకు టీనేజ్ వయస్సు. ఈ కాలపు జ్ఞాపకాలు 1980కి తర్వాత కథలుగా మారాయి. ఆ ఊరే పరిమితమయిన సమాజం. దేవాలయ పరిసర సమాజం. ఇంకా పరిమితమయింది. అయినా అవే తనకు నిజాయితీగల కథా వాతావరణం.
ఆసమాజం ఉన్నతమయిందని గాని-్ధర్మకాలం అనిగాని ప్రజలు ధర్మాతులని గాని ఎక్కడా వెనకేసుకురాడు. మోసాలను, దొంగతనాలను, గ్రామాలనే పార్టీలుగా చీల్చగల మేధావులను, అగ్రవర్ణాల అహంకారాన్ని దాపరికం లేకుండానే చిత్రించాడు. కలవాళ్ల దౌర్జన్యాన్ని లేనివాళ్ల దిగులును వర్ణిస్తాడు. ఆ లేమిలో గూడ హుందాతనంతో రేపటిలోకి ఆశగా తొంగిచూసే నిండు మనసును ముక్కుపుడక కథలోను, తులసి తాంబూలంలోనూ రేఖా చిత్రంగా చూపుతాడు.
జీవితమూలాలను, పరిష్కారాలను వెతకటం తన పనిగా పెట్టుకోలేదు. అవి పరిష్కారం అయ్యేదాకా జీవితం ఆగదు. సమస్యలు పరిష్కారాల భారతమంత నవల. మనిషి జీవితం ఒక మినీ కథ-ఈ పరిధిలో జీవితాన్ని పండించేది తృప్తి అని సూచించ ప్రయత్నిస్తాడు సత్యంగారు. విశే్లషణకు పూనుకోడు-తప్పు ఒప్పులను నిర్ణయించడు-తన పక్షపాతాన్ని ప్రకటించడు. సమాజ దుర్నీతి మీద కోపం తెప్పించడం మీద కన్న-దాని పాలిట పడ్డవారిపై పాఠకునికి జాలి తెప్పించటం మీదనే రచయితకు ఎక్కువ ఆసక్తి.
బ్రాహ్మణ వ్యవస్థలోని అందమైన కోణాలను- సాంప్రదాయిక గౌరవాన్ని -బీదరికపు జాలిని, యాంత్రికమయిన నిష్ఠక్రింద కృంగిపోయి తరాల మార్పులో వచ్చిన బ్రాహ్మణ ధర్మ పతనాన్ని స్పష్టంగా చిత్రించాడు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

వావిలాల సుబ్బారావు