వీరాజీయం

రద్దు ఎత్తుగడతో జనం చిత్తు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దాచుకున్న డబ్బు తుదకు దొంగలకిత్తురో- దొరలకవునో’’ అన్నారు. బాగానే వుంది. ‘దోచు’కున్న డబ్బు తుదకు దొరల బొక్కసంలోకి పోయేటందుకు ఓ బ్రహ్మాండాస్త్రం అకస్మాత్తుగా, ఏ మాత్రం వార్నింగ్ లేకుండా సంధించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు. గానీ, గుఱ్ఱాన్నీ, గాడిదనీ ఒకే గాట కట్టినట్లు సామాన్యుడికి కళ్లు మూసి- సాచి లెంపకాయ కొట్టినట్లు దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే యిదే ‘రద్దు’ ‘బాంబు’ నెలాఖరు వారంలో అయితే మధ్య తరగతి పేద వర్గాల కొంపల్లో- జేబుల్లో చిల్లర పైసలు తప్ప ఏమీ వుండవు, కాబట్టి ఫరవాలేదు. గానీ, ఫస్ట్ వీక్ చివర- ఫుల్ బజెట్ ఖర్చులకి జీతాలు కరెన్సీ నోట్లుగా మార్చుకుని, బ్యాంకులనుంచి తెచ్చిపెట్టుకున్న కుటుంబీకులు- తెల్లారేపాటికి ముష్టివాళ్లయిపోయారు.
అసలు వందకి విలువుందా? ఐదు రూపాయల బిళ్లా, పది రూపాయల నోటు పిప్పరమెంటు బిళ్లలకైనా చాలని రోజులలో ఎవరి దగ్గరయినా ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు వుంటాయి కానీ- ‘చిల్లర చిరాకులక్ష్మి’ అయిపోయిందీ రోజుల్లో. సూపర్‌మాల్స్‌లో ‘కార్డు’ చెల్లుతుందిట. ఐతే, ‘కార్డుగాళ్లు’ ఎంతమందున్నారు? పైగా ‘మాల్స్’కి వెళ్లాలీ అంటే అందరికీ టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్‌గానీ వుంటాయా? ఆటోలో వెళ్లాలి. ఆటో పిలవగానే ‘వందల కాయితాలున్నాయా?’ అని అడుగుతున్నాడు- ఆటోవాలా! ‘‘క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ బుకింగ్‌లు, బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న సేవింగ్స్- యివన్నీ బ్రహ్మచారి- అదీ భార్య వున్న బ్రహ్మచారి అయిన పెద్దమనిషికి ఏం కావాలన్నా రూపాయి తియ్యనక్కరలేని పెద్దమనిషి- మోదీగారికెలా తెలుస్తాయి? రుూ కష్టాలు?’’ జనవాక్యం-
‘‘బ్లాక్‌మనీ కాదు, మా దగ్గరున్నది రెడ్ మనీ’’ అన్నాడో స్కూల్ టీచర్. అంటే రక్తం ధారపోసి, సంపాదించుకున్న పైసలు. వాళ్ల మనుమరాలు, ముందురోజే వచ్చి, దాని పాకెట్‌మనీ అంతా, ‘అయిదొందలుగా’ మార్చుకుంది, నాయనమ్మ దగ్గర. దాంతో, ఆమె పొద్దునే్న లాటరీ సొమ్ము వచ్చినంత ఆనందంగా, ముసి ముసి నవ్వులు నవ్వుతూ వచ్చి ‘‘నా దగ్గర పాతిక వందలున్నాయ్!’’ అంది. అంతలో ఆ మనుమరాలు వచ్చి, ‘‘నీ వేలు నువ్వే తీసుకో, నా వందలు నాకిచ్చీ’’ అని కూర్చుంది.
‘‘వందలున్నాయమ్మా, నా దగ్గర, దాచినా గానీ పాత అయిదొందలకివ్వను- వడ్డీకి అప్పుగా అయితే యిస్తా’’ అంది పనమ్మాయి పరిమళ.
‘‘పేపర్‌లెస్, మనీ లెస్.. సర్వం డిజిటల్ మేజిక్’’ అన్న నినాదం నెక్కిరిస్తూ, కరాళ నృత్యం చేస్తోందనిపించింది. ఏ.టి.ఎమ్.లు లేవు. ఏ ఆసుపత్రికి పోయి నా- ‘‘ముందు డిపాజిట్ కక్కు- తర్వాతే ‘బెడ్డు’ ఎక్కు’’ అంటారు. ఆసుపత్రి గేట్లోనే అయిదొంద ల లెవెల్ ఖర్చు. ‘‘శత్రువు అంటే నల్లధనం భూభారంగాదాచిన వాడు శత్రువే. ప్రగతికి వైరి. ప్రజలకి విరోధి’’ అని వో ఆటమ్ బాంబు పడేస్తే సరి, వాడిమీద’’ అంటూంటారు జనాలు సరదాకి .కాని ఇవాళ, అదే చేశాడు నరేంద్ర మోదీగారు. ప్రక్కనున్న జనాల్ని కూడా అది చావబాదేసింది. చావులు, పెళ్లిళ్లు, రోగాలు- వీటికి వెనుకటి రోజుల్లో ‘పలుకుబడి’ పనికొచ్చేది. చేబదుళ్లు దొరికేవి. గానీ, విచిత్రంగా, రెండు రోజుల్లో రిక్తహస్తాలే అందరివీ అయిపోయాయి.
‘‘మోదీగారిమాట- సుగ్రీవాజ్ఞ’లాంటిదే!’’ అన్నాడు ప్రొఫెసర్ గారు. ఐతే, మోదీగారి ఆజ్ఞ పాటించి- వెయ్యి, అయిదు వందల నోట్లన్నీ చిత్తుకాయితాలు, చెత్తకాయితాలు, వుత్త కాయితాలుగా మారిపోయాయ్! దేశంలో 16.5 బిలియన్‌ల ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు 6.7 బిలియన్‌లు వున్నాయి. అవి ఎక్కడ వున్నా చెల్లని, చిల్లిగవ్వలయిపోయాయ్! బిలియన్ అంటే బ్రిటీష్ బిలియన్ అంటే ఒకటి ప్రక్కన పనె్నండు సున్నాలుంటాయ్. ఆ ఇప్పుడా సున్నాలే మిగిలాయి.
వందలకోసం తెల్లారేపాటికి బెల్లం ముక్కమీదికి చీమల్లా ఏ.టి.ఎమ్‌గాళ్లు చేరుకున్నారు. వెంకన్న గుడిలా వుంది ఒక్కో ఎటిఎమ్ కౌంటర్! కాని అవేమన్నా అక్షయపాత్రలా? పైగా అయిదులూ, వేలూ రాకుండా వందలే కావాలీ అంటే...?
అవతల మరో వేపు ‘‘బ్యాంకుల్లో వేసుకుంటాం మేం. మీకు వందలు కావాలంటే- ఐదుకి నాలుగూ, వెయ్యికి ఎనిమిది,
కావాలా?’’
అంటూ ఆపద్బాంధవులు,
వందల కట్టలు పట్టుకుని దిగడ్డారు.
‘‘కొంప తీసి, అవి పాకిస్తాన్ రూపాయలు కావు కదా?’’ రోజూ పేపర్ చదివే పెద్దమనిషి- జోగారావు అనుమానం. ‘‘పాక్ నోట్లు చిన్నవుండవ్. ఆ సంగతి తెల్సుకో. కావాలా? ఐదొందలు కమిషన్ యివ్వు- వెయ్యి నోటిస్తా’’నంటున్నాడు ప్రయివేట్ ఎక్స్‌ఛేంజ్‌వాలా.
‘‘ఈ దెబ్బకి పాకిస్తాన్‌లోనుంచి వచ్చిన దొంగనోట్లు కూడా ఫినిష్ అవుతాయి. అలాగే ఏటిఎమ్‌లో కూడా వస్తున్న నకిలీ ఐదొందలు వెయ్యి నోట్లు బందయిపోతాయ్’’ అన్నాడు ఎకనామిక్ కుర్రాడు.
కాగా- మోదీ గవర్నమెంట్ రుూ చావుదెబ్బకి వోటర్లు మండిపడుతున్నారని తెలిసి మొబైల్స్ మీద ‘సందేశాల గంటలు’ దంచేశారు. ‘తాపీగా డిపాజిట్స్ చేసుకోండి. రోజుకో నాలుగు వేలు బదలాయించుకోండి. ఏ.టి.ఎమ్‌లో వారానికి ఇరవై వేలు’’ అంటూ. పైగా ఆన్‌లైన్‌కి మారిపోండి అంటూ బాకాలు పట్టారు.
కూరగాయలకీ, పండ్లవాళ్లకీ కార్డులు యిస్తావా? పాన్ నెంబర్ యిస్తావా? అంటూ అంతటా అర్థంలేని మాటలు. చిల్లరకొట్లవాళ్లు, రోజువారీ కార్మికులు ఎవడి ‘దంధా’వాడు మొదలుపెట్టారు. కార్టూనిస్టులు జోకులు మొదలెట్టారు.
పాత నోట్లు తీసుకుని పోయి వాటిని బ్యాంకుల్లో మార్చుకోడానికి ఉద్యోగాలకు శలువులు - వ్యాపారానికి కోత పెట్టుకోవాలి. ప్రయివేట్ స్కూళ్లూ, కంపెనీలూ- పది పదిహేను తేదీలదాకా జీతాలు యివ్వనివాళ్లు- ఎనిమిది పొద్దునే్న పాత నోట్లు- చాయ్, సమోసాల్లో పెట్టి మరీ ఇచ్చేశారు- ‘మీ ఎకౌంట్‌లో వేసుకుందురు!’ అంటూ-
‘‘దేశంలో 2011కి 2016కీ మధ్య ఐదు, పది వందల పెద్ద నోట్లు చెలామణీ విపరీతంగా పెరిగింది’’’ అని ఆర్థికమంత్రిగారి శాఖ చెప్తోంది. ఐదొందల నోట్ల వాడకం 76 శాతం, వెయ్యి నోట్ల వాడకం 109 శాతం (ఓ! మైగాడ్) పెరిగాయిట! ఏదీ, కార్డులమీదే, లేదా యింటి దగ్గర ‘మోనిటర్’ మీదా బేరసారాలు సాగిస్తున్నా- లేదా బ్యాంకుల్లో క్యూల్లో నిలబడి పైకం చేసుకుని, తిరిగి తీసుకోవడానికి యాతన పడ్డా వెయ్యినోట్లు అప్పుడే కళ్లబడవు. ఐదు వందలూ, రెండు వేలూ- యివేనుట. అదో సమస్య.
‘‘నీ అకౌంట్‌లో మూడు లక్షలు దాచిపెడతావా? ఆనక తాపీగా డ్రా చేసి యిద్దువుగాని. కమిషన్ ఇస్తానంటున్నాడు మా బాస్’’ అంటూ వచ్చింది ఓ వర్కింగ్ గాళ్. ‘‘ఆ సొమ్ము తిరిగి యివ్వకపోతే, ఏం చేస్తాట్ట?’’ అనడిగాడు మేనమామ.‘‘ఏరా! అది ఉద్యోగం చెయ్యడం నీకిష్టం లేదా?’’ అంటూ వచ్చింది తల్లి. ఉప్పెనలు, వరదలూ- నీటిలాగే రుూ కష్టాలు కూడా అవే తగ్గుతాయి.
దీంట్లో పెద్ద ‘గొడ్లు’ కొట్టుకుపోతాయ్ కూడా. దేశం బాగుపడుతుంది’’ అంటున్నాడు మోదీగారి వీరాభిమాని.
‘‘అది సరే, బ్యాంకు క్యూలో నిలబడుపోయి. క్లార్కులు ఎంత చులనకగా చూస్తున్నారో?’’ ‘‘ ‘క్యూ’ శిక్షలు పగవాడికి కూడా వద్దు బాబూ’’ అంటున్నారు సామాన్యులు.
సఫర్ ది డార్క్‌నెస్ ఫరే న్యూ డాన్!