వీరాజీయం

కశ్మీర్‌లో మిర్చీ ‘తూటాల’ ప్రయోగం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్‌లో అల్లర్లు భారతదేశ అంతర్గత సమస్యయే. కాదని ఎవరంటారు? కాశ్మీరే భారత్ యొక్క అంతర్గత సమస్య అయినప్పుడు- నలభై ఎనిమిది రోజులుగా సాగుతున్న ఆందోళన అనండి- అల్లర్లు అనండి. ఏ పేరు పెట్టినా చాలామంది జనాలు భద్రతాదళాల ‘‘గన్ పెల్లెట్’’లను కంకర రాళ్లతో ఎదుర్కొంటున్నారు.
కశ్మీర్ హమారా అన్న గోల కాకిగోలగా యితరులకు అనిపిస్తే, అది పూర్తిగా వాళ్ల తప్పుకాదు. ఎంతసేపూ ‘‘కాశ్మీర్ మాదేనం’’టున్న రాజకీయ కంఠాలు- పాలకుల నినాదాలు- కశ్మీర్ రెండుముక్కలై వున్నదీ అన్న సంగతి గట్టిగా అనరు.
అవతలి ముక్కని వాళ్లు అజాద్ కశ్మీర్ అంటున్నారు. దాన్ని రంగస్థలంగా చేసుకునే అధీనరేఖ మీదినుంచి ఇండియా మీదకు రకరకాల దాడులు చేస్తున్నది పాకిస్తాన్.
దేశ విభజన నాటినుంచీ, అవతలి ముక్కలో ‘మేమంతా కశ్మీరీలం- కశ్మీర్ ఏక్‌హై’అన్న నినాదాలు పెట్రేగి వినబడుతున్నాయా? యుద్ధం కాని యుద్ధం. చొరబాటుదారుల ఆగడాలు అన్నీ ఇండోపాక్ సరిహద్దులుగా చలామణీ అవుతున్న అధీనరేఖకి అటూ యిటూ సాగుతున్నాయి.
డెబ్భయి ఏండ్లయింది ఈ కాల్పుల విరమణ రేఖ ఏర్పడి. అది నాలుగువందల అరవై మైళ్ల పొడవునా శాంతి స్థితికి పక్కలో బల్లెం లాగా కొనసాగుతూనే వుంది. 1972నుంచీ రగులుతున్న యిది ‘గీత’కటువైపువున్న కశ్మీరీలను- ‘గీత’కి యిటువున్న కశ్మీరీలను బలవంతంగా వేరుచేసి, నరకయాతనకు గురిచేస్తూనే వున్నది.
‘మిలిటెంట్లు’అన్నారు ఆనక ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అన్నారు. ఏది ఏమయితేనేం? ఇండియన్ గవర్నమెంటు కంట్లో కారం జల్లినట్లు రుూ గీత అంతా రక్తసిక్తం అల్లకల్లోలం.
దీనికి మనవాళ్లు ఒక కంచె కట్టారు. పనె్నండు అడుగుల ఎత్తున రెండు వరుసలలో వుండే రుూ కంచె- నూట ఏభై గజాల మేర- ‘‘దుర్గమం’’గా వుంటుంది. తాకితే ఛస్తారన్న ఎలక్ట్రిసిటీ- వెంటనే సైన్యాన్ని హెచ్చరించే ఆధునిక పరికరాలు గట్రా 2004నుంచే పనిచేస్తున్నా- మిగతా మార్గాల నుంచి ఉగ్రవాదుల చొరబాటు వో అలవాటుగా మారిపోయింది.
అక్కడ ఆ తలనొప్పి అలా వుండగా, లోపల ‘బుర్హన్‌వాని’చావు తర్వాత, మొత్తం కాశ్మీర్ ప్రశాంతత అన్నమాటనే మర్చిపోయింది. ఈ నేపథ్యంలో, ఒక నెల కర్‌ఫ్యూ అమలు తర్వాత హోంశాఖామాత్యులు రెండు రోజులు పర్యటన చేసి, అక్కడ అన్నివర్గాలతోనూ తలమున్కలుగా తంటాలు పడ్డాడు. రాజ్‌నాథ్‌సింగ్- ప్లెబిసైట్ వీరుడు రషీద్‌తో కూడా చచ్చేలాగా చర్చించాడు. కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీమతి మహబూబాని ప్రక్కనబెట్టుకుని, మీడియాతో మాట్లాడి- ‘పెల్లెట్‌గన్స్‌కి మంగళం పాడేస్తాం’,అనీ ‘వాటి జాగాలో ప్రాణాంతకం కాని పావా తూటాల్ని ప్రయోగిస్తాం’ అనీ హామీయిస్తూ, ఢిల్లీకి విమాన ఎక్కేశాడు.
స్వయంగా కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా రుూ అల్లర్ల వెనుక 95 శాతం కాశ్మీరీలు లేనే లేరన్నది- నీళ్లు నమలకుండా చెప్పడం- ఒక మలుపు.
‘‘బడి పిల్లలకేం పని? చాక్‌లేట్స్ పంచుతున్నారనా? సైన్యాల మీదికి పోతున్నారు? తుపాకీ తూటాలకు ఎదురొడ్డి కంకర రాళ్లు రువ్వుతూ ప్రాణాలొడ్డుతున్న రుూ పిల్లలు పాకిస్తాన్ పన్నిన వ్యూహంలోని భాగమేనని ఆమె చెప్పారు.
కర్‌ఫ్యూ వున్నది కానీ కాశ్మీరీ జనాలు తిరుగుతూనే వున్నారు. పిల్లలు ప్రయివేట్లకు వెళ్తూనే వున్నారన్న దృశ్యాలు స్థానిక పత్రికలు వేస్తూనే వున్నాయి. పిల్లల్ని ముందుకు త్రోసి, ఆ వెనుకనుంచి బాంబులు విసురుడు కార్యక్రమం-స్థానిక కశ్మీరీలు ఎందుకు చేస్తారు? వాళ్ల పిల్లల్ని వాళ్లే బలిచేసుకుంటారా? పాక్ పైకం, పాక్ ‘‘ప్రచ్ఛన్న హస్తం’’ యిక్కడ స్పష్టంగా కనబడుతున్నాయంటూ చెప్పింది ఆమె. ఈ చర్చని తప్పుదారి పట్టించే కొంతమంది ప్రశ్నలకు జవాబుగా, కుర్చీ తనే్నసి మరీ లేచి వెళ్లిపోయింది-
రాజ్‌నాథ్‌సింగ్, ‘‘అఖిల పక్షాన్ని పర్యటనకు పంపిస్తాము’’ అన్నప్పుడు అక్కడి ప్రతిపక్షమయిన కాంగ్రెస్ పార్టీ హర్షించింది అన్న సంగతి- గులాం నబీ అజాద్ ప్రభృతులు గ్రహించాలి. శ్రీమాన్ ఏచూరిగారు కూడా అక్కడ జరుగుతున్నది ఇండోపాక్ వార్ కాదు అన్న సంగతి గుర్తించాలి. మొదట రుూ పార్టీలు అన్నీ శషబిషలు లేకుండా, వాళ్ల మనసులో మాట చెప్పి, శ్రీనగర్ విమానం ఎక్కడం మంచిది. ఎంతసేపూ పాముని చావనివ్వకుండా, కర్రని విరగనివ్వకుండా- ఓపెన్‌గా మాట్లాడకుండా ఉన్నవాళ్ల అభిప్రాయాలను ప్రతిపక్షాలు కనీ సం ఒక చిత్తుప్రతిగానైనా రాసి పెట్టుకుంటే బెటర్.
గవర్నమెంటు మిర్చీ తూటాలు- అవేనండీ ‘‘పావాషెల్స్’’ వీటి మీద చాలాకాలంగా పరిశోధనలు చేయించింది. అవి జనాల్ని పొట్టనబెట్టుకునేటంత ప్రమాదకరం కావనుకునే- ప్రస్తుతం నమ్ముతోంది. పెల్లెట్‌గన్స్‌ని కూడా పరిశోధించే ప్రయోగించింది. ఇక వాటిని ఆపేస్తున్నది. వాటిని ఆపేస్తే దాడు లు, అల్లర్లు ఆగుతాయా? బుర్హన్ వని తండ్రిగారికి వివేకోద యం అవుతుందా? అంచేతనే పావాషెల్స్‌ని ఒక ఏభైవేల దాకా సప్లయ్‌కి రెడీ చెయ్యమని సదరు కర్మాగారాలకు కేంద్రం ఆర్డర్లు పంపింది. పావాషెల్స్ అనేది నోనీవామైడ్- లేదా పెలార్గానిక్ యాసిడ్ వినైల్ అమైడ్ అంటారు. సింపుల్‌గా, యివి మనం ఎండు మిరపకాయలలో వుండే, నషాళానికి అంటే ఘాటు రసాయనాలు- వీటి ప్రయోగం పెప్పర్ స్ప్రేకన్నా అపాయం తక్కువగా గలవి అయ వుంటాయి. ఒక రకంగా ఆగడాలను తాత్కాలికంగా - సమ్మోహనాస్త్రాల లాగా బంధించి పడేస్తాయిట! అంతే చంపవు.
ఒకటి అధీనరేఖ పరిరక్షణ; రెండు కశ్మీర్‌లో రుూ అల్లర్ల వెనుకగల దన్నూ, ధనం, యి రెండింటికీ విరుగుడు కనిపెట్టడం; మూడు- ఇంతకాలం నోరుమూసుకుని వూరుకున్న ఆక్రమిత కాశ్మీర్ మాదేనోయ్ అన్న పాటని ప్రపంచంలో, పెద్ద లౌడ్‌స్పీకర్‌లలో వినిపించడం జరగాలి.
‘‘కశ్మీర్‌లో- మా కాశ్మీర్‌ను మాకిచ్చేయ్. మేం కలిసే వుంటాం’ - అన్న ఉద్యమం స్థానికంగా తేలేకపోయిన ఇండియన్ గవర్నమెంటు శుద్ధ దద్దమ్మల బృందం’’ అన్నాడో యువకుడు.
అఖిలపక్షం లేదా ప్రతిపక్షాల బృందం కాశ్మీర్‌కే కాదు- ప్రపంచంలోకి కూడా వెళ్లి కశ్మీర్ ఆగడాల వెనుకనున్న ప్రచ్ఛన్న హస్తాన్ని బహిర్గతం చేయాలి. ఇది కేవలం ట్రెజరీ బెంచీలకి మాత్రమే బాధ్యత కాదు.
రేపు ఓడలు బళ్లూ- బళ్లు ఓడలూ కావన్న గ్యారంటీ ఏమిటి ప్రజాస్వామ్యంలో? అప్పుడేం చేస్తావ్? ఇది కూడా అందరూ, గొంతూ, చెరుూ్య కలపాల్సిన తరుణమే!-
టైమ్ ఫర్ ఆల్ టు గార్నర్ స్ట్రెంగ్త్!