రాష్ట్రీయం

వైద్య సిబ్బందిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిధుల దుర్వినియోగంపై కేసులు

రాజమండ్రి, నవంబర్ 28: వైద్య ఆరోగ్యశాఖలో నిధుల దుర్వినియోగం వ్యవహారంతో సంబంధం ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. 2010-11కు సంబంధించి తూర్పు ఏజన్సీలోని పిహెచ్‌సిల్లో సుమారు రూ.54లక్షలు నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి ఆయా పిహెచ్‌సిల్లో పనిచేసిన 35మందిని బాధ్యులను చేస్తూ విజిలెన్స్ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి విదితమే. వీరిలో 13మంది వైద్యులు, కొంత మంది జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, బయటి వ్యక్తులు ఉన్నారు. వైద్య ఆరోగ్యసిబ్బందితో పాటు మరికొంత మంది ట్రెజరీ సిబ్బందిని బాధ్యులను చేస్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక సమర్పించి సంగతి విదితమే. రాష్ట్రప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సమర్పించిన నివేదికలో పేర్కొన్న ఎనిమిది మంది జూనియర్ అసిస్టెంట్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. మరో తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సూపరింటెండెంట్లపై కూడా ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫైలును ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే వ్యవహారంతో సంబంధం ఉన్న 13మంది వైద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం ఇంకా తెలియటం లేదు. కింది స్థాయి సిబ్బందిని మాత్రమే సస్పెండ్ చేసి, వైద్యాధికారులను మాత్రం సస్పెండ్ చేయకుండా, మిగిలిన శాఖాపరమైన చర్యలను మాత్రమే తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. మరోపక్క విజిలెన్స్ నివేదికలోని జాబితాలో ఉన్న అందరిపైనా పోలీస్టేషన్లలో రాతపూరకంగా ఫిర్యాదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని పోలీస్టేషన్లలో కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విజిలెన్స్ నివేదికలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సిబ్బంది ఒక పిహెచ్‌సి నుండి మరో పిహెచ్‌సికి బదిలీ అయిన తరువాత కూడా బదిలీ అయిన సిబ్బంది పేరున జీతాలు డ్రా చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాహనాల అద్దెకు సంబంధించిన మొత్తాలు కొంత మంది సిబ్బంది బంధువుల ఖాతాల్లో జమయినట్టు కూడా విజిలెన్స్ విచారణలో తేలింది.