Others

అంతేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న కాజల్ రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తోందని వినిపిస్తున్న పుకార్. ఈ పుకారో నిజమో గానీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తనకున్న క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ద్విభాషా చిత్రాలను రూపొందిస్తున్నారని, అందుకే రెండు భాషలకు కలిపి ఈ విధంగా తాను డిమాండ్ చేస్తుండడంలో తప్పేంలేదంటోంది కాజల్. ప్రస్తుతం తెలుగులో, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు సరసన, తమిళంలో జీవా, విక్రమ్, విజయ్‌ల సరసన భారీ చిత్రాల అవకాశాలు కొట్టేసింది. విజయ్‌కి 60వ సినిమా అవడంతో ఈ సినిమాపై ప్రత్యేకతను తమిళ పరిశ్రమ ఆపాదిస్తోంది. రెండున్నర కోట్ల పారితోషికం అడిగినా ఆమెనే ఎంపిక చేశారట. కొత్తగా వస్తున్నవాళ్లు కూడా దాదాపు ఇంతకు దగ్గర దగ్గరగానే డిమాండ్ చేస్తుండడంతో టాప్‌స్టార్‌గా వున్న కాజల్ అంత అడగడంలో తప్పేంలేదని కోలీవుడ్ చెబుతోంది. మొత్తానికి రెండు భాషల్లో వచ్చిన క్రేజ్‌ను ఆ విధంగా క్యాష్ చేసుకుంటోందన్నమాట.