ఈ వారం తార

ఉందా.. లేదా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటది? అన్న డౌటొస్తోంది కదూ! ఏం ఉందో.. ఏం లేదో తెలియాలంటే కొద్దిరోజులు
ఆగాలంటోంది అందాల అంకిత. బెంగళూరు నుంచి ఎగిరొచ్చిన
ఈ బ్యూటీ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలే చేసింది. తెలుగు స్క్రీన్‌పై తొలిసారి హీరోయిన్‌గా ‘ఉందా.. లేదా’ అంటూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పోస్టర్‌పై సిగ్గుల మొగ్గై.. సగం ముఖాన్ని చేత్తో కప్పుకొని సింపుల్‌గా కనిపిస్తుందని తక్కువ అంచనా వేసుకోనక్కర్లేదట. డాన్స్ తెలుసు. యాక్షన్ సీన్స్ చేయాలన్నా కరాటే తెలుసు.
అంతకుమించి.. నటనమీద మమకారపు రుచి తెలుసు. అందుకే ఈ బెంగళూరు బ్యూటీ -వీక్షకుల మనస్సుల్ని
మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమైపోయింది. చూట్టానికి పక్కింటి
అమ్మాయిలా.. పరిచయస్థురాలిలా
అనిపిస్తున్న ఆమెలో దోబూచులాడే భావాలను పట్టుకోటానికి కుర్రకారు ఎంత ఉర్రూతలూగుతారో..
అసలు అంత సీన్ ‘ఉందో-లేదో’
త్వరలోనే చూద్దాం.