Others

స్క్రిప్ట్‌లో సత్తావుంటేనే.. (డైరెక్టర్స్ ఛాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు కిషోర్ తిరుమల

స్క్రిప్ట్ బలంగా ఉంటే -సినిమా కష్టాలు తగ్గుతాయి. అలాంటి
సినిమాలు ఆడియన్స్‌కు కనెక్టవుతాయి కూడా అంటున్నాడు
కిషోర్ తిరుమల. దర్శకుడు ఫీలైంది ఆడియన్‌కి కనెక్ట్ చేస్తూ కథను క్లారిటీగా నేరేట్
చేయాలన్నది -కిషోర్ తిరుమల భావన. ‘నేను... శైలజ’ను
తెరకెక్కించిన కిషోర్‌తో
చిట్‌చాట్.

మీ నేపథ్యం?
మాది తిరుపతి. నాన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తారు. రోటీనే అయినా చాలామందిలాగే చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే తిరుమలకు వచ్చే సినీ ప్రముఖులను కలిసేవాడిని. ఆ పరిచయాలే 2005లో నన్ను హైదరాబాద్‌కు లాక్కొచ్చాయి.
ఎవరితో వర్క్ చేశారు?
కొరటాల శివ, బివిఎస్ రవి దగ్గర రైటర్‌గా కొంతకాలం పని చేశా. సొంత కథతో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో తమిళంలో సినిమా చేశా. తెలుగులో సెకెండ్ హ్యాండ్ మూవీ చేశా. ఇప్పుడిదిగో.. ఇలా.
స్రవంతిలో చాన్స్ ఎలా?
నిజానికి ఓ ఇన్‌స్పైర్డ్ లైఫ్ నుంచి కథ రాసుకున్నా. నిర్మాత రవికిషోర్‌కు వినిపించా. ఆయనకు నచ్చింది. సినిమా చేద్దామన్నారు. అదే ‘నేను... శైలజ’.
లైఫ్ స్టోరీనా?
బయో పిక్ కాదుగానీ, బయో లైఫ్‌కు దగ్గరగా ఉండే స్టోరీ. నిజానికి ఈ కథలో లీడ్ లైఫ్ నాకొక ఇన్‌స్పిరేషన్. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని హత్తుకుంటుంది.
తరువాతి ప్రాజెక్టులు?
కంగారు లేదండి. ప్రస్తుతానికి కథలైతే ఉన్నాయి. ఇంకా ఎవరినీ అప్రోచ్‌కాలేదు. ఈ సినిమా తరువాత వాటిగురించి ఆలోచిస్తా.
ఎలాంటి జోనర్ ఇష్టం?
అన్ని జోనర్లూ ఇష్టమేకానీ, లవ్ జోనర్‌కు మాత్రం తొందరగా కనెక్టైపోతాను. డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో ప్రేమ కథలతోనే కొన్ని ప్రాజెక్టులు చేయాలని ఉంది.

-ద్వివేది