ఈ వారం తార

దీక్షా’దక్షత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మసక వెనె్నల మగువ రూపం తీసుకున్నట్టుండే -దీక్షాపంత్ చకచకా సినిమాల చేస్తున్నా ఇంకా సరైన బ్రేక్ పడలేదు. పేరు తెచ్చే పెద్ద క్యారెక్టర్ ఒక్కటీ పడకపోవడమే ఇందుక్కారణమంటున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో కెరీర్ మొదలెట్టిన దీక్ష -పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబోలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేసింది. తరువాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలోనూ తళుక్కుమంది. ఆమె నటిస్తున్న చిత్రాలు హిట్టవుతున్నా -దీక్షకు మాత్రం లక్కు లక్కలా అతుక్కోలేదని ఆమె సన్నిహితులే అంటున్నారు. అబ్బాయితో అమ్మాయి, కవ్వింత, ఓ స్ర్తి రేపురా లాంటి చిత్రాల్లో సోలో రోల్స్‌తో తన శైలి చూపించినా -కెరీర్ మాత్రం కష్టంగానే
సాగుతోందన్నది నిజం. తాజాగా
ముకుంద ఫేం శైలేష్ బొలిశెట్టి
హీరోగా విడుదలకు సిద్ధమవుతున్న
చల్‌చల్ గుర్రం చిత్రంలో వైవిధ్యమైన
పాత్ర చేసిన దీక్ష -్ఫ్యచర్ కెరీర్ మీద
గంపెడంత ఆశతో ఉందట. దొరికిన
పాత్రను
చేయడమే తప్ప, అదెంత ఫేం
తెస్తుందో ముందే ఎందుకు
లెక్కలేసుకోవడం
అంటోంది దీక్ష.

దొరికిన పాత్రలు
చేసుకుంటూ
ముందుకెళ్లడమే
ఇప్పుడు నాముందున్న కర్తవ్యం. నాగురించి
ఏమనుకుంటున్నారోనని
ఆలోచిస్తూ కూర్చుంటే..
ఇంకా ఎక్కడో
ఉండేదానే్నమో.