Others

నాకు నచ్చిన సినిమా కంచుకోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు విశే్వశ్వరరావు నిర్మించిన విశ్వశాంతి పిక్చర్స్ కంచుకోట 1968లో విడుదలైంది. జానపదంలో సస్పెన్స్‌ను మేళవించి అద్భుతంగా రూపొందించారు. మహారాజు, అతని తమ్ముడు -మంత్రి కుయుక్తులకు బలైపోయిన కథ. సినిమా గురించి చెప్పేకంటే చూసి తీరాల్సిందే. ఎన్టీఆర్, కాంతారావు, దేవిక, సావిత్రి, ధూళిపాళ, ఉదయ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, పద్మనాభం, వాణిశ్రీ, సత్యనారాయణ, చదలవాడ, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య, శాంతకుమారి వంటి మహానటులు నటించారు. ఆ రోజుల్లోనే ఐటెమ్ సాంగ్ అన్నట్టుగా ఈ చిత్రంలో ఓ పరిచయంలాంటి పాట ఉంటుంది. అదే -ఈడొచ్చిన పిల్లనోయ్. అందరికీ నచ్చేపాట అది. మహారథి రచన, కెవి మహదేవన్ సంగీతం అద్భుతం. ‘సిగ్గందమే స్ర్తికి, సిగ్గందమే’ పాట దేవిక, సావిత్రిలపై చిత్రించారు. వీరిద్దరిపైనే కోరస్‌తో ‘నీ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు’ ఇప్పటికీ రేడియోలో వినిపిస్తుంది. ‘లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు, ఇలా ఉరకలు వేస్తావు’ దేవికపై చిత్రీకరణ, భంభంభం పటపటపట భజగోవిందం పాట పద్మనాభం, వాణిశ్రీలపై చిత్రీకరించిన విధానం బావుంటుంది. వీటన్నిటికన్నా అద్భుతమైన పాట ‘సరిలేరు నీకెవ్వరు, నరపాల సుధాకర’ అన్న పాటను మామ కంపోజింగ్‌లో సుశీల, జానకి పోటాపోటీగా ఆలపించారు. అందుకు ఎల్ విజయలక్ష్మి చేసిన నృత్యాలు అద్భుతంగా ఉంటాయి. సినిమా మొదటినుండి హాయిగా సాగినా మధ్యలో ఊపిరి తీసుకోలేనంత సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగి ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఎన్నిసార్లు చూసినా చిత్రం మరోసారి చూసేలా ఉంటుంది. అందుకే ఈ సినిమా అంటే అంత ఇష్టం.

-హెచ్‌ఎస్ లక్ష్మీప్రసన్న, దావణగెరె, కర్ణాటక