Others

మ్యాజిక్ కల్లయ్య ...శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల్లో కరడుగట్టిన విలన్‌గా నటిస్తూ -ఆంధ్రుల ఏకైక విలన్‌గా పేరుగాంచిన నటుడు రాజనాల. అసలు పేరు రాజనాల కల్లయ్య. నెల్లూరులో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కల్లయ్యను రోహిణీ ఫిలింస్ బ్యానర్‌పై తాను నిర్మిస్తున్న ప్రతిజ్ఞ (1953) ద్వారా ప్రధాన విలన్‌గా పరిచయం చేస్తూ కేవలం ఇంటి పేరును మాత్రమే స్థిరపరచారు నిర్మాత, దర్శకుడు హెచ్‌యం రెడ్డి. ఇదే చిత్రం ద్వారా హీరోగా కాంతారావునూ పరిచయం చేసారు. హెచ్‌యం రెడ్డి ఈ చిత్రం తర్వాత ఇద్దరూ వెనుతిరిగి చూడలేదు. వందలాది చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెర మీద విలన్‌గానే కాకుండా రాజనాలకు మ్యాజిక్ విద్యలో కూడా ప్రవేశం ఉంది. మిత్రులవద్ద మ్యాజిక్‌ను ప్రదర్శిస్తుండేవారు. ఇక రాజనాల గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావుతో కూడా పలు చిత్రాల్లో ప్రధాన విలన్‌గా నటించి మెప్పించిన రాజనాల కృష్ణాంజనేయయుద్ధం చిత్రంలో రామభక్తుడైన ఆంజనేయ పాత్రలో కూడా నటించాడు. ఈ చిత్రం నిర్మాణ సమయంలో విలన్ పాత్రల రాజనాల ఆంజనేయ పాత్రలో నటించడమేమిటి అని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచాయి. ఈ చిత్రంలో ఆంజనేయ పాత్ర విలన్ పాత్రా అని మరి కొందరు కామెంట్ చేసారు. విమర్శించిన పెదవులతోనే శెహభాష్ అని ప్రశంసలు పొందారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలో రాజనాలకు కుమార్తె జన్మిస్తే ఆ చిన్నారి పేరు పావని అని పెట్టుకొన్నారు, ఆ పాత్ర పట్ల మక్కువతో. అసలు విషయం ఏమిటంటే ప్రేక్షకుల అభిమానం తప్ప ఆర్థికంగా చితికిపోయిన రాజనాల కుటుంబం పట్ల జాలితో ఇల్లు స్థలం కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లో.
కానీ ఆ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకొన్నారు. ప్రజాభిమానాన్ని అమితంగా చూరగొన్న
రాజనాలకు ప్రభుత్వం పద్మ అవార్డులలో ఎలాంటి శ్రద్ధవహించలేకపోయినా ఆ స్థలాన్ని
ఆ కుటుంబానికి దక్కేలాచేసి ఆ కుటుంబానికి సహాయమైనా చేస్తే మంచిది.
హైదరాబాద్‌లో ఒక మ్యాజిక్ షోకు ముఖ్యఅతిథిగా వచ్చి మిత్రుల కోరికపై సాటి మెజిషియన్‌తో కలిసి పలు ఐటమ్స్‌లో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను ఆనందపరచిన అనంతరం మెజీషియన్
నుంచే అభినందనలు అందుకుంటునప్పటి కల్లయ్య చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717