Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం ఎక్కడెక్కడి సినిమాలకు ఏదో కొన్ని థియేటర్లు
దొరికినట్టున్నాయి. అందుకే దాదాపు తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయని అనిపించుకున్నాయి. శ్రీకాంత్ కథానాయకుడుగా సతీష్‌కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన టెర్రర్, చాలాకాలం తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఎలుకా-మజాకా, నాగార్జున ప్రచారం చేసిన ‘పడేశావే’ చిత్రాలతోపాటుగా రాజుగారింట్లో 7వరోజు, వీరివీరి గుమ్మడిపండు, రొమాన్స్ విత్ ఫైనాన్స్, అమ్మాయిగోల శ్రీకృష్ణలీల, క్షణం చిత్రాలతోపాటుగా తమిళంనుండి వచ్చిన యమపాశం చిత్రాలు విడుదలయ్యాయి. టెర్రర్, క్షణం, ఎలుకా మజాకా చిత్రాలు వౌత్‌టాక్‌తో మంచి కలక్షన్లు రాబడుతున్నాయి. పడేశావే చిత్రాన్ని రెండోరోజుకే బాక్సులో పడేసి పాత చిత్రం ‘నేను శైలజ’ చిత్రాన్ని వేస్తున్నారు థియేటర్లలో. ఇక యమపాశం ప్రేక్షకుల పాలిట యమపాశమే అయింది. అమ్మాయిగోల శ్రీకృష్ణలీల, రొమాన్స్ విత్ ఫైనాన్స్, రాజుగారింట్లో 7వ రోజు, వీరివీరి గుమ్మడిపండు చిత్రాలు ప్రేక్షకుడికి దొరకడం లేదు. మొత్తానికి ఈవారం టెర్రర్, క్షణం, ఎలుకా-మజాకా చిత్రాలు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండి మెప్పిస్తున్నాయి. నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా అర్ధశత దినోత్సవానికి పరుగెడుతోంది.