Others

నీవుండే దా కొండపై.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఎన్ రెడ్డి నిర్మించిన భాగ్యరేఖ చిత్రంలోనిదీ పాట. పేదపిల్ల అయిన జమున (లక్ష్మి) తన తల్లిదండ్రులు గతిస్తే మేనత్త మేనమామ పంచన చేరుతుంది. మేనత్త కూతురికి వచ్చిన పెళ్లి సంబంధంవారు ఆమెను జానకి (కాత్యాయని)ని కాకుండా జమునను ఇష్టపడతారు. మేనత్త (సూర్యకాంతం) అగ్గిమీద గుగ్గిలమవుతుంది. గతిలేని పరిస్థితుల్లో తాతగారింటికి వెళ్లినా అక్కడా తాత మరణిస్తే మళ్లీ మేనత్త వద్దకు చేరినా ఆమె సూటిపోటీ మాటలకు విరక్తిచెంది ఆత్మహత్య ప్రయత్నంగా తిరుపతి చేరి ఒక ధనవంతుల అమ్మాయిని రక్షించి వారి కుటుంబానికి చేరువై మద్రాసులో అడుగుపెడుతోంది. అక్కడ వారి అబ్బాయి రవి (ఎన్‌టిఆర్) ప్రేమకు పొంగిపోతుంది. అక్కడ కూడా మేనత్తవారి పెళ్లిని చెడగొడ్తుంది. మేనత్త కూతురు కాత్యాయిని సినిమా పిచ్చితో ప్రేమికుడి (రేలంగి)తో మద్రాసు వచ్చి ప్రమాదాన పడబోతే లక్ష్మి (జమున) రక్షిస్తుంది. తర్వాత సుఖాంతమై రవి (ఎన్‌టిఆర్)తో పెళ్లవుతుంది. రవి ఇంట్లో ఆశ్రయించి ఉండగా వెంకటరమణని ఉద్దేశించి పారిజాత పూవులు కోస్తూ పాడిన పాట ఇది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రచించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చగా సుశీల అద్భుతంగా పాడిన పాట -నీవుండే దా కొండపై నా స్వామి/ నేనుండే దీనేలపై/ ఏ లీలసేవింతునో/ ఏ పూల పూజింతునో.
శ్రీపారిజాత సుమాలెన్నో పూచే/ ఈ పేదరాలి మనస్సెంతో వేచె/ నీ పాదసేవ మహాభాగ్యమేరా/ నాపైన దయ జూపవా నాస్వామి/
దూరాన నైనాకనే భాగ్యమీవా/ నీ రూపు నాలో సదా నిల్పనీవా/ ఏడుకొండలపైనా వీడైనా స్వామి/ నాపై నీ దయ జూపవా నా స్వామి/ -అని పాడిన సుశీల గొంతు నిజంగా అద్భుతం.

-పట్టెసపుశేషగిరిరావు, విశాఖపట్నం