మీ వ్యూస్

ఆంగ్ల పేర్లు (మీ వ్యూస్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి బరిలో దిగిన నాలుగు తెలుగు చిత్రాలు, వాటి పేర్లు గమనిస్తే తెలుగు సినిమా పరిశ్రమ ఇంగ్లీషుపై ఎంత ఆధారపడిందో అర్ధమవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా అచ్చమైన తెలుగు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది. అదేవిధంగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పేరులోనూ మధురం ఉన్నా, సినిమా మొత్తం మాత్రం విదేశాల్లో షూట్ చేశారు. మిగతా రెండు చిత్రాలు ఇంగ్లీషు టైటిల్స్‌తో వచ్చాయి. అందుకే మిక్స్‌డ్ విజయాలు అందుకున్నాయి. తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెడితేనే బావుంటుందేమో.
-పెయ్యల శ్రీనివాసరావు, అలికాం

నకిలీ తళతళ
అన్నీ వెల్డింగ్ కథలే అన్న వ్యాసం నచ్చింది. వెల్డింగ్ కథ అన్నమాటే కొత్తగా అతికినట్టు సరిపోయింది. నిజమే ఇప్పుడు ఇంజనీర్లు, విద్యాధికులు చిత్ర రంగంలోకి దూకుతున్నారు. నేటి యువతరానికి అచ్చు పుస్తకంలో ఉన్నది బట్టీబట్టి దించేయడం, ఇతరులు రాసిచ్చింది కాపీకొట్టి పాసవ్వడమో తెలుసు. నైపుణ్యం లేని వాడివద్దకు ప్రజలు రారు. నైపుణ్యం లేనివారికి రాజకీయాలు, సినిమా రంగం శరణ్యం. అందుకే అందరూ సినీ రంగంలో దూరి నకిలీ తళతళలు వెల్డింగ్ చేసి జనం మీదకు వదులుతున్నారు.
-ఎ శాంతిసమీర, వాకలపూడి

పద్మశ్రీలు
కేంద్రం కళాకారులకు పద్మశ్రీలు ప్రదానం చేస్తోంది. గతంలో అనేకమంది గొప్ప గొప్ప నటీనటులున్నా, ఇప్పుడు చెత్త సినిమాలు రూపొందించే వాళ్లకి వాటిని ఇస్తున్నారు. రాజనాల, రాజబాబు, కాంతారావు, ఎస్వీ రంగారావు, ముక్కామల, జగ్గయ్య, పద్మనాభం, కృష్ణకుమారి, చలం, జమున, సావిత్రి, సూర్యకాంతం, అంజలీదేవి, ఛాయాదేవి, గిరిజ, సత్యనారాయణ, రాజసులోచన, జయసుధ, రమ్యకృష్ణలాంటి ఎందరో గొప్ప నటీనటులు మనకున్నా వారికి పద్మశ్రీలు అందని పండులానే ఊరిస్తున్నాయి. వాళ్లకూ పద్మ అవార్డులు ప్రకటించి రాబోయే తరాలకు జ్ఞాపకాలుగానైనా మిగల్చాలి.
-సిహెచ్ నాగేశ్వరరావు, సికిందరాబాద్

కుటుంబ సమేతంగా..
నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా మహిళలను విశేషంగా ఆకర్షిస్తోంది. నాగార్జున నటనలో కొత్తదనం కనిపించింది. సోషియో ఫాంటసీ దర్శకత్వ ప్రతిభ, వీనులవిందైన పాటలు సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి. కెమెరా బాగుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నాగార్జున పంచెకట్టు వెరైటీ ఫైట్స్, ఆత్మ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
-ఎల్ ప్రపుల్లచంద్ర, ధర్మవరం

సెకండ్ షో
రీ ఎంట్రీ ఇస్తున్న తారల గురించి సెకండ్‌షోలో బాగా చెప్పారు. గతంలో వారు సాధించుకున్న ఇమేజ్‌వల్ల సెకండ్‌షోలోను రాణిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోని పాత్ర స్వరూప స్వభావాలు వారి ఇమేజ్ పెంచేవిగా ఉండాలి. అలా లేకపోవడంవల్ల రోజా, సరిత, రతిలాంటి నాయికలు ఫెయిలయ్యారు. శ్రీదేవి హిందీ చిత్రంలో రాణించినా తమిళలో పులిని రక్షించలేకపోయింది. ఇమేజ్‌పెంచే బాహుబలిని వద్దని తప్పుచేసింది. బాలకృష్ణలాంటి హీరోకి డిక్టేటర్‌లో రమ్యకృష్ణ రాణించేది. దర్శకులు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి.
-బి సోనాలి, సూర్యారావుపేట

వారసులు
తండ్రికి తగ్గ తనయుడుగా నాగార్జున రాటు తేలాడు. తనలోని లోపాలను తన నటనతో మెప్పించి, ఒప్పించి మన్మధుడిలా కనిపిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండితెర, బుల్లితెరపై చెలరేగిపోతున్నాడు. అన్నమయ్య, రామదాసు, శిరిడీసాయిగా మంచి పాత్రలు చేశాడు. బంగార్రాజుగా, అమాయకమైన రాముగా సోగ్గాడే చిన్నినాయనాలో మెప్పించాడు. కొత్త దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహించే నాగార్జున ఈ చిత్రంతో ఓ మంచి హిట్‌ను కొట్టాడు.
- కె.ఎన్‌ఎస్, హైదరాబాద్

దేశభక్తి
వెనె్నలలో దేశభక్తిలేని సినిమా వ్యాసం ఆలోచింపచేసింది. జానపదం, పౌరాణికం తప్పితే ప్రతి సినిమాల్లో ఆనాటి చిత్రాల్లో చర్చలు, సందేశాలు, ప్రబోధాలు ఉండేవి. ప్రతి ప్రేక్షకుడిలో దేశభక్తి నింపేందుకు పాటలు, సన్నివేశాలు, సంభాషణలు ద్వారా చిత్తశుద్ధితో నాటి రచయిత, దర్శకులు కృషిచేసేవారు. సినిమా పూర్తయ్యాక జనగనమణ పాట జాతీయ జెండాపై చిత్రీకరించి ప్రదర్శించేవారు. ప్రేక్షకులంతా ఆ పాట పూర్తయ్యేదాకా నిలబడి చివరిలో జైహింద్ అని చెప్పుకుని, సినిమా చూసిన ఆనందంతో బైటికి వెళ్లిపోయేవారు. ఇప్పుడు అలాంటి సన్నివేశం ఒక్కటైనా మనం చూడగలమా? సినిమాలను వ్యాపారాత్మకంగా మార్చి ఇమేజ్ చట్రంలో బిగించి, కమర్షియల్ విలువలతో నింపేసి, ఆధ్యాత్మికత, దేశభక్తిలాంటి ఉత్తమ విలువలకు తెలుగు సినిమా ఏనాడో తిలోదకాలిచ్చేసింది. దేశభక్తి అంటే ఓ బూతుపదం అన్నట్టుగా నేటి సినిమాతరం వక్రభాష్యం చెబుతోంది. బాలీవుడ్‌లో దేశభక్తి చిత్రాలు అడపాదడపా వచ్చి హిట్టవుతుంటే మన వాళ్లకు ఇంకా జ్ఞానోదయం కాలేదు.
-సిహెచ్ సాయిఋత్త్విక్, నల్గొండ

గొప్ప నటుడు వంకాయల..
వెనె్నల్లో సెకండ్‌షో సుదీర్ఘ వ్యాసం నిన్నటి తరం కథానాయికల గురించి చక్కగా చెప్పారు. బాక్సింగ్, రెజ్లింగ్ బాడీబిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి వాటిల్లో ప్రావీణ్యం గడించిన వ్యక్తి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఆల్‌రౌండర్, మారధాన్ రన్నర్, క్వాలిఫైడ్ అకౌంటెంట్‌లాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన అరుదైన నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి గురించి మంచి విషయాలు తెలియజేశారు. రజనీకాంత్, రాఘవేంద్రరావుల ఛాయాచిత్రం బాగుంది. చిట్టిచెల్లెలు చిత్ర విశేషాలు ఆకట్టుకున్నాయి.
-అల్లాడి వేణుగోపాల్, బారకాసు