Others

నాకు నచ్చిన సినిమా సీతాకోకచిలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకు మరణం లేదు. దానికి ఎల్లలు లేవు. కులమతాలు అసలే లేవు అంటూ అలలపై నాట్యమాడే అందమైన ప్రేమికుల అనుభూతులను చక్కనైనా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించిన సీతాకోక చిలక సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందంటే ఆ పాటల స్థాయి ఎలాంటిదో అర్థం అవుతుంది. వేటూరి కలం నుండి జాలువారిన పాటలన్నీ అమృతపు సోనలే. సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే, మినే్నటి సూరీడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా, అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే, పాడింది పాడింది పట్నాల కాకి కాకా కీకీ కూకూ లాంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రేమకు కులమతాల బేధం లేదంటూ ఓ హిందూ యువకుడు ఓ క్రిస్టియన్ యువతి ఎలా ఒకటై, సీతాకోక చిలకల్లా సంఘంలో ఎగిరిపోయారు అనే అంశాన్ని తీసుకొని దర్శకుడు భారతీరాజా అద్భుతమైన దృశ్య సంగమాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమాకు కెమెరా పనితనం ఓ అద్భుతమైన వరం. ప్రతీ ఫ్రేమ్ ఓ మంచి చిత్రకారుడు చిత్రించిన పెయింటింగ్‌లా ఉంటుంది. శరత్‌బాబు, స్మితల నటన తారాస్థాయినందుకుంది. కథానాయకులు మురళి, ముచ్చర్ల అరుణల మధ్య చిత్రీకరించిన పాటలు చూసే వారికి హాయిగా ఉంటాయి. ముఖ్యంగా సముద్ర కెరటాల మధ్య రూపొందించిన పాటలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. తమిళంలో రూపొందించిన అలైగల్ ఓవదిల్లై చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా రూపొందించినా, మాతృకకన్నా అద్భుతంగా చిత్రీకరించి తెలుగు ప్రేక్షకులకు ఓ వరంలా ఈ సినిమాని అందించారు దర్శక నిర్మాతలు.

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

* ప్రతి శుక్రవారం వెలువడే వెనె్నలకు రచనలు మంగళవారం లోపు చేరాల్సి వుంటుంది.
* రచనల్లో కొత్తదనం ముఖ్యం
* అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
* కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
* తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
* కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
* ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలు వుంటే పంపొచ్చు.
* రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
* ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- తంగిరాల సందీప్, పిట్స్‌బర్గ్