Others

రెండూ ఇష్టమే! - అవసరాల శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టాచెమ్మా చిత్రంతో పరిచయమై అనేక సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకుడు కావాలన్న లక్ష్యంతో వచ్చినందుకు -‘ఊహలు గుసగుసలాడే’ రూపొందించి హిట్ అందుకున్నాడు. మీలో నటుడున్నాడా? దర్శకుడున్నాడా? అన్న ప్రశ్నకు మాత్రం -ఇద్దరూ ఉన్నారంటున్నాడు.
అవసరాలతో ఈవారం చిట్‌చాట్..

నేపథ్యం?
హైదరాబాద్‌లో పుట్టి పెరిగి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. యుఎస్‌లో డిప్లమో చేశా. అష్టాచెమ్మా ఆడిషన్స్‌తో స్క్రీన్ మీదకొచ్చా. తరువాత ఓపెన్ పేజీయే.
దర్శకుడిగా..?
టార్గెట్ -డైరెక్షనే. స్క్రిప్ట్ రైటింగ్‌లో డిప్లమో చేశాను కనుక డైరెక్షన్‌పై పట్టు కోసం ప్రయత్నించా. నటుడిగా చాన్స్ వస్తున్నాయి కనుక చేస్తూనే -టార్గెట్ రీచ్ కావడానికి ట్రై చేస్తున్నా.
ఇష్టమైన జోనర్స్?
డ్రామా అంటే చాలా ఇష్టం. ఎలాంటి కథనైనా ప్రేక్షకుడికి నచ్చేలా డ్రామా చూపిస్తే నచ్చుతుందని నమ్ముతున్నా.
కొత్తవాళ్లకు ప్రోత్సాహం?
తెలుగు పరిశ్రమలో దానికి తక్కువేం లేదు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్ వరకూ వస్తున్నవాళ్లు ఎంతమంది లేరు. ప్రతిభ ఉన్నోళ్లకు ప్రోత్సాహానికి కరవు లేదు.
తొలి అవకాశం?
నచ్చిన కథ రాసుకొని ఎంతోమందికి చూపించాను -అవకాశం కోసం. చివరికి కొర్రపాటి సాయికి నచ్చి డైరెక్టర్‌గా ఫస్ట్ చాన్స్ ఇచ్చారు.
సమస్యలు?
పరిశ్రమలో సమస్యల్ని ప్రత్యేకంగా చూడలేం. చిన్న సినిమా నిర్వచనం ఇప్పటికీ నాకు తెలీదు. సినిమా ఏదైనా రెండు గంటలే. కథే బలంగా ఉండాలి, సినిమా బావుండాలి. ప్రేక్షకుడికి నచ్చితే సినిమా ఆడేస్తుంది, సక్సెస్ అయిపోతుంది.
దర్శకుడంటే?
నాకు తెలియదు. కెప్టెన్ ఆఫ్ షిప్‌గా మాత్రం ఉండాలి. ప్రజలు మాట్లాడుకునే విషయాలు, వ్యవహారాలు, ఆచారాలు తెలిసుండాలి. ప్రపంచాన్ని దేవుడు సృష్టించినట్టే, సినిమాలో ప్రపంచాన్ని దర్శకుడు ఆవిష్కరించాలి. ప్రతి విషయంపై క్లారిటీ ఉండాలి. ఇదే నాకు తెలిసింది.

-శేఖర్