మెయిన్ ఫీచర్

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందేరాల సంక్రాంతి హడావుడిలో నాలుగు సినిమాలొచ్చాయి. సీజన్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిజంగానే కనువిందు చేశాయి. బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పండగ సీజన్ కనుక -నాలుగు చిత్రాలూ ఎవరి స్టామినానుబట్టి వాళ్లు మొదటి నాలుగు రోజులు కలెక్షన్లు రాబట్టారు. బి, సి సెంటర్లలో డిక్టేటర్ కలక్షన్లు రాబడుతుంటే, నాన్నకు ప్రేమతో చిత్రం మల్టీప్లెక్స్ వర్గానికే పరిమితమైందన్న టాక్ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్న ఎక్స్‌ప్రెస్‌రాజా కామెడీతో ఆకట్టుకుంది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా ఓరకంగా అచ్చమైన సంక్రాంతి చిత్రంగా వౌత్‌టాక్ తెచ్చుకుని కలక్షన్లు రాబట్టింది. చాలాకాలం తర్వాత అచ్చమైన తెలుగుతనంతో, సోషియో ఫాంటసీగా రూపొందిన చిత్రం అనిపించుకుంది.