ఈ వారం తార

సీక్వెల్ ఫీవర్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సినిమాకు కలిసొచ్చేది.. తెలుగు సినిమాకు అచ్చిరాని ఒకే ఒక పదం -సీక్వెల్. సీక్వెల్ చేస్తే గ్యారెంటీ హిట్ అని అక్కడనుకుంటే -సీక్వెల్ చేస్తే హండ్రెట్ పర్సంట్ ఫ్లాప్ అన్న నమ్మకం ఇక్కడ బలపడిపోయింది. టాలీవుడ్‌లో సీక్వెల్స్ కాని సీక్వెల్స్ కూడా నిలబడిన దాఖలాలు లేవు. అంటే -మొదటి సినిమా పేరు, కథను పోలివుండే కథాంశంతో తీసినా గట్టెక్కిన దాఖలాలు కనిపించవు.

సీక్వెల్‌కు సిన్సియర్ డెఫినిషన్ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ -ఎక్కువ సీక్వెల్స్ చేసి అంతే స్థాయలో ఫ్లాపులూ మూటగట్టాడు. కొద్దికాలం క్రితం పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ చేశాడు. సీక్వెల్ కాదంటూనే, అదే షాడో సన్నివేశాలతో చేసిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ విఫలమై టాలీవుడ్ సీక్వెల్ సెంటిమెంట్‌ని బలంగానే నిలబెట్టింది. హిట్టు సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా, ఆ కోణంలో టాక్ తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ‘నాగవల్లి’ ప్లాప్ ముద్రవేసుకున్న సంగతిని మర్చిపోలేం. ఇన్ని ఉదాహరణలున్నా -టాలీవుడ్‌లో సీక్వెల్ ప్రయోగాలకు ఏమాత్రం వెరవడం లేదన్నది నిజం. హిట్టు సినిమాలకు చేస్తున్న సీక్వెల్స్ ఎందుకు హిట్టవ్వవన్న పట్టుదలతో నిర్మాణం జరుపుకుంటూనే వున్నాయి. ఇక్కడ -ఎవరి నమ్మకం వారిది. బుల్లితెర నుంచి వెండితెరకొచ్చిన ఓంకార్ తొలి సినిమాతో పరాజయం బలాన్ని చవిచూశాడు. తర్వాత తేరుకుని.. చిన్న సినిమాను నమ్ముకుని బిగ్ హిట్ కొట్టాడు. ఆ సినిమాయే ‘రాజుగరి గది’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టుకొట్టిన దీనికి -సీక్వెల్‌ను పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పివిపి చిత్ర నిర్మాణ సంస్థ సారథ్యంలో వస్తున్న సీక్వెల్‌లో -వరుస హిట్లుతో ఊపుమీదున్న సీనియర్ హీరో నాగార్జున ఆ సినిమా చేయబోతున్నాడన్నది ఇండస్ట్రీ టాక్. పోయిన సంక్రాంతికి తన కెరియర్‌లోనే బిగ్ హిట్టు అందుకున్న నాగార్జున -‘సోగ్గాడే చిన్నినాయిన’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ చేస్తున్నాడు. గతంలో శంకర్‌దాదా ఎంబిబిఎస్‌తో హిట్టందుకున్న చిరంజీవి -సీక్వెల్‌గా శంకర్‌దాదా జిందాబాద్ బోల్తాకొట్టిన విషయం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. సెంటిమెంట్‌ను కళ్ళారా చూస్తున్నా అగ్రహీరోల నుంచి అప్‌కమింగ్ హీరోల వరకూ సీక్వెల్స్‌కు సై అంటూనే ఉండటం గమనార్హం.
**
ప్రస్తుతం సీక్వెల్ వరసలో ఉండి భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం -బాహుబలి. విడుదలకు ముందస్తు సంకేతాలుగా ‘లుక్’ పోస్టర్లు విడుదలవుతున్నాయి. సినిమా కూడా సీక్వెల్ మాటను అదేపనిగా ప్రస్తావించకుండా -బాహుబలి.. ది కంక్లూజన్ అంటూ వస్తోంది. అయితే పోస్టర్‌పై చెప్పకనే చెబుతూ రెండు అంకెను వేశారు. ఇప్పటివరకు ఫ్లాప్ రుచి తెలీని దర్శకుడు రాజవౌళి, సీక్వెల్‌ను ప్లాన్ చేసి ధైర్యంగా ముందుకువెళ్తున్నాడు. దీంతో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందే చాలా హడావుడి చేసింది. వరస లుక్ పోస్టర్లతో హైప్ తెచ్చుకుంది. దేహధారుడ్య చిత్రాలను సైతం విడుదల చేసింది. సెట్ డిజైన్లు.. మేకింగ్.. మేకప్ వీడియోలు సందడి చేశాయి. మొత్తానికి ఇలాంటి చిత్రం తెలుగు ఇండస్ట్రీలో 80 యేళ్ళలో రాలేదనీ చెప్పుకున్నారు. జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నారు. వాస్తవాన్ని చూస్తే టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎన్నో జానపద.. చారిత్రక.. పౌరాణిక చిత్రాలు తెలుగులో అబ్బురపరిచాయన్న వ్యాఖ్యానలు బాహుబలిని ఉద్దేశించే వినిపించాయ. వైర్‌వర్క్.. ట్రిక్ ఫొటోగ్రఫీ అప్పట్లోనే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన మాట కాదనలేనిది. వాటికిరాని జాతీయ అవార్డు బాహుబలికి రావడం తెలుగు సినిమాపట్ల కేంద్ర సినీ కమిటీ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన వాళ్లూ ఉన్నారు. నిజంగా బాహుబలి ప్రపంచాన్ని కుదిపేసిన చిత్రమే అయతే ఎందుకు ఆస్కార్ కేటగిరీలో నిలబడలేకపోయిందన్న ప్రశ్న -ప్రశ్నగానే మిగిలిపోయింది.
రాజవౌళి -్భజనలకు దూరంగా కమర్షియల్‌గా ఆలోచించే దర్శకుడు కనుకే బాహుబలి ది బిగినింగ్‌లో విషయం లేకుండా ముగించేశాడు. ఇప్పుడు సీక్వెల్‌పై రెట్టించిన అంచనాలు పెంచేస్తున్నాడు. మరి సీక్వెల్ సెంటిమెంట్‌ని బ్రేక్‌చేస్తాడా? లేదా? అనేదే తెలుగు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే అంశం. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనేదే అందరిలోనూ ఉత్కంఠ. దానికి సమాధానంతోపాటు ఆద్యంతం రంజింపజేసే కథనం ఉంటేనే సీక్వెల్ గట్టెక్కుతుంది. లేకపోతే ప్రేక్షకులు పెదవి విరచడం ఖాయం. రజనీకాంత్ సైతం రోబో సీక్వెల్-2.0గా వస్తున్నాడు. ఈ సినిమానూ స్ట్రెయిట్ తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావిస్తున్నారు. సూర్య సింగం-3 విడుదలకు సిద్ధమవుతోంది. సీక్వెల్స్ అన్ని భాషల్లోనూ సక్సెస్ అవుతుంటే తెలుగులో మాత్రం ఫ్లాపులను మూటకట్టుకోవడం గమనార్హం! దీనికి ప్రధానంగా పేలవమైన.. తొలి పార్ట్‌కాపీలా కథలు ఉండటమే అంటున్నారు నిపుణులు. తొలి చిత్రానికి సీక్వెల్ కొనసాగింపులా ఉండాలన్న విచక్షణ మర్చిపోయి -రీమేక్‌లా తయారు చేస్తుండటమే ఫ్లాప్‌లకు కారణమన్న వాదనా లేకపోలేదు.
తెలుగు, తమిళ పరిశ్రమలో మరికొన్ని సినిమాలకూ సీక్వెల్స్ ప్రణాళికలు సిద్ధమవుతుంటే, సీక్వెల్ చేయాలన్న తలంపులూ వినిపిస్తున్నాయి. సరైన బ్రేక్ దొరకక అల్లాడిపోతున్న హీరోలు కొందరు తన కెరీర్‌లో పాత హిట్టు సినిమాల దుమ్ముదులిపి సీక్వెల్స్‌కు సిద్ధమవుతుంటే, దూసుకుపోతున్న కొందరు హీరోలు సైతం సీక్వెల్స్‌కు సై అంటున్నారు. ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన విఐపి చిత్రం -తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ అంటూ మంచి విజయాన్ని సాధించింది. అసలు ధనుష్ ఆ చిత్రం నుంచే తెలుగు మార్కెట్ రేసులోకి వచ్చాడు కూడా. ఇప్పుడు ‘విఐపి-2’ టైటిల్‌తో తమిళ, తెలుగు భాషల్లో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. కబాలితో భారీ నష్టాలు చవిచూసిన కళైపులి థాను నిర్మాతగా, రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకురాలిగా, కథ, సంభాషణలు హీరో ధనుష్ అందిస్తుండటంతో సీక్వెల్‌పై ఆసక్తి పెరుగుతోంది. చిన్న సినిమాగా వచ్చి తెలుగు మార్కెట్‌లో పెద్ద సక్సెస్ కొట్టిన తమిళ హారర్ థ్రిల్లర్ -పిజ్జాకు సీక్వెల్ వస్తోంది. నిజానికి ఇది సీక్వెల్ అనలేకున్నా -తమిళంలో విజయ్ సేతుపతి నటించిన ‘పురియాద పుదిర్’ సైకలాజికల్ థ్రిల్లర్‌ను పిజ్జా-2 పేరిట తెలుగు స్క్రీన్‌కు తేబోతున్నారు.
తెలుగులో సీనియర్ వంశీ ‘లేడీస్ టైలర్’ అప్పట్లో ఓ సెనే్సషన్. హిట్టు సినిమాకు సీక్వెల్ తేవాలన్న వంశీ ఆశలు ఇప్పటికి నెరవేరబోతున్నాయట. వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన బ్రేక్ తెచ్చుకోలేకపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ప్లాన్లు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. అనీషా ఆంబ్రోస్, ఈషా, మానసలు హీరోయిన్లుగా ‘్ఫ్యషన్ డిజైనర్’ టైటిల్‌తో రాబోతున్న సీక్వెల్‌ను వంశీ ఎంత హిట్టు చేస్తాడన్నది చూడాలి. ఇక జూ.ఎన్టీఆర్‌కు ‘అదుర్స్’తో ఓ హిట్టిచ్చిన వివి వినాయక్ -అదుర్స్-2 కథను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి ప్రాజెక్టు ‘ఖైదీ నెంబర్ 150’తో బిజీగావున్న వినాయక్, హడావుడి పూర్తవ్వగానే ఎన్టీఆర్‌కు కథ వినిపించొచ్చని అంటున్నారు. తెలుగు మార్కెట్‌లో ‘ఊపిరి’ క్లాసిక్ హిట్టుతో మంచి మార్కులు వేయించుకున్న కార్తి -కాష్మోరాతో తెలుగు ప్రేక్షకుల్లో నమ్మకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సీక్వెల్‌కు అనుకూలమైన పాయింట్‌లో స్టోరీ ఆపేసిన కాష్మోరాకు -పార్ట్ 2 తెచ్చే ఆలోచన చేస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే సెనే్సషన్ సృష్టించిన దండుపాళ్యంకు పార్ట్-2 సిద్ధమైంది. తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న ‘పందెంకోడి’ చిత్రానికి విశాల్ సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు. మరీ ముఖ్య విషయం ఏంటంటే -క్రియేటివ్ డైరెక్టర్ పూరీ తన గత హిట్టు సినిమాలన్నింటికీ సీక్వెల్స్ చేసే ఆలోచన చేస్తున్నాడన్నది.
***
హాలీవుడ్‌లో ఏ సినిమాకైనా ఆరు సీక్వెల్స్ తీయడం పరిపాటి. సీక్వెల్స్ అన్నీ సక్సెస్ సాధించాయి కూడా. ఈ సంస్కృతి మెల్లగా బాలీవుడ్‌కి పాకింది. ఇక్కడా నాలుగు వరకు సీక్వెల్స్ వచ్చాయి. ఇక తమిళంలో సూర్య సీక్వెల్స్ స్థాయిని ‘సింగం-3’తో మూడుకు తీసుకెళ్లాడు. టాలీవుడ్‌లో మాత్రం సీక్వెల్ అంటేనే ఫ్లాప్ అన్నంత ముద్రపడిపోయింది. అయినా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కనీసం రాజవౌళి బాహుబలితో ఫ్లాప్ సెంటిమెంట్ చెరిగిపోయి -తరువాత వచ్చే సీక్వెల్స్‌కు సక్సెస్ రేటు పెరుగుతుందేమో చూడాలి.

-బాసు, మహాదేవ