మీ వ్యూస్

ఏమాత్రం నచ్చని నిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి ఎప్పుడూ స్పెషల్. అతని సినిమాల్లో హీరోలు కొత్తగా కనిపిస్తారు. హైపర్ డైలాగులు, దమ్ముతో విలన్లకు దడపుట్టిస్తారు. ఇదీ అతని మార్క్ మ్యాజిక్. -పూరి సినిమా విడుదలయ్యే ప్రతిసారీ ఆడియన్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇదే ఆశిస్తున్నారు. కానీ, సినిమా విడుదలయ్యాక అసలు విషయం తెలుస్తుంది. అన్ని సినిమాలూ ఒక్కలా ఉండవ్ అన్నట్టు.. పూరి నుంచి కూడా అన్నిసార్లు హిట్ సినిమాలే రావు. బ్లాక్‌బస్టర్లు వచ్చినట్టే.. డిజాస్టర్లూ వస్తాయని చెప్పకనే మళ్లీ చెప్పిన సినిమా -ఇజం. పరాయ దేశాల్లో మూలుగుతున్న స్వదేశీ కరెన్సీ అవినీతిపై విల్లు ఎక్కుపెట్టి -చివరకు ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేసి ముగించేశాడు పూరి. అతను చూపించే నిజాలే -ఇజం అనేసుకోవడం తప్ప, సినిమాలో అలాంటి ఫీలింగే ఎక్కడా కలగలేదు.
-రావి సుకుమార్, సికింద్రాబాద్
భలే అనుభూతి
రెండువారాల క్రితం వెనె్నల పేజీల్లో ‘బేబీ శశికళ’ చిన్ననాటి ముచ్చట్లు చదువుతుంటే మనసుకు ఎంతో హాయి అనిపించింది. దేవదాసు చిత్రంలో బేబీ శశికళ నటన చాలామంది హృదయాల్లో చెరగని ముద్ర వేసినదే. సురభి కమలాబాయి మనుమరాలిగా ఆమె ప్రదర్శించిన నటన ఎప్పటికీ గుర్తుండిపోయేదే. పాతతరం గొప్ప ఆర్టిస్టుల జ్ఞాపకాలు అప్పుడప్పుడూ వెనె్నల్లా కురిపిస్తే మహదానందం. ఆ తరం నటీనటులు ఇంకా చాలామందే మన కళ్లముందు ఉన్నారు. అప్పుడప్పుడూ అయినా వారి కాలంనాటి ముచ్చట్లు, వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారన్న విషయాలను వెనె్నల పాఠకులకు అందించాలని కోరుతూ..
కెవి ప్రసాదరావు, కందుకూరు
మళ్లీ.. గుర్తు చేశారు
ఫ్లాష్‌బ్యాక్‌లో అందించిన ‘మనసే మందిరం’ సంగతులు చదువుతుంటే -్భలే అనిపించింది. ఆ చిత్రంలో అక్కినేని, జగ్గయ్య పాత్రలపరంగానే కాదు, నటనపరంగానూ పోటీపడ్డారేమో అనిపిస్తుంది. మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కొన్ని సన్నివేశాల్లో ఉబ్బిన ముఖం, ఉబ్బిన కళ్లతో సావిత్రి కనిపిస్తుంది. అందుక్కారణం షూటింగ్ ఏకథాటిగా, విరామం లేకుండా 28 రోజులు సాగడం, చివరి రోజుల్లో సన్నివేశాలన్నీ ఏడుపు సీనులే కావడం వల్ల సావిత్రి, ఆయా సన్నివేశాల్లో అలా కనిపించిందట. ఈ విషయం అనేక సందర్భాల్లో మహానటి చెప్పిందే. రాము జబ్బు నయం చేయడానికి రఘు పాత్రధారి లావుపాటి మెడికల్ పుస్తకాలు తెల్లవార్లూ చదివేయడంలాంటి సన్నివేశాలు ఇప్పుడు చూస్తూ కాస్త అసహజం అనిపించొచ్చు. ఫోన్ చేసి పెద్ద డాక్టర్ల సలహా తీసుకోవచ్చు కదా! అంటారు ఇప్పటి వాళ్లు ఆ సినిమా చూస్తే. ఏదేమైనా గొప్ప సినిమాను మళ్లీ గుర్తు చేసుకున్న ఫీలింగ్ కలిగింది ‘మనసే మందిరాన్ని’ ఫ్లాష్‌బ్యాక్‌లో చదివాక.
కె గునే్నశ్, కొవ్వాడ
శృతి మించుతున్న అతి
ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో, రియాలిటీ షోలలో పాల్గొనే నటీనటులు, యాంకర్లు వినోదం, కామెడీ పేరిట రెచ్చిపోతూ శృతిమించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఓ ఫంక్షన్లో -ఆ నటి తొడలు బాగుంటాయి. అందుకేనేమో నేను ఆమె అభిమానిని అయ్యాను అంటూ పిచ్చిగా మాట్లాడాడు ఓ ముదురు హాస్యనటుడు. నేను అమ్మాయిల్ని హగ్ చేసుకోకపోతే, నా అభిమానులు బాధపడతారు. అందుకే హగ్ చేసుకుని చిలిపి పనులు చేస్తుంటానని శృతిమించి మాట్లాడాడు మరో సీనియర్ హీరో. పబ్లిక్ ఫంక్షన్లో తనను హగ్ చేసుకోమని ఓ నటీమణిని డైరెక్ట్‌గానే అడిగాడు ఓ దర్శకుడు. ఒకప్పటి హీరోయిన్లను అలా అడిగివుంటే చెప్పుతో కొట్టి ఉండేవారని ముక్తాయించాడొక సీనియర్ నటుడు. ప్రతిస్పందిస్తే కెరీర్ ఫినిష్ అన్న భయంతో అవమానాలు దిగమింతున్న భావన ఆ సమయంలో నూతన నటీమణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆహూతుల ఆనందం కోసమే ఇవన్నీ చేస్తున్నామన్న ముసుగొకటి వేసుకుని -శృతిమించుతున్న సీనియర్ల పైత్యం చూస్తుంటే, ఈ పిచ్చి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన కలుగుతుంది. సినిమా ఎంత అడ్వాన్స్ అయిపోయినా, మనం బతుకుతున్న సమాజ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోకపోతే ఎలా.
చంద్ర, కాకినాడ
వాళ్లేం పాపం చేశారు!
నేడు సినిమాలకు పని చేస్తున్న సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు ఆసక్తిగల ప్రేక్షకులకు తెలియాలంటే -కష్టంగా మారింది. సినిమా ప్రారంభంలో ముగ్గురు నలుగురు ముఖ్యల పేర్లు వేస్తే వేసినట్టు లేదూ అదీ లేకుండానే చాలా సినిమాలు మొదలైపోతున్నాయి. ఒకవేళ టైటిల్ కార్డు వేసినా -ఒక్కో కార్డులో పదిమంది పేర్లు చిన్నవిగా ఇరికించేసి క్షణాల్లో తీసెయ్యడం కూడా జరుగుతుంది. సినిమా కోసం ఆరుగాలం కష్టపడిన వాళ్ల పేర్లు కనిపించకుండానే మాయమవుతున్నాయి. వెనుకటి రోజుల్లో స్క్రీన్‌మీద, ప్రకటనల్లో, పోస్టర్లమీదా అన్ని వివరాలు ఉండేవి. సాంకేతికత కల్పిస్తోన్న వెసులుబాటుతో సినిమాను అందంగా తీర్చిదిద్దడానికి కష్టపడిన వాళ్ల వివరాలు పూర్తిగా ఇవ్వడం మానేసి, పూర్తిగా ఎత్తేయడం ఎంతవరకు సబబు?
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
సిగ్గుపడాలి
ఎక్కడ స్ర్తిలు ఆదరింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడుదురన్నది ఆర్యోక్తి. భారతీయ మహిళకు మహోన్నత స్థానం కల్పించాయి వేదాలు, శాస్త్రాలు. మన సినిమాల్లోనూ నిన్నటి తరం హీరోయిన్లూ అత్యుత్తమంగా కనిపించి ప్రపంచ సినిమాలో విశిష్టస్థానం సంపాదించుకున్న వాళ్లు ఎందరో. కాలక్రమేణా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, కాసులు రాల్చుకోవాలన్న తపన ఇత్యాది కారణాలవలన స్ర్తిల ఔచిత్యం దిగజారేలా పాత్రలను రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలలో స్ర్తిల వస్తధ్రారణ, వారి భాష, అంగాంగ ప్రదర్శన చూస్తుంటే యావత్ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. బికినీలు, ఐటెంసాంగ్స్, లిప్‌లాక్‌లంటూ కుర్రకారును ఆకట్టుకునేందుకు నిర్మాతలు నానా గడ్డి కరుస్తున్నారు. ఇటువంటి పైత్యం ఏదీలేకుండానే కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నా చిత్రపరిశ్రమ ప్రబుద్ధులకు బుద్ధిరావడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం