Others

బాలరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు, పాటలు: సముద్రాల సీనియర్
సంగీతం: గాలిపెంచల నరసింహారావు
సహాయకులు: జివి రావు (ఘంటసాల)
రీరికార్డింగ్: సిఆర్ సుబ్బరామన్
(కొన్ని బాణీలుకూర్చారు).
ఛాయాగ్రహణం: సి శ్రీ్ధర్
కళ: ఎస్‌విఎస్ రామారావు
ఎడిటింగ్: టిఎం లాల్
నృత్యం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత, దర్శకులు:
ఘంటసాల బలరామయ్య
ప్రముఖ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య తమ ప్రతిభ పిక్చర్స్ బ్యానర్‌పై పార్వతీ పరిణయం (1941), గరుడ గర్వభంగం (1941) నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావును సీతారామజననం (1945) చిత్రం ద్వారా హీరోగా చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత అక్కనేనితో ‘ముగ్గురు మరాఠీలు’ (1947) రూపొందించారు. తరువాత ప్రతిభా బ్యానర్‌పై రూపొందించిన చిత్రం -బాలరాజు. అక్కినేనికి హీరో
వర్షిప్‌ను అందించిన ఈ చిత్రం 1948 ఫిబ్రవరి 26న విడులైంది. జానపద కథల్లోని పసల బాలరాజు కథకు మరిన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించి సముద్రాల రాఘవాచార్య, మల్లాది రామకృష్ణ శాస్ర్తీ,
ప్రయాగ నరసింహశాస్ర్తీ కలిసి కథను సిద్ధం చేశారు.

మోహిని (అంజలీదేవి) దేవకన్య. ఓ యక్షుని ప్రేమిస్తుంది. వారి ప్రణయం ఇచ్చగించని కుబేరుడు, యక్షుని ప్రేమ నెరుగునివానిగా భూలోకంలో జన్మించమని శపిస్తాడు. ఇంద్రసభలో తనముందు నాట్యం చేయ నిరాకరించిన మోహినిని దేవేంద్రుడు (సదాశివరావు) భూలోకంలో పుట్టి ప్రేమ తెలియని వానితో అగచాట్లు పడమని శపిస్తాడు. కమ్మనాయుడు (జి రామయ్య)కి నాగేటిచాలులో దొరకడంచేత సీత (ఎస్ వరలక్ష్మి)గా వారింట పెరుగుతుంది. యుక్త వయసు వచ్చినా సీతకు వివాహం చేయడం ఇష్టంలేక తండ్రి ఆమెను ఒంటిస్థంభం మేడలో ఉంచుతాడు. వెలమదొరల ఇంట్లో పెరిగిన యక్షుడు బాలరాజు (అక్కినేని) తన స్నేహితుడు ఎలమంద (కస్తూరి శివరావు)తో కలిసి ఆ ప్రాంతాలకు పశువుల మందతో వస్తాడు. ఆ రాత్రి బాలరాజు పిల్లన గ్రోవి వాయించగా విని పరవశించిన సీత మేడ విడిచి అతని వద్దకువస్తుంది. ఆ గానానికి ముగ్ధురాలై అతన్ని ప్రేమించి అతడు తిరస్కరించినా అతనివెంట వెడుతుంది. బాలరాజు ఆమెను తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఒక శెట్టికి కుదువపెట్టి ఫలహారాలు సేవిస్తాడు. సీత శెట్టినుంచి తప్పించుకుని బాలరాజు వద్దకు చేరుతుంది. ఆ రాత్రి దొంగలు సీతను అపహరిస్తారు. దాంతో బాలరాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగి ఎలమందను వదిలి సీతకోసం వెదుకుతూ ఓ ముని శాపంవల్ల పాముగా మారతాడు. సీత దొంగల బారినుండి తప్పించుకుని పాముగా మారిన బాలరాజుతో తీర్థయాత్రలు చేసి నిజరూపం తెప్పిస్తుంది. తిరిగి శెట్టివలన బాలరాజు ప్రాణాలు పోగొట్టుకోగా దేవకన్య ఇచ్చిన సౌభాగ్యమాలతో అతన్ని బ్రతికిస్తుంది. ఈ దశలో దేవేంద్రుడు సీతను వశం చేసుకోవాలని ప్రయత్నించి సీతచేత భంగపడి సీత ప్రయోగించిన మాలతో బాలరాజు తిరిగి మరణించడంతో సీత దేవేంద్రునిపై ఆగ్రహిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై బాలరాజును బ్రతికించి దేవేంద్రుని మందలించి సీత బాలరాజులను ఆనందంగా గడపమని ఆశీర్వదిస్తాడు. ఈ చిత్రంలో సీత తల్లిగా సి రాజరత్నం, శెట్టిగా జి సుబ్బారావు, శివుడిగా ఎ ఆదిశేషయ్య, పున్నమ్మగా బి సీతారావమ్మ, ఇంకా బాలసరస్వతి, సీతారాం తదితరులు నటించారు.
బాలరాజు పాత్ర అంత ప్రాధాన్యత కలది, కష్టపడి నటించాల్సింది కాదు అని అక్కినేని అంటుండేవాడు. కానీ ప్రేమే ఎరుగని అమాయకునిగా, తొలుత సీతపట్ల విసుగు, కోపం, నిర్లక్ష్యం, ఆమెను వదిలించుకోవాలని చూడటం, ఒకనాటి రాత్రి అలసిన ఆమె కాళ్లను పట్టబోవడం, తలకు మర్దన చేయడంలో ఓ సన్నిహితత్వం, దొంగలవల్ల సీత దూరమైనాక ఆమెకొరకు వేదనతో వెదకడం, ఆమెవల్ల తాను పునర్జీవుడయ్యాక ఆనందం.. ఇలా ఎన్నో సున్నిత ప్రణయ భావాలను ఎంతో పరిణతితో నటించి ఎందరో యువతుల హృదయాలను ఆకట్టుకున్నాడు అక్కినేని. నిజజీవిత కథానాయిక అన్నపూర్ణకు కూడా ఈ చిత్రం ద్వారానే అక్కినేని మానసచోరుడై, జీవిత భాగస్వామి కావడం జరిగింది.
మోహినిగా అంజలీదేవి అద్భుత నటనను ప్రదర్శించారు. తొలుత ‘నవోదయం/ శుభోదయం’ బృంద గీతంలో, ఆపైన తోటలో యక్షుని ముందు -ఈ తీయని వెనె్నల రేయి/ విడబాయని చినె్నల హాయి ఓ రసపాయి.. పాటలకు ప్రత్యేక శైలిలో నర్తించడమేకాక, ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఇంద్రసభలో నృత్యం చేయనని, ఆపైన ఇంద్రుని ఎదిరించి పలకడాన్ని గొప్పగా అభినయించి చూపారు. తర్వాత వచ్చిన ‘సువర్ణ సుందరి’లో ఈ సన్నివేశమే కొద్ది మార్పులతో రావడం దర్శకుని విజన్‌కు తార్కాణం. అంజలీదేవి నటకు గుర్తింపు అదొక గుర్తింపు.
ఇక సీతగా ఎస్ వరలక్ష్మి సుస్వరమైన గానంతో వలచిన ప్రియుని, ప్రేమను పొందడం కోసం, సాహసం, ధైర్యం, తెగువ, ఆత్మస్థయిర్యం సందర్భానుసారంగా ఎంతో ధీరతతో నటించి మెప్పించారు.
కస్తూరి శివరావు ఎలమందగా ఎంతో హుషారుగా నటించి, ఈ చిత్రం తరువాత మరింత ఫేమస్ స్టార్ అయ్యారు. దర్శకులు బలరామయ్య సన్నివేశాలను ఆసక్తికరంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దారు. ఈశ్వరుడు, దేవేంద్రునితో ‘నీవల్ల మా తలప్రాణం తోకకు వచ్చింది’ అన్న సన్నివేశంలో పాము శివుని మెడనుంచి కిందకు జారడం చూపడం వంటి చిన్న సన్నివేశాలను, ‘రాజా రారా’ అనుగీతంలో వరలక్ష్మి జంకుతో, బెదురుతో, ప్రేమతో పాము రూపంలోని భర్తను పిలవడం వంటివి ఎంతో విపులంగా చిత్రీకరించారు.
శెట్టి ఇంట్లో పుర్రె, అలంకరణ బొమ్మలు కదలడం, ఆపైన గోడమీద మనిషి నీడవంటివి ట్రిక్ షాట్స్‌ను ఎంతో ఆకట్టుకునేలా కళా దర్శకునితో కలిసి రూపొందించడం విశేషం. వెనె్నల రాత్రులను, నలుపు తెలుపు దృశ్యాలను సి శ్రీ్ధర్ ఎంతో సమర్ధవంతంగా మంచి ఎఫెక్ట్‌తో చిత్రీకరించారు.
బాలరాజు చిత్ర గీతాలు
అంజలిదేవిపై చిత్రీకరించిన -నవోదయం, -తీయని వెనె్నల రేయితోపాటు ఎస్ వరలక్ష్మి, దొంగలగుంపుపై చిత్రీకరించిన నృత్య గీతం -తేలీ చూడుము హాయి సాటిలేని ఈ రేయి’ (ఘంటసాల సమకూర్చారు.. ఎస్ వరలక్ష్మి, ఘంటసాల గానం చేశారు) అద్భుతం. అంజలిదేవి పాటలకు వక్కలంక సరళ గానంచేయగా ఆమెకు అంజలీదేవి ఒక వజ్రపుటుంగరం గిఫ్ట్‌గా ఇచ్చారు (ఈ తీయని వెనె్నల రేయి గీతాన్ని సినిమాల్లోకి రాకముందు సావిత్రి తన నృత్య ప్రదర్శనల్లో ప్రత్యేక గీతంగా నర్తించడం విశేషం). ఒంటరిగా మేడలో ఉన్నపుడు ఎస్ వరలక్ష్మిపై చిత్రీకరించిన గీతం -ఎవరినే నేనెవరినే, అక్కినేని, ఎస్ వరలక్ష్మిపై చిత్రీకరించిన గీతం -ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా, వరుణదేవుని ప్రార్ధించే గీతం -వరుణా, వరుణా, మరో గీతం జాలి లేదా-బాలరాజా, పుట్టముందు పాడే పాట రాజా రారా నా రాజ రారా, పాము బుట్టతో తీర్థయాత్రలు చేస్తూ పాడే గీతం రూపమునీయరయా పతి, ఈశ్వరుని ముందు గుడిలో పాట -వేరే లేరయా పరమేశామరి (గానం: ఎస్.వరలక్ష్మి). కస్తూరి శివరావుపై గీతాలు -దేవుడయా దేవుడు మాయదారి దేవుడు, మరో గీతం -వరాల కూన నిన్ను కాన కోనలెతికేనే, పున్నమ్మతో గీతం -ఒకరిని నాన చేశావ్ (నారీమణి, కస్తూరి శివరావు), బిచ్చగానిపై గీతం -గూటిలో చిలకేదో అన్నా గూడు చిన్నబోయెరా (పిఠాపురం, ఉడుతా సరోజని), సీతారాంపై చిత్రీకరించిన గీతం -చూడచక్కని చిన్నది, ప్లేబేక్ గీతం -అలకాపడి అరకచేసి, సీత పొలంలో దొరికే ముందు గీతం (ప్రయాగ నరసింహమూర్తి బృందం) ఎస్ వరలక్ష్మి, అక్కినేనిలపై గీతం -నీకు నీవారు లేరు నాకు (గానం ఎస్ వరలక్ష్మి), అక్కినేని, ఎస్ వరలక్ష్మిల యుగళ గీతం -చాలురా వగలు ఇక చాలురా వగలు (అక్కినేని, ఎస్.వరలక్ష్మి గానం). బాలరాజు చిత్రంలోని హిట్ సాంగ్ ప్రేయసిని వెదుకుతూ అక్కినేనిపై చిత్రీకరించిన గీతం -చెలియా కనరావా నిరాశబూని పోయితివా. ఈ గీతాన్ని తొలుత అక్కినేని పాడారు. అదివారికి అంతగా నచ్చక ఘంటసాలతో పాడించమని నిర్మాత బలరామయ్యను రిక్వెస్టు చేశారు. తిరిగి ఈ గీతాన్ని ఘంటసాల ఆలపించారు. గ్రామఫోను రికార్డులో అక్కినేని పేరిట రికార్డు అయింది. చిత్రంలో ఘంటసాల పాట ఉంటుంది. అక్కినేనికి ఘంటసాల పాడిన తొలి నేపథ్య గీతంగా నిలవడం, సూపర్ హిట్ కావడం విశేషం.
బాలరాజు సంగీతం, పాటలు పరంగా విశేష ఆదరణ పొందాయి. ఈ చిత్రం సక్సెస్ సాధించింది. ఎస్ వరలక్ష్మి గాత్రానికి, నటనకు విపరీతమైన అభిమానం లభించింది. రికార్డు స్థాయిలో రజతోత్సవాలు, శత దినోత్సవాలు జరుపుకుంది. అతి చిన్న సెంటర్లలోనూ శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకోవడం, స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి జానపద చిత్రం కావడం, పలు పట్టణాల్లో శత దినోత్సవ సభలు జరగడం, ఏలూరు పట్టణంలో జరిగిన రజతోత్సవ సభలో ఎస్ వరలక్ష్మి పాట కచేరీ జరిగింది. విజయవాడ సభలో హీరోయిన్ సావిత్రి సినిమాల్లోకి రాకముందు నుంచీ అక్కినేని అభిమాని. ఆయన్ని చూడాలన్న కోరికతో జైహింద్ టాకీస్ వద్దకు వచ్చిన సావిత్రి, జనం తోపులాటలో పక్కన మురికి కాలవలో పడి బట్టలు పాడవడం, అయినా తన అభిమాన నటుడిని చూసిన ఆనందంలో అవేవీ పరిగణించలేదని ఓ సందర్భంలో సావిత్రి తెలిపారు.
ఇక బాలరాజు చిత్రం ఆర్థిక విజయంతోపాటు అక్కినేనికి బాలరాజు అక్కినేనిగా, ప్రేక్షకుల మనసుల్లో ఓ ప్రత్యేకత సాధించడం, పల్లెటూళ్లనుండి ఈ చిత్రం చూడడం కోసం జనాలు బళ్లు కట్టుకురావడం, ఓ జానపద చిత్రానికి ఇంత ఆదరణ లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఎస్ వరలక్ష్మి, అక్కినేని జంట హిట్ పెయిర్‌గా నిలవడం మరో విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి