మీ వ్యూస్

హీరో చుట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన గత చిత్రాలను నిర్మించిన విజయా, వాహిని, అన్నపూర్ణ, ఏవిఎం, పూర్ణోదయ, యువచిత్ర వంటి సంస్థల రుణం తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ తీర్చుకోలేడు. స్క్రిప్ట్ వర్క్ పోస్ట్‌ప్రొడక్షన్ వరకూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, సినిమా నిర్మాణం ఒక తపస్సులా భావించినందుకే చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన సినిమాలను వారు రూపొందించగలిగారు. క్రమశిక్షం, నైతిక విలువలు, నిజాయితీ, నిబద్ధత సిద్ధాంతాలకు కట్టుబడి వుండడం నాటి నిర్మాతల గొప్పదనం. వ్యాపార దృక్పథంతో సినిమాలు తీసినా, విలువలకు రాజీపడని మనస్తత్వం వారిది. అటువంటి నిబద్ధత నేడు నిర్మాతలకు లోపించడంవలన సినిమాలలో వాసి తగ్గిపోయింది. సినిమా అంటే కనీస అవగాహన కూడా లేనివారు సినిమాలు తీసిపారేస్తున్నారు. కలకాలం గుర్తుంచుకోదగిన సినిమాలు వెయ్యిలో ఒక్కటి కూడా వుండడంలేదు. ఆనాటి సినిమాలు కథ చుట్టూ తిరిగితే, నేటి సినిమాలు హీరో చుట్టే తిరుగుతున్నాయి. అందుకే చీకట్లో కలిసిపోతున్నాయి.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం

భలే మంచి సినిమా
యువతకి, మాస్‌కి ఫుల్‌జోష్ పుట్టించే కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రాసుకొని దాన్ని తెరపై నాన్‌స్టాప్‌గా రెండు గంటలు నవ్వించగల సినిమాని నడిపిస్తే హిట్ చెయ్యడమేకాక వౌత్ పబ్లిసిటీతో దాని రేంజిని పెంచుతారు ప్రేక్షకులు. ఆ కేటగిరీ బొమ్మే భలే మంచిరోజు. దర్శకుడికి, సుధీర్‌బాబుకి ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్. అతని కెరీర్ స్థాయిని తప్పక పెంచుతుంది. పోసాని, పృథ్విరాజ్‌ల నటన పదునుతేరింది. చర్చ్ఫిదర్, మల్లెపుష్పం పాత్రలు నచ్చాయి. ఏ కొత్త సినిమా అయినప్పటికీ దాని సక్సెస్సే ముఖ్యమని భావించి, పాత సినిమాల్లో డైలాగ్స్, మ్యూజిక్, పాటల్ని యజమానులైన దర్శక నిర్మాత, రచయితలు సహృదయంతో పర్మిట్ చేస్తున్నందుకు వారిని అభినందించాలి.
- తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, విశాఖపట్నం

సమీక్షా కాలం
అన్ని సినిమాలకు సమీక్షా కాలం వచ్చేసింది. సృజనకే పట్టం అంటూ వచ్చిన టాలీవుడ్ సమీక్ష పక్కాగా వుంది. బాహుబలి సంవత్సరమే ఇది. భారీ పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఎన్నో కోట్లు వసూలు చేసిందన్నారు. కానీ బాలీవుడ్ గణాంకాల ప్రకారం భజరంగీ 90 కోట్ల బడ్జెట్‌తో 320 కోట్లు, ప్రపంచ వ్తాప్తంగా 626 కోట్లతో ప్రథమ స్థానంలో వుండగా, బాహుబలి రెండో స్థానంలో వుంది. అయితే, దేశ వ్యాప్త లెక్కలే తీసుకుంటే బాహుబలి నష్టం వచ్చింది. ఐదో స్థానంలో వుంది. బడ్జెట్‌కి వసూళ్లకు లింకుపెడితే భజరంగీ విజయ శాతం 72. తను వెడ్స్ మనూ రిటర్న్స్ 62 శాతం, బాహుబలి 38 శాతం. అంటే బాహుబలి ఘనవిజయం సాధించినట్టు కాదు.
-ఎస్.కృష్ణ, కొండయ్యపాలెం

అంత సింపులేం కాదు
మంచి చిన్న సినిమా ఎలా వుండాలో ‘వెరీ సింపుల్’గా చెప్పేశారు రచయిత. కానీ అవన్నీ సమకూరడమే వెరీ డిఫికల్ట్! ఈ విషయం ఢాం అంటున్నా చిన్న చిత్రాలు నిరూపిస్తున్నాయి కదా, కేస్టింగ్ చికాకు పెట్టనంత మాత్రాన సరిపోదు. కనీసం హీరో హీరోయిన్లయినా ‘చూడబుల్’గా ఉండాలి. కొత్త హీరోలు ముఖాలు తింగరిగా తుప్పజుట్టుతో ముళ్లపంది గెడ్డాలతో ఉంటున్నాయి. ఆ పాత్రల ప్రవర్తనలో హేతుబద్ధతగాని మాటల్లో పొందికగాని ఉండటంలేదు. విభిన్న సన్నివేశాల్లో పాత్రలు ఎలా స్పందించాలి? ఎలా మాట్లాడాలి? అనేది అసలు పట్టించుకోవడం లేదు. ఒక్క హిట్‌తో చిన్న చిత్రాలు చెలరేగిపోతాయి. పరిశ్రమ కళకళలాడుతుందంటారు. మరి ప్రేక్షకుల విలవిల సంగతేమిటి?
- స్నేహమాధురి, పెద్దాపురం

మేలు-కీడు
11 డిసెంబర్ 2015 వెనె్నలలోని ‘నీతి...నిజాయితీ’ పోలిశెట్టిగారి విశే్లషణ బావుంది. మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా మనసులోని వేదాంత ధోరణితో కూడిన విశిష్ట్భావాలను జయించా! చిరు వ్యాసంద్వారా తెలుసుకున్నాం. ఈవారం ఫ్లాష్‌బ్యాక్ శీర్షికద్వారా వదిన చిత్ర విశేషాలను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో అందించి ఆనందింపజేసిన రచయతకు ధన్యవాదాలు. రివ్యూస్ ద్వారా కొత్త చిత్ర కథా విశేషాలను తెలుసుకున్నాం. నాకు నచ్చిన పాట, నాకు నచ్చిన సినిమా వెనె్నల కన్నుకు రెండు కళ్ళు.
- అల్లాడి వేణుగోపాల్, బారకాసు

అంతా శోకం
‘సౌఖ్యం’ ఎవరికీ లేకుండా చేశాడు దర్శకుడు. ‘యజ్ఞం’చేసిన కాలంనుండి దర్శకుడిగా బయటకు రాలేదు. ‘గోపీచంద్’ డాన్స్‌ల్లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. మేకప్ ఎక్కువగా వేస్కోడం తగ్గించాలి. ప్రభాస్ తర్వాత పర్సనాలిటీ గోపీచందే. హీరోయిన్ బొద్దుగా బాగుంది. ఆ ‘ఐటం’సాంగ్ కూడా అనవసరం. సినిమా అంతా ఒక షేడ్‌లో, సాంగ్స్ మరో షేడ్‌లో వుడడడం, ‘దేవన్’ విలన్‌గా వుండడం, చివర్లోగానీ బ్రహ్మీ రాకపోవడం ఇవన్నీ బడ్జెట్ బాధలే. పోసాని బెటర్ హాస్యం అందించాడు. సప్తగిరి, పృథ్వి స్ఫూఫ్‌లతో నవ్వించారు. అయనా ఆత్మ లోపించినట్టే ఉంది సినిమా. గోపీచంద్‌ను ఉపయోగించుకోవాలి బాగా వయసు మీదపడకముందే..
- కాళిదాసు, కావలి

అడ్డదారులే బహుదొడ్డదారులని చాలామంది భావిస్తున్నారు. ఏదో విధంగా (అంటే అడ్డుదారుల్లో) పరీక్షలు పాసై ఏదోవిధంగా ఉద్యోగం సంపాదించి ఏదోవిధంగా డబ్బు నొల్లుకొని హాయిగా జీవితం గడిపెయ్యడమే లక్ష్యం. ప్రణాళికాబద్ధ ఆలోచనలు గాని కష్టపడి పనిచేసే ఓపిక గాని ఉండవు. ఏదో విధంగా అమెరికా వెళ్లి ఏదో చెత్త యూనివర్సిటీలో ఏదో విధంగా డిగ్రీ సాధించేయాలని వెళ్లిన వారిని తిప్పి పంపేసింది అమెరికా. సినిమా వాళ్లకూ అదే యావ. ఏదో విధంగా సినిమా తీసేసి ఏదో విధంగా హిట్ కొట్టేయాలని. తొంభైశాతం సినిమాలు అందుకే ఫట్‌మన్నాయి. ఏదో విధంగా అన్న విధానమే అరిష్టదాయకం! ఆ విషయం గుర్తించినవారే విజేతలు! - శాండోప్రచండ్, శ్రీనగర్