మెయిన్ ఫీచర్

టర్నింగ్ పాయింట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథకి -మలుపు ఓ మెరుపుకావాలి. ఒక్కసారి తళుక్కుమని.. తరువాత అదృశ్యమై పోవాలి. కథని ఆసాంతం కుదిపేయాలి. లేకుంటే- కథ నిస్సత్తువగా నిస్సారంగా నిస్తేజంగా- సినీ బతుకు చిత్రాన్ని కాలరాచి పారేస్తుంది. సాఫీగా సాగిపోయే కథపట్ల ప్రేక్షకుడు అంతగా ఇంట్రెస్ట్ పెట్టడు. అంటే- వ్యాసార్థానికి మల్లే ముందుగా చిన్నతనం తాలూకు చిలిపితనాలూ -ఎదిగి వికసించిన తర్వాత.. ప్రేమలూ వాటి మధ్య రొమాన్స్ -ఇంటర్వెల్ తర్వాత వచ్చే ‘పగ వర్సెస్ ఫ్లాష్‌బ్యాక్’తో క్లైమాక్స్ చేరుకోవటం. ఈ కథల్లో మలుపు ఎక్కడన్నది ప్రస్తావించుకొంటే- ఘాట్‌రోడ్‌పై అన్నీ గతుకులే అన్నట్టు ఉంటుంది.
‘మలుపు’ తిరగని కథ ప్రేక్షకుణ్ణి ఆలోచింపజేయదు. ఆ ‘టర్నింగ్’ కూడా ఎలా ఉండాలంటే- ఏ ఆలోచన లేకండా చూస్తూ.. సడెన్‌గా ఉలిక్కిపడి థియేటర్‌లో సర్దుక్కూర్చుని.. రాబోయే కథపట్ల ఉత్కంఠతని కలిగేట్టు చేయగలగాలి.

చిన్న మలుపుచాలు, తెలుగు సినిమాను అడ్డంగా తిప్పేసి ప్రేక్షకుడిని చైర్‌లో నిలువుగా కూర్చోబెట్టడానికి. చాలా సినిమాలు చిన్న ట్విస్ట్‌తో పెద్ద హిట్టిస్తే.. ఇంకొన్ని సినిమాలు ట్విస్ట్‌లెక్కువై ఎవరికీ కనిపించని మలుపుల్లో ఇరుక్కుపోయాయ.
కుటుంబ కథలైతే -్ఫ్లష్ బ్యాక్‌తోనో.. సెంటిమెంట్ సినిమాలైతే -‘నుదుటి బొట్టు’ కానె్సప్ట్‌తోనో.. ‘పగ’ కథలైతే -పచ్చబొట్టు అనే మలుపుతోనో.. థియేటర్‌లో ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టేసాయ.
***
నానె్నవరో.. చెప్పమ్మా!??
ఒక్కసారి పాత తరం ‘మలుపు’లోకి వెళ్లి వద్దాం. బోలెడన్ని సినిమాల్లో ‘నానె్నవరో.. చెప్పమ్మా’తోనే కథ ప్రతీకారం వైపు టర్నవుతుంది. కాలేజీలో హీరోకి అవమానం ఎదురవుతుంది. తండ్రి ఎవరో తెలీదు? నువ్వు మాకు చెప్పేదేంటిరా? అన్న మాటలు ములుకుల్లా బాధించటంతో.. ఆఘమేఘాల మీద సైకిల్‌పై ఇంటికి చేరిన హీరోకి -అప్పుడే తల్లి తన భర్త లామినేటెడ్ ఫొటో ముందు బొట్టు దిద్దుకుంటూ ముతె్తైదువులా కనిపిస్తుంది.
ఆల్రెడీ తల్లిని తెల్లచీరలో చూట్టం ‘రొటీన్’ అయిపోయిన కథానాయకుడికి, తల్లి డిఫరెంట్ యాంగిల్‌లో కనిపించటం చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. కొడుకుని చూసి -అధాటున తత్తరపడి బొట్టు చెరిపేసుకో బోతూండగా-హమ్మా! చెప్పమ్మా.. మా నాన్న బతికే ఉన్నారా?’ లాంటి పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రేక్షకుణ్ణి కన్నీరు పెట్టించి.. ఆనక క్లైమాక్స్‌లో తన తండ్రిని ఏ దొంగల ముఠా డెన్‌లోనో చూట్టం.. నాలుగు ఫైట్ల తర్వాత ఇటు తల్లో అటు తండ్రో తేల్చుకోలేక -ఆఖరికి తల్లి త్యాగం మార్కుతో ముగియటం.. ‘నానె్నవరో చెప్పమ్మా’ కథల్లో చూసేశాం. అదే మలుపు అనుకొని మురిసిపోయాం. ఇక్కడ పాత కథల్ని తప్పుపట్టటం కాదు. అలాంటి కథల్ని చూసి మైమరచిపోయాం అని చెప్పటమే.
పచ్చబొట్టు చెరిగిపోదులే..
చిన్నతనంలో ఏ గోడ చాటునుంచో.. బీరువా వెనకనుంచో -తన తల్లిదండ్రుల్ని అతి దారుణంగా హత్య చేసిన ‘పచ్చబొట్టు’ చేయి పట్ల హీరో ఎదుగుతున్న కొద్దీ పగ ప్రతీకారాలతో రగిలిపోతూంటాడు. ఫ్లాష్‌బ్యాక్ మలుపులో.. ఆ ‘టాటూ’ తెగ చిరాకు పెట్టేసి.. ఇంటర్వెల్ వరకూ లాక్కొస్తుంది. చివరికి క్లైమాక్స్‌లో- అనే్నళ్లయినా ఆ పచ్చబొట్టు తాలూకు వ్యక్తి కొద్దిగా నెరసిన జుట్టుతో -సూటు బూటుతో ప్రత్యక్షమవుతాడు. పచ్చబొట్టు అనే కానె్సప్ట్ చెరిగిపోదు కాబట్టి -సినిమాని నిప్పులాంటి నిజంలా లాక్కొచ్చేయ్యొచ్చు. ఈ మలుపులూ మనకి కొన్ని సినిమాల్లో దెబ్బలు తగిలించాయి.
చేసుకున్న బాసలు.. చెప్పుకున్న ఊసులు అను కథ
ఈ భూమీద పడినప్పటి నుంచీ ‘్ఫలానా వాడి పెళ్లాం’ అని పెద్దలు ఫిక్స్ చేసేస్తే.. మాటలు రాని అక్షరాలు దిద్దని వయసునుంచీ ‘చేసుకున్న బాసలు.. చెప్పుకున్న ఊసులు’ అంటూ తెగ సంబరపడిపోయి.. ‘్ఫలానా వాడి పెళ్లాం/ మొగుడు’గానో ఫిక్స్ అయిపోయిన క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులు అనుకూలించక.. లేక ఏవేవో కుటుంబ అంతర్గత వ్యవహారాల వల్లనో ఆ ‘బాసలు-ఊసులు’ విడిపోవటం.. పెద్దదైంత్తర్వాత -ఏ బామ్మనో నాయనమ్మనో జ్ఞాపకాల పొరలకి ‘చిల్లు’పెట్టి చోద్యం చూట్టం -నాయకా నాయికలు ఆ ‘మలుపు’ దగ్గర కలుసుకోవటం.
ఇదో ట్రెండ్.
ఐతే- ఆయా కథలన్నీ ‘కంచి’ చేరేలోపు ఏం జరుగుతుందో ‘అన్నీ అలా తెలిసిపోతూంటాయ్’ అనుకొన్నప్పటికీ.. శుభం కార్డు వరకూ కళ్లప్పగించి చూసేశాం.
కుటుంబ కథలైతే -్ఫ్లష్ బ్యాక్‌తోనో.. సెంటిమెంట్ సినిమాలైతే -‘నుదుటి బొట్టు’ కానె్సప్ట్‌తోనో.. ‘పగ’ కథలైతే -పచ్చబొట్టు అనే మలుపుతోనో.. థియేటర్‌లోకి చొక్కాలు చించుకొని మరీ ప్రవేశించి.. మురిసిపోయాం.
ఇక జానపదాల్లోనూ.. ‘కవల’ కథల్లోనూ అనేకానేక మలుపులు -మాయలూ మంత్రాల్తోనూ.. మాంత్రికుడి ప్రాణాలు చిలక అనే మలుపులోనో పెట్టేసి.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఆ ట్రెండ్ మలుపుదాటి.. మరీ ముందుకు వచ్చేసి.. నాలుగైదేళ్ల క్రితంలోకి వచ్చేద్దాం.
***
మలుపు అనేది పాత్ర రూపంలోనో.. వాతావరణం రూపంలోనో.. లేదూ - బలవత్తరమైన సన్నివేశం రూపంలోనో వచ్చి.. ఆయా పాత్రలపై తీవ్ర ప్రభావాన్ని చూపాలి. లేకపోతే- అప్పటి వరకూ ఉన్న నిర్దిష్ట అభిప్రాయాలనూ ఆలోచనలనూ తెగ్గొట్టేసి.. కథ వేరే ట్రాక్‌లో పయనించేట్టు చేయాలి.
కథని సినీ ప్రక్రియాపరంగా మాట్లాడుకొందాం. ఒక కథని సృష్టించిన రచయిత ఆయా సన్నివేశాలను ప్లేకార్డ్స్‌పై రాసుకొంటాడు. వాటిలో ఓ కార్డ్‌ని తీసి పక్కన పెట్టినా.. ఆ కథ సాఫీగా నడిచిందంటే.. ఆ సన్నివేశంతోనో.. పాత్రతోనో కథకి అవసరం లేదన్నమాట. ఒక్కోసారి ఏదో కార్డ్‌ని మిస్‌చేస్తే.. కథ కంగాళీగా మారుతుంది. అంటే- ఆ సన్నివేశం కథకి ఎంత అవసరమో నిర్ణయించుకొంటాడు.
కథాగమనం ఇలాగే నడుస్తుంది. కాకుంటే -మంతనాల (గ్రూప్ డిస్కషన్స్) రూపంలో సాగుతుంది. ఇక్కడ ‘మలుపు’ ప్రధానాంశం కాబట్టి -ఆయా విషయాలను ప్రస్తావించుకోకూడదు.
నువ్వు నాకు ‘ఎందుకు’ నచ్చావ్?
ఓపెనింగ్ సీన్. హీరోయిన్ నిశ్చితార్థం. హీరో ఎంట్రీ. హీరోయిన్‌కి అనకాపల్లి హీరో నచ్చడు. తండ్రి కుదిర్చిన సంబంధంతో అడ్జెస్ట్ అయిపోతూంటుంది. నిశ్చితార్థానికి రాలేకపోయిన ఆమె మేనత్త- సహజాతి సహజంగా తన బాధని వెళ్లబోసుకుంటుంది. ‘నా జీవితంలో -మొగుడు అంతే. ఇనే్నళ్ల సంసార జీవితంలో ఏ రోజైనా నువ్వు తిన్నావా? అని అడగలేదని వాపోతుంది. దీంతో హీరోయిన్ మదిలో చిన్న అలజడి. అదే ఆమె జీవితంలో పేద్ద మలుపు. ఆ మలుపు అనే ట్రాక్‌లోకి హీరోయిన్ మనసు వచ్చేసింత్తర్వాత ఆటోమేటిక్‌గా ప్రేక్షకుడు ‘మేనత్త’ మాటల్తో కన్విన్స్ అయిపోయి.. తండ్రి చూసిన సంబంధం కాకుండా ‘నచ్చిన’ హీరోని చేసుకొంటే బావుంటుంది అనుకొంటాడు. ఇదే ట్రాక్‌లో అనుకోకుండా మరో మలుపు ఎదురవుతుంది. ‘ఏం సార్! పార్టీ ఎప్పుడు?’ అని అడుగుతుంది హీరోయిన్ నెయిల్‌పాలిష్ వేసుకొంటూ. ‘దేనికి?’ ‘ఉద్యోగం వచ్చిందిగా?’ ‘వస్తే?’ ‘జీతం ఇస్తారుగా?’ ‘ఇస్తే?’ ‘ఏం ఉద్యోగం అంటే ఇష్టంలేదా?’ మీ నానే్నమో... అని ఆ సన్నివేశం చాలా రసభరితంగా సాగుతుంది. ‘కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే వాళ్లూ... ఎదిగినప్పుడు భుజం తట్టేవాళ్లు నలుగురు లేకుంటే..’ అన్న మాటల్తో హీరోయిన్ మనసు పూర్తిస్థాయిలో హీరో వైపు మలుపు తిరుగుతుంది.
మంచి కాఫీలాంటి.. చీర?
‘ఆనంద్’ సినిమాలో అసలు మలుపు ఏమిటని ఎవరినైనా ప్రశ్నిస్తే- చక్కగా సాగిపోతూన్న ‘రూప’ జీవితంలోకి యాక్సిడెంట్ కారణంగా తగిలిన ఎదురుదెబ్బ అని చెప్పేస్తారు. కానీ- చీర ప్రస్తావన మాత్రం తీసుకురారు. అమ్మ చీర కట్టుకొంటానంటుంది రూప. కాబోయే అత్తగారు తమ స్థాయికి తగ్గట్టు సంప్రదాయబద్ధంగా తళుకులీనే చీర కట్టుకోమంటుంది. చీర మడత కాదు చీర మలుపు -కథని ఆసాంతం తిప్పేసి.. పెళ్లి చెడిపోవటం..

ఆనంద్ ప్రేమలో పడటం -మంచి కాఫీలాంటి సినిమా చూస్తాం.
ఖుషిఖుషీగా.. ఉంది సుమా!
మలుపు తాలూకు తీయటి అనుభూతిని అందించిన సినిమా ‘ఖుషీ’. ఇక్కడ కూడా మళ్లీ యాక్సిడెంట్ అనుకొంటాం. కానీ -ట్రాఫిక్‌లో అడ్డొచ్చిన వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకోండి అంటూ చెప్పిన మాట వద్దకువెళ్దాం. ఆ యాక్సిడెంట్‌కి కారణం ఆ వ్యక్తే. కథ క్లైమాక్స్ చేరినప్పుడు కూడా మళ్లీ ప్రత్యక్షమై.. అప్పటివరకూ మలుపులు తిరిగిన కథని మళ్లీ మలుపు బోర్డు దగ్గర నిలబెడతాడు. కథకి ఆ పాత్రతో సంబంధం లేదు. మళ్లీ మళ్లీ సీన్‌లోకి రాడు. ఓ కేరెక్టర్‌తో కథని ఈ విధంగా మలుపు తిప్పటం -సినీ లైఫ్‌లో ఓ కొత్త ‘నాటక’ ప్రక్రియకూ.. అందమైన మలుపునకు దోహదం చేసింది. ఇక్కడ ‘నాటక’ అన్న మాట ఎందుకు ప్రయోగించాల్సింది వచ్చిందంటే- ఓ నాటకంలో ఒక వ్యక్తి కనిపించిన ప్రతి ఒక్కరితో ‘టైం ఎంతైంది?’ అని అడుగుతూంటాడు. ఆ పాత్ర వల్ల కథకి ఏమాత్రం ఉపయోగంలేదు. కానీ- ఆ కేరెక్టర్ మళ్లీ ఎప్పుడు వచ్చి ‘టైం’ అడుగుతుందా? అని ఎదురుచూస్తాం. ఈ సినిమాలోనూ ‘ఆ’ వ్యక్తి మళ్లీ ఎప్పుడు వస్తాడా? అని కాచుక్కూర్చుంటాం.
మళ్లీ మళ్లీ రాని రోజు...
భావుకత్వం నిండిన మాటల్తో -సెల్యులాయిడ్‌పై అందంగా పరచుకొన్న దృశ్యకావ్యం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ఎందుకో హాయిగా సాగిపోతూన్న ‘నాజిరా ఖానం’ జీవితంలోకి ‘బాబాయ్ అర్జంట్‌గా రమ్మంటున్నాడు’ అన్న మాట కలవరపెడుతుంది. ఈ మాట కథని వైజాగ్ నుంచీ దుబాయ్ మలుపులో ఆగేట్టు చేస్తుంది. టోటల్‌గా ఒక డిఫరెంట్ యాంగిల్‌లోకి కథ వెళ్లి.. మళ్లీ ‘మెహక్’ వేసిన ‘సరదా’ పందెం అనే మలుపుతో వైజాగ్ చేరుతుంది.
ఇష్క్- వాతావరణం...
ఒక్కోసారి వాతావరణం కూడా మలుపునకు అనుకూలంగా మారుతుంది. ‘ఇష్క్’ సినిమాలో అదే జరిగింది. హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం -వాతావరణ పరిస్థితుల కారణంగా గోవాలో లాండ్ అవుతుంది. నాయకా నాయికల మధ్య ప్రేమకు అక్కడే పునాది పడుతుంది. ఓ కుర్రాడి చేతల్లోని ప్రేమను అర్థం చేసుకోవటానికి దోహదపడుతుంది.
ఇదే కథలో మరో మలుపు కూడా ఉంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రియురాలి అన్నయ్యని చూట్టం. ఫ్లాష్‌బ్యాక్‌లో జరిగిన గొడవ కూడా.
* * *
ఇలా ఉదహరించుకుంటూ పోతే -సినీ కథల నిండా మలుపులే మలుపులు. కాకపోతే- ఒక్క మలుపు ఉంటే.. అది క్లైమాక్స్ వరకూ అద్భుతాల్ని సృష్టిస్తుంది. కొన్ని కథలైతే -మలుపే ప్రధానం కాబట్టి అన్నీ మలుపులే ఉంటే -ఇటు ప్రేక్షకుడికి కథ ఎన్ని మలుపులు తిరిగిందో అర్థంకాక.. ఆ మలుపుల్ని అర్థం చేసుకోలేక.. కథ చతికిలపడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి మలుపు అందంగా ఉండాలి. ఆ మలుపు కథకి చక్కటి మజిలీ కావాలి. అంతేగానీ- అడ్డదిడ్డమైన మలుపుల్లో కథ ప్రయాణిస్తే.. డామిట్ -కథ అడ్డం తిరుగుతుంది!

-బిNk