ఆంధ్రప్రదేశ్‌

అమరావతిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
గుంటూరు, డిసెంబర్ 5: రాష్ట్రప్రభుత్వం రాజధానిని నిర్మించే సమయంలో చారిత్రక ప్రసిద్ధి గలిగిన అమరావతిని కూడా వారసత్వ నగరంగా గుర్తించి రాజధానికి అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, పార్లమెంట్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వెంకయ్యనాయుడు కోరారు. శనివారం వారసత్వ నగర అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గలిగిన అమరావతి పేరు అజరామరం అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ వారసత్వ నగరాలు 12 గుర్తించమని కోరగా, ప్రప్రథమంగా గుర్తుకు వచ్చిన నగరం అమరావతియేనని చెప్పారు. అమరావతి పుణ్యక్షేత్రమే కాకుండా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వారసత్వ నగరమన్నారు. వారసత్వ నగరాలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నామని, అమరావతి చిన్న పట్టణం కావటంతో సాంస్కృతిక, పర్యాటక శాఖ కేంద్రమంత్రి మహేష్ శర్మను కోరి ప్రసాదు పథకం ద్వారా రూ.28.36 కోట్లు మంజూరు చేయించటం జరిగిందన్నారు. హృదయ్ పథకం ద్వారా రూ.22.26కోట్లు తొలి విడతగా విడుదల చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు అమరావతికి ఇచ్చిందని, రాష్ట్రప్రభుత్వం కూడా మరో రూ.50 కోట్లు కేటాయించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పసంపదను తిరిగి తీసుకువచ్చేందుకు యత్నిస్తామన్నారు.

మోదీ ప్రతిష్ఠకు ఓర్వలేకే దుష్ప్రచారం
విజయవాడ, డిసెంబర్ 5: ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, ఆయనకు ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ప్రతిష్ఠను ఓర్వలేని కాంగ్రెస్, వామపక్ష భావజాలాలు కలిగిన కొందరు మత సహనం లేదని విమర్శిస్తూ కుట్రపూరితమైన ప్రచారం చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ కార్యాలయం ముద్రించిన ‘వాస్తవం తెలుసుకోండి’ పుస్తక ఆవిష్కరణ సభ శనివారం ఉదయం జరిగింది. వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశానికి మత అసహనం గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మనదేశం మీద మరొకరు దండయాత్రలు చేశారు తప్ప, ఇతర దేశాలపై భారతదేశం ఏనాడు దండయాత్రలు చేయలేదన్నారు. నెహ్రూ కుటుంబానికి దాసులై వారు తప్ప ఇతరులను గుర్తించని కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతాపార్టీ అంబేద్కర్, గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ర్తీ, తిలక్, భగత్‌సింగ్, నేతాజీ సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి ఎందరో దేశభక్తులకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు.