Others

నాకు నచ్చిన పాట--సంతోషం సగం బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో..’ సినిమాలోని ‘సంతోషం సగం బలం.. హాయి నవ్వమ్మా..’ అనే పాట చాలా ఇష్టం. బహుశా ఈ పాటకు నాలాగే చాలామంది అభిమానులు ఉండొచ్చు. చిరునవ్వుతో సినిమా మొత్తం సున్నితమైన హాస్యంతో హృద్యంగా సాగుతుంది. సినిమాలోని అన్ని పాటల్లానే ఈ పాట చిత్రీకరణ కూడా బావుంటుంది. నిరాశలో వున్నవారు ఈ పాట వింటే హాయి అనిపిస్తుంది. పాటలోని పదాలు, చరణాలు మనస్సుకు స్వాంతన, ఓదార్పు ఇస్తాయి. బ్రతుకుమీద ఆశలు కల్పిస్తాయి. పాజిటివ్ థింకింగ్‌లో సాగుతూ జీవిత సత్యాలను బోధించింది. ‘ఆశలు రేపిన, అడియాశలు చూపినా, సాగే జీవితం అడుగైనా ఆగదుగా! నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’ అంటూ సాగే ఈ పాట బాలు అద్భుతంగా పాడగా మనస్సుల్లో ముద్ర పడింది. పాట రాసిన రచయిత, చిత్రీకరించిన దర్శకుడు, పాడిన బాలుకి, సంగీత దర్శకుడు, సాంకేతిక నిపుణులను అభినందించాలి.

-ఎంవిఎస్ సంతోష్, కాకినాడ