మీ వ్యూస్

సంపాదనే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారల ప్రేమలు, ఎంగేజ్‌మెంట్లు, వివాహాలు, విడాకులు తోసుకురాడానికి రద్దవడానికి సంపాదన హెచ్చుతగ్గులే కారణమని స్థూలంగా చెప్పొచ్చు. పెళ్లివరకు రాకుండానే ఎన్నో ప్రేమలు ఎండిపోయాయని మనకు తెలుసు. వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దయిన బాధలో త్రిష విరామం లేకుండా నటించేస్తున్నదనడం కేవలం భ్రమ. చేతిలో చిత్రాలు లేనప్పుడు ఎంగేజ్‌మెంట్ జరిగింది. చిత్రాలు రాగానే రద్దయ్యంది. చాలామంది అంతే. పెళ్లయ్యాక కూడా ఆఫర్లువస్తే భర్త ఒప్పుకుంటే సరే.. లేకుంటే విడాకులిచ్చి అయినా సినిమాల్లోకి వచ్చేస్తారు. అందువల్ల సంపాదనే ముఖ్యం. ఎంగేజ్‌మెంట్లు, వివాహాలు, విడాకుల గురించి ఎవరూ పట్టించుకోరు.
- మైథిలి, సర్పవరం

కొత్త ఊపిరి
రొడ్డకొట్టుడు ఫ్యాక్షన్, ప్రేమ, హారర్ చిత్రాలతో విసుగెత్తిన తెలుగు సినిమా ప్రేక్షకులకు యువ సామ్రాట్ నాగార్జున కొత్త ‘ఊపిరి’నిచ్చాడు. మొన్న సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్నినాయన’ అంటూ బంగార్రాజుగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు పండగ చేశాడు. నాటి ‘విక్రమ్’ నాగార్జున ఎక్కడ.. నేటి విక్రమాదిత్య ‘ఊపిరి’ ఎక్కడ!? పట్టుమని నాలుగు సినిమాలతో నాగ్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ‘నటన’కు కొత్త్భాష్యం చెప్పాడంటే అది నాగార్జునకే సొంతం. ‘శివ’తో ట్రెండ్ సెట్ చేసి.., ‘గీతాంజలి’తో మెప్పించి.. అన్నమయ్య, రామదాసులతో ప్రేక్షకుల మదిని గెలిచాడు. ‘ఊపిరి’తో నటుడంటే అన్ని పాత్రలు చేసి శభాష్ అనిపించుకోవాలని నిరూపించుకున్నాడు. నాగార్జున తరం నటుల్లో ఒక్క నాగార్జునే చేయగలిగాడు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఊపిరి’. కొత్త ఒరవడికి శ్రీకారం ఊపిరి.
- కె శ్రీనివాసులు, హైదరాబాద్

బాహు..్భళీ!
జాతీయ సినీ పురస్కారాల్లో 63 ఏళ్లకు పూచిన తెలుగు స్వర్ణకమలం ‘బాహుబలి’. ప్రతి ఆంధ్రుడు రెట్టింపు గర్వించదగ్గ సమయం! ఎందుకంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కుగాను రెండు స్వర్ణకమలాలు వికసించాయి. అయితే ఉత్తమ చిత్రం నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమే. సాధారణ జనుల జీవన సమస్యలు, పరిష్కారాలు ప్రతిబింబించేదే ఉత్తమ చిత్రం అనేవారికి ‘బాహుబలి’ అర్హతను ప్రశ్నించవచ్చు. అత్యద్భుత కళానైపుణ్యంతో తయారుచేసిన ప్లాస్టిక్ పువ్వు ఒక పక్క, అడవిలో సహజంగా అత్యంత మనోహరంగా పూచిన పువ్వు మరోపక్క పెట్టి ప్రజలు దేనికి ఓటువేస్తారని అడగడం చిక్కుప్రశే్న! విమర్శించే వారిని పక్కనపెట్టి మళ్లీమళ్లీ దొరకని స్వర్ణకమలాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం!
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

అంతేమరి
‘ఇంకెంత కాలమిలా?’అని ప్రశ్నిస్తూ సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్‌గా మారిపోతున్న దుస్థితికి ఆవేదన చెందుతూ రాసిన వ్యాసం ఆలోచింపజేసింది. నిజమే.. సినిమా పట్ల తపన గాని, అవగాహన గాని లేనివారు నల్ల, తెల్ల డబ్బు సంచులతో రంగంలోకి దూకి సొమ్ము నొల్లుకుపోదామన్న యావ తప్ప ఆలోచన లేకపోవడంవల్లనే ఈ ఉత్పాతం. పది సినిమాల్లోంచి ప్రేక్షకుల్ని అలరించిన సన్నివేశాలు కొట్టేసి వాటిని ఏదోవరసలో రాసేసుకొని అదే కథ అంటున్నారు. అసలు సినిమాకు కథ ఎందుకు అనేవాళ్లూ ఉన్నారు! మాటలు వినిపించని గోలనే మ్యూజిక్ అంటున్నారు. నానా చండాలం తీసుకొచ్చి కామెడీ అంటున్నారు. పెద్ద చిత్రాలే కాదు చిన్న చిత్రాలదీ ఇదే దారి. వందలు ఖర్చుపెట్టి థియేటర్‌కి వెళ్లి తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకని జనం హాళ్లకు వెళ్లడం లేదు. ఇదంతా నిర్మాతల స్వయంకృతం!
-చంద్ర, కాకినాడ

భక్తి అంటే..
దేవాలయాలకు వెళ్ళో, తీర్థయాత్రలు చేసొస్తేనో, పూజామందిరాలలో పూజ చేస్తేనో దేవుడిమీద భక్తిప్రపత్తులు కలవని అనుకోవడం వాస్తవ దూరంకాకపోయినా, అవే గీటురాయికాదని ఏ పరిస్థితిలోనున్నా భగవన్నామస్మరణ ముఖ్యమని వేదసారాన్ని, పరమార్థాన్ని చాటిచెప్పిన చిత్రం ‘పరమానందయ్య శిష్యులకథ’. చనుకట్టును పానపట్టంలా భావించి పూజ చేయడం, ఆ పుష్పాలు పరమేశ్వరుని పాదాల చెంతకు చేరడం చక్కగా చూపారు. ఎన్టీఆర్‌కు పరిపాలకుల పాత్రలు చేయడం కొట్టిన పిండయితే ఘంటసాల సంగీతం, గానం సామవేద సారమే..
- జివి లక్ష్మి, తుని

అభినందనీయం
కొత్తతరం గాయకులకు పి.సుశీలగారి పాటలు మార్గదర్శకం. ఆమె పాటల్లో మాధుర్యం, శ్రావ్యత, స్పష్టత, సన్నివేశాల్లో పాత్రధారుల గాత్ర ధర్మంతో సహజంగా, తీయగా పాడడం ఆమె గొప్పదనం. అందుకే ప్రేమ, విషాదం, విరహం, హాస్యం, శృంగారం వంటి రసాలు అలవోకగా పలికించిన గాయని. దైవభక్తి, దేశభక్తి, జానపద, కరుణామయ, క్లబ్, పిల్లలు, వృద్ధుల గీతాలెన్నో పాడి ప్రేక్షక హృదయాలను దోచుకున్న మధుర కోయిల. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠి, తుళు, సింహళం మొదలైన భాషల్లో పాడి అన్ని భాషలవారి ఆదరణ పొందిన గాయనీమణి. అత్యధిక గీతాలు పాడిన గాయనిగా ‘గిన్నీస్ రికార్డ్’ సాధించిన పి.సుశీలగారికి అభినందనలు.
- సుసర్ల ధనలక్ష్మి, విశాఖపట్నం

పూర్ణ చంద్రోదయం
ఈవారం వెనె్నల (29.3.16) పున్నమివెనె్నలను తలపింపజేసింది. ఊపిరి సినిమా ఇంకా చూడకపోయినా సమీక్ష చదివి నాగార్జున పాత్ర ఔచిత్యాన్ని, అతను సాహసంచేసి అంగవికలునిగా నటించి అందరి అభిమానాన్ని పొందడం అభినందనీయం. పూర్వం ఎన్టీరామారావు, నాగేశ్వరరావులు ఇలాగే పాత్ర స్వభావాన్నిబట్టి కుంటి, గుడ్డివారిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. ఈనాటి టాప్ హీరోలు భేషజాలకు ఇమేజ్‌లకు పోకుండా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయేటట్టుండాలి. నాగార్జున వీరికి రోల్ మోడల్. సూపర్‌డూపర్ హిట్టయిన బాహుబలి తెలుగు సినిమాకు స్వర్ణకమలం తెచ్చిపెట్టి ‘్భళా’అని భూమిలో హెడ్‌లైనైపోయింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కంచె’ నిలవడం న్యాయపరమైన నిర్ణయమనిపిస్తోంది. ‘శరత్కాలం’. వృత్తిపట్ల గౌరవాన్ని ఎలా ప్రదర్శించాలో ఆకాశం అంత ఎత్తుఎదిగిన ఎన్టీరామారావు, ఘంటసాల లాంటి మహామహులు నేలమీద కూర్చుని చర్చించుకోవడం వారి నిరాడంబరతను నిర్ధారించింది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్