రివ్యూ

పికె.. మిస్ ఫైర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు- సర్దార్ గబ్బర్‌సింగ్
--

తారాగణం:
పవన్ కల్యాణ్, కాజల్, రాయ్‌లక్ష్మి, సంజన, శరద్ కేల్కర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ముఖేష్ రుషి, ఊర్వసి, ప్రదీప్ రావత్, గబ్బర్ బ్యాచ్
కెమెరా:
ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం:
దేవీశ్రీ ప్రసాద్
సంభాషణలు:
సాయమాధవ్ బుర్రా
ఎడిటింగ్:
గౌతంరాజు
నిర్మాత:
శరత్‌మరార్, సునీల్‌లుల్లా
దర్శకత్వం:
కెఎస్ రవీంద్ర (బాబి)
--

నిజమైన అభిమాని సినిమా సినిమాకూ మారడు. -అనేక సందర్భాల్లో పవన్ చెప్పిన మాటలివి. అందుకే -యూత్‌లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ పవన్‌కంటూ ఫ్యాన్స్ మాసీగానే ఉన్నారు. వాళ్లు మారేరకం కాదు. సో.. వాళ్లకోసమే అన్నట్టు పికె కూడా అప్పుడప్పుడూ కొన్ని మసాలాలను టేకప్ చేయాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్స్‌కు అలవాటుపడిన సెపరేట్ స్టార్ హీరో కనుక -ఆమధ్య ఎదురైన పరాజయాలు, తరువాత అందివచ్చిన సూపర్ విజయాలను దృష్టిలో పెట్టుకుని -్ఫ్యన్స్ కోసం వండి వడ్డించిన చిత్రమే సర్దార్ గబ్బర్‌సింగ్. కష్టాల్లో ఉన్నప్పుడు హిట్టు ఊపునిచ్చిన గబ్బర్ సింగ్‌కు సీక్వెల్ అన్న ట్రాక్‌లో దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఒకప్పుడు జానీకి డైరెక్షన్ బాధ్యతలు నెత్తికెత్తుకుని ఖంగుతిన్న పికె, చాలాకాలం తరువాత ఇప్పుడు కథ, స్క్రీన్‌ప్లే రెస్పాన్సిబిలటీస్ తీసుకున్నాడు. ఎలాగూ గబ్బర్ సింగ్ ఉంది కనుక, సర్దార్ దానికి సీక్వెలే కనుక.. ఆ కోణం నుంచే మళ్లీ స్టోరీ ట్రాక్‌ను తీసుకున్నాడు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి.. స్క్రీన్‌పై టైటిల్ పడేవరకూ విపరీతమైన క్రేజ్ చూపించిన సర్దార్.. షో తరువాత ఆడియన్స్‌కు ఎలాంటి శాటిస్‌ఫాక్షన్ ఇచ్చాడన్నది చూద్దాం.
పేరుకు సీక్వెల్ తప్ప, గబ్బర్ సింగ్ స్టోరీ, స్టాటస్‌తో ఏమాత్రం పోలికలేని చిత్రం -సర్దార్. కథలోకెళ్తే -అనాథ అయిన గబ్బర్‌సింగ్‌ని పెంచి పెద్దచేసి పోలీస్‌ని చేస్తాడు తనికెళ్ళ భరణి. రతన్‌పూర్‌కి సిఐగా వచ్చిన ఆ కుర్రాడే గబ్బర్. అక్కడ భైరవసింగ్ (శరద్‌కేల్కర్), అతని మనుషులు చేసే ఆగడాలను అడ్డుకుంటుంటాడు. రతన్‌పూర్‌కి చెందిన రాజకుమారి ఆర్షిదేవి (కాజల్ అగర్వాల్)ని తొలి ప్రేమగా ప్రేమించేస్తాడు. ఒకవైపు విలన్‌తో ఫైట్‌లు.. మరోవైపు రాజకుమారితో స్టెప్పులు. సినిమా మొత్తం ఇదే. ముందే చెప్పుకున్నట్టు పికె ఇమేజ్‌ను దృష్టిలోపెట్టుకుని ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా లాంటిది కనుక.. రెండున్నర గంటల అతిని పవన్‌కోసం భరించక తప్పదు. పవన్ స్టయిల్ ఎక్స్‌ప్రెసివ్ చమత్కారంతో ఫస్ట్ఫా అంతా సరదాగా సాగిపోయి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందన్న ఆత్రుత ఆడియన్స్‌కి ఎక్కడా కలగదు. వింతలు, విడ్డూరాలు, పవన్ మార్క్ మాయాజాలంతో సాగిపోయి క్లైమాక్స్‌కి వచ్చేస్తాం. క్లైమాక్స్ సైతం రొటీన్. కనీసం కథకు ఉండాల్సిన మినిమం ఫార్మాట్, క్వాలిటీస్ లేకపోవడంతో -పవన్ సినిమా చూశామన్న ఫీలింగ్ తప్ప మరేమీ కలగదు. ఫ్యూచర్ పాలిటిక్స్‌పై కాస్త ఎక్కువ దృష్టే పెడుతున్న పవన్ -అందుకు అనుగుణమైన ప్రయత్న సంకేతాలు సర్దార్‌లో వదిలాడు. హీరోయిజాన్ని మించి ఇతర పాత్రలతో పొగిడించుకోవడం, మధ్యలో జనం గురించి మాట్లాడటం, డైలాగుల్లో పొలిటికల్ ఫ్లేవర్..లాంటివి అందులో భాగాలే.
కథ, కథనాల మాటెలావున్నా -పవర్‌లాంటి హిట్‌నిచ్చిన బాబి సర్దార్‌ను ఏమీ చేయలేకపోడాడు. డైరెక్షన్‌లోనూ పవన్ మార్క్‌తప్ప, పవర్ స్టామినా ఎక్కడా కనిపించదు. ఆర్షిదేవిగా కాజల్ గ్లామరస్‌గా కనిపించినా -పవన్‌కల్యాణ్, కాజల్ మధ్య సన్నివేశాలు ఏమాత్రం రక్తికట్టేలా లేవు. మళ్లీ సాంబ క్యారెక్టర్ చేసిన అలీ, రొటీన్ పెర్ఫార్మెన్స్ చూపించిన గబ్బర్ గ్యాంగ్ విసుగుపుట్టించారు.
హిట్టనిపించుకున్న గబ్బర్‌సింగ్ ట్రాక్స్‌కు మించి దేవిశ్రీ మ్యూజిక్ అందించినా -స్క్రీన్ మీద అవి పండిన పాపాన పోలేదు. విజువల్స్ చూసిన తరువాత ఆడియో గ్రాఫ్‌ను పూర్తిగా డౌన్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఆర్థర్ ఎ.విల్సన్ ఫొటోగ్రఫీ మెరుపులు బావున్నాయి. కనీసం అరగంట సినిమాను ట్రిమ్ చేసేసివుంటే -బెటర్ అవుట్‌పుట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. కానీ -గౌతంరాజుకి ఆ చాన్స్ ఇవ్వలేనట్టుంది. భట్రాజు పొగడ్తలు తప్ప, మనసుకు హత్తుకునే సంభాషణలు రాసే అవకాశం సాయిమాధవ్ బుర్రాకు దక్కినట్టు లేదు. ప్రొడక్షన్ వేల్యూస్ గుడ్.
పవన్ హీరోయిజంపై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లిన ఆడియన్స్‌కి -స్క్రీన్‌పై కనిపించిన కొన్ని వెకిలి సన్నివేశాలు బాగా హర్ట్ చేస్తాయనడంలో సందేహం లేదు. బలమైన కథ లేకపోవడం, హత్తుకునే, ఆసక్తి కలిగించే స్క్రీన్‌ప్లే మిస్సవ్వడం, ట్రీట్‌మెంట్‌లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పికె సినిమా ఓ సీరియల్‌గానే తోస్తుంది. భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు బలవంతంగా నచ్చడం వినా.. కామన్ ఆడియన్స్‌ని సర్దార్‌గా పవన్ నిరాశ పర్చాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

-త్రివేది