Others

నాకు నచ్చిన సినిమా--గూఢచారి-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపరాధ పరిశోధక నవలలు విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతుంటే ఆ ఒరవడిగా తెలుగు చిత్ర సీమ కూడా కొత్త అడుగువేసింది. అప్పటిదాకా పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన దర్శక, నిర్మాతలు ‘గూఢచారి 116’ అనే కొత్తతరహా చిత్రాన్ని రూపొందించారు. ఏదైనా సరికొత్తగా చేయాలని దర్శకుడు మల్లికార్జునరావుకు వచ్చిన ఆలోచనకు రూపమే ఈ చిత్రం. కృష్ణ నటిస్తాను అన్న తర్వాత వీరిద్దరి విభిన్నమైన ఆలోచనలకు ప్రతిరూపంగా గూఢచారి-116 చిత్రం వచ్చింది. అప్పటివరకు అపరాధపరిశోధక చిత్రాలంటే ఏమిటో తెలియని తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్తగా అనిపించింది. తెలుగు చిత్రసీమకు హాలీవుడ్ వాసనను రుచి చూపించిందీ చిత్రం. రొటీన్ చిత్రాలకు భిన్నగావుండే ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో కృష్ణ స్టార్ హీరోగా స్థిరపడ్డారు. భారతదేశానికి కీడు చేయాలని ప్రయత్నించే విదేశీ మూకలకు, వారికి అండదండలు అందించే మనవాళ్లను ఏరి నాశనం చేయడమే ఈ సినిమా సారాంశం. రేలంగి పాత్ర సినిమాలో సరికొత్త హాస్యాన్ని పండించింది. కృష్ణకు స్నేహితుడుగా రాజబాబు, రమణారెడ్డిలు నవ్వులు పూయించారు. ముక్కామల విలనీ పాత్ర, శోభన్‌బాబు అతిథి పాత్రలో ఆయన చెల్లెలుగా గీతాంజలి నటన ఆకట్టుకుంటుంది. జయలలిత తన అందచందాలతో కనువిందు చేసిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్లే. ఏపాటకాపాట అద్భుతంగా వుండి మరీ మరీ వినాలనిపిస్తాయి. కృష్ణ సీక్రెట్ ఏజెంట్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇంత వైవిధ్యమైన కథాకథనాలతో నటీనటులతో తీర్చిదిద్దారు కనుకే ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి