Others

.తెలుగుదనం కోల్పోతున్నాం--డైరెక్టర్స్ ఛాయిస్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రసూల్ ఎల్లోర్

ఒకరికి ఒకరుతో.. తొలి చిత్రంతోనే
అభిరుచి వున్న దర్శకుడిగా గుర్తింపు పొందిన రసూల్ ఎల్లోర్ తొలుత కెమెరామెన్. తరువాతే దర్శకుడయ్యాడు. అయితే మంచి కథలకు, తెలుగుదనంవున్న కథనాలకు ఆదరణ
తక్కువగా ఉంటోందన్న ఆవేదన
వ్యక్తం చేస్తున్న రసూల్‌తో ఈ వారం
చిట్‌చాట్...

మీ నేపథ్యం?
-రాజమండ్రినుండి వచ్చాను. అక్కడే చదువుకున్నా.

దర్శకత్వంవైపు ఎలా వచ్చారు?
-కెమెరామెన్‌గా ఇండస్రీలో అనేకమంది దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో సొంత కథ, సొంత ఐడియాతో దర్శకత్వం వైపు వచ్చాను. మెప్పించగలనన్న నమ్మకం కలిగాకే సినిమా మొదలుపెట్టా.

మీకు నచ్చిన జోనర్?
-జోనర్‌కంటే కథనే నమ్ముతా. కానీ ఇప్పుడంతా ఒకే జోనర్ అయింది. హీరో హీరోయిన్లు, ప్రేమలు, విభేదాలు, స్టంట్లు, ట్విస్టులు, చివరికి కలిసిపోయారా లేక రివెంజ్ తీసుకున్నారా? అన్న జోనరే సాగుతోంది.

కథ ఎలా ఉండాలంటారు?
-పరభాషలో హిట్ అయిన సినిమాల త్రెడ్ తీసుకునో, లేక హక్కులు తీసుకునో తీయడం ప్రస్తుతం సాగుతున్న విధానం. దీనివల్ల ఓ దేశంలో హిట్ అయిన సినిమా ఇక్కడ హిట్ అవుతుందన్న నమ్మకం పెరుగుతోంది. ఒరిజినల్ థాట్‌తో తీసే వాళ్ళు తక్కువవుతున్నారు. ఇది భయపెట్టే పరిణామం. కాపీ కొట్టుకుంటూపోతే ఒరిజినాలిటీకి చోటెక్కడ.

మీ తరువాతి చిత్రాలు?
-మనసుకు నచ్చిన, తెలుగుదనానికి దగ్గరిగా ఉన్న కథలు కొన్ని రాసిపెట్టుకున్నా. రెండు ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి.

దర్శకుడంటే..?
-నిర్మాతకు ఫలాలు అందేలా సినిమాను ప్రేక్షకుడికి దగ్గరికి తీసుకెళ్ళేవాడే దర్శకుడు. మొలకెత్తే విత్తనమేదో రైతుకు తెలుసు. కానీ దర్శకుడు విత్తనాన్ని గాల్లోనుంచి తీస్తాడు. సరైన విత్తనాన్ని తీయగలిగేవాడే దర్శకుడు.

-శేఖర్