Others

నాకు నచ్చిన సినిమా--తాసిల్దారుగారి అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటభూషణ శోభన్‌బాబు ద్విపాత్రాభినయంతో అత్యద్భుతంగా నటించి మెప్పించిన శత దినోత్సవ చిత్రం -తాసిల్దారుగారి అమ్మాయి. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ సినిమా అన్న భావనే కలుగుతుంది. రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి నవలను యథాతథంగా మార్పులు చేర్పులు లేకుండా తీసిన చిత్రమిది. మరోపక్క కథాపరంగా పాత్రలకు తగిన నటులను ఎంపిక చేసి, ఆ పాత్రలను ఉదాత్తంగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు కెఎస్ ప్రకాశరావుకు దక్కుతుంది. తెలుగు చిత్రాల్లో ఇదొక ఆణిముత్యంగా పరిగణించొచ్చు.
సంభాషణలు సమకూర్చిన ఎన్‌ఆర్ నంది తన మాటల్లో పదును, చాతుర్యాన్ని ప్రేక్షకులకు రుచిచూపించారు. ఇక ఆత్రేయ కలంనుంచి జాలువారిన పాటలు చెప్పనవసరం లేదు. ప్రేక్షకుల మనసుకు పదునుపెట్టాయి. ఆ పాటలకు బాణీలు అందించిన మామ కెవి మహదేవన్ సంగీత గొప్పదనాన్ని ఎన్ని పదాలు ఏరుకున్నా వర్ణింపశక్యం కాదు. ‘ప్రేమనగర్’ చిత్రం తరువాత అంతటి విజయాన్ని అందుకున్న పాటలు ఈ చిత్రంలో మనకు వినిపిస్తాయ. సత్యచిత్ర బ్యానర్‌లో సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన చిత్రాలెన్నో నిర్మించారు. ఇందులో నటించిన పాత్రధారుల నటనా కౌశలాన్ని ఎంతచెప్పినా తక్కువే. ముఖ్యంగా హిట్ సాంగ్స్ తాసిల్దారుగారి అమ్మాయి చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయ. హీరోయిన్లు జమున, చంద్రకళ, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నిర్మల, నాగభూషణం నటనాశైలిని అభిమానులు ప్రశంసించకుండా ఉండలేరు. రాజబాబు హాస్యం మరింత పండించింది. సూక్ష్మమైన చిన్న అంశం -కండక్టరు కొడుకు కలెక్టరు అవుతాడా అన్న కథతో సినిమా అద్భుతం అనిపిస్తుంది. తనను అవమానించిన వారికి, తల్లిదండ్రులను విడదీసి కాపురంలో ఎడబాటు కల్గించినవారికి గుణపాఠం నేర్పి శెహభాష్ అన్పించుకున్న వాసు పాత్ర, ప్రసాదరావు, మధుమతి విషాద సన్నివేశాలు, బావను ఆటపట్టించే యువతిగా చంద్రకళ గొప్పగా నటించారు. శోభన్‌బాబు చిత్రాల్లో ఇదొక మైలురాయి.

-చోడవరపు రమాదేవి, హైదరాబాద్