మీ వ్యూస్

స్ట్రెయట్ సినిమా చేయాల్సిందే (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విశాల్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పుడొస్తున్న చాలామంది హీరోలకంటే మంచి పెర్ఫార్మెన్స్, సత్తా కలిగిన హీరోయే అయనా, ఎందుకో ఇక్కడ అతనికి స్థిరమైన మార్కెట్ ఉండటం లేదు. యాక్షన్, ఎమోషన్స్ పలికించగలగటంలో నేర్పరే అయనా, తమిళ్ నుంచి డబ్బింగ్ అవుతున్న అతని సినిమాలు తెలుగు ఆడియన్స్‌కు దగ్గర కాలేకపోతున్నాయ. ఒక సినిమా బావుంది అనిపించుకుంటే, వెంటనే మరో సినిమాను తిప్పికొడుతున్నారు. తెలుగు కుర్రాడైన విశాల్, తెలుగులో తనకంటూ మార్కెట్ సృష్టించుకోవాలంటే కొన్ని స్ట్రెయట్ తెలుగు సినిమాలు చేస్తే బెటర్ కావొచ్చు. నిన్నగాక మొన్న వచ్చిన కథకళి తమిళ్ మార్కెట్ వరకూ వర్కవుటైనా, తెలుగులో మళ్లీ విశాల్‌కు బ్యాడ్ రిజల్టే ఇచ్చింది. భవిష్యత్‌లోనైనా స్ట్రెయట్ తెలుగు సినిమాలు చేయకపోతే, ఇక్కడి మార్కెట్‌లో అతను నిలబడటం కష్టమే.
-రాధారాణి, ఒంగోలు

వరస మారకున్నది..
15.3.16 సంచిక వెనె్నల్లో మూడు సినిమాలు పెద్దగా బాగులేనివే అని తేలిపోయాయి. థియేటర్‌కు రేపు ఆదివారం వెళితే ఉంటే చూడడం లేకపోతే మళ్ళీ ఏ పాత సినిమాలో ఏ ఇంగ్లీషు లేదా హిందీ పిక్చరుకు వెళ్ళడం మినహా గత్యంతరం లేదు. ఫ్లాష్‌బ్యాక్ ఆత్మగౌరవం తాలూకు వివరణ బాగుంది. కానీ అంతవరకు అన్నపూర్ణ బ్యానర్ మీద తీసిన చిత్రాల్లో ఇది దిగదుడుపే. అవసరమా బాసూ అంటూ మురహరిగారి వ్యాసం బాగుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

సారీ, సత్తార్
ప్రవీణ్ సత్తార్ తన సత్తా చూపించి జాతీయ అవార్డు సాధించినా ప్రజల రివార్డ్ దక్కలేదు. దాంతో పరమపచ్చిగా వెగటుగా గుంటూర్‌టాకీస్ తీసి వదిలాడు. ప్రేక్షకుల్లో ఒక వర్గం సినిమాలోని వల్గారిటీని తిట్టిపోయగా కొందరు కేసుపెట్టారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు శునకాలు ఆర్భాటించినట్లు సినిమా సొమ్ములు నొల్లుకుపోయిన ఆరు నెలలకు సినిమాలో ఒకటిరెండు కట్స్ చెప్తూ తీర్పుఇస్తుంది కోర్టు. సత్తార్ విజయ సూత్రం కనిపెట్టేశాడు! సత్తార్ సాబ్! ఇకపై మరింత పచ్చిపచ్చిగా మరింత జారి సినిమాలు తీసి జనం మీదకు వదులు. ఎవరెంత విమర్శిస్తే మనకేల? సొమ్ములు కురుస్తాయి కదా. అది చాలు.
- గునే్నశ్, కొవ్వాడ

ఆత్మీయం
తెలుగుతనం ఉట్టిపడేసిన సినిమా ఆత్మగౌరవం. మన యింట్లోనే జరుగుతున్న సంఘటనలా యివి అనిపించక మానదు. ప్రేక్షకుడు ప్రతీ ఫ్రేములోనూ లీనమైపోతాడు. ఎక్కడా అతి లేకుండా గతి చెడకుండా మొదటి చిత్రమయినా ఆదుర్తివారి ప్రియశిష్యుడు విశ్వనాథ్ ఆత్మీయంగా తీర్చిదిద్దినందుకు అభినందనీయుడు. ఎటువంటి సాహిత్యాన్నయినా సన్నిహితం చేసే సుస్వరాల సాలూరి రాజేశ్వరరావు ప్రతిభను కీర్తించడం కష్టమే. పాత్రలకు ప్రాణప్రతిష్టచేసే ఉద్దండ పిండాలు- ఎ.ఎన్నార్, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, కాంచన, రాజశ్రీలు ఉండగా చిత్రం రక్తికట్టదా?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

కామేడీ హీరోలు
మార్చి 8 వెనె్నలలో కామెడీ హీరోలుగా వేసిన చలం, రాజబాబులను రచయితకు గుర్తులేనట్లుంది. చలం ఆల్‌రౌండర్‌గా అనేక పాత్రలతోపాటు హీరోగా సక్సెస్ అయి కామెడియన్స్‌గానే ఎక్కువమంది ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఒక స్టార్ కామెడియన్‌గా ఒక వెలుగువెలిగిన రాజబాబు దాసరి మొదటి చిత్రం ‘తాత-మనవడు’లో హీరోగా చేశారు(1973). దాసరి రెండవ చిత్రంగా ‘తిరుపతి’లో హీరోగా చేశారు. రాజబాబు సొంతంగా నిర్మించిన దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవరికివారే యమునాతీరే’, 1976లో రాజబాబు నిర్మాతగా తీసిన ‘మనిషిరోడ్డునపడ్డాడు’లో కూడా హీరోగా చేశారు. ఇవేకాకుండా కె.ఎస్.రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో పిచ్చోడిపెళ్ళి, ప్రసాద్ ఆర్ట్స్‌వారి అల్లుడొచ్చాడు, దాసరి గారిదే ‘సంసారం సాగరం’ హీరోగా ప్రధాన పాత్రలో చేశారు. నాగభూషణం నిర్మించిన ‘్భగస్తులు’లో కూడ హీరోగా ప్రధాన పాత్ర చేశారు. ఇలా రాజబాబు ఒక్కరే హీరోగా, ప్రధానమైన పాత్రలుగా మూడేళ్ళవరకు చేశారు. ఆరోగ్యపరంగా, వ్యసనాలకు దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకొని వుంటే హీరోగా కొంతకాలం చలామణి అయ్యేవారు.
- పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి

దటీజ్ మాళవిక
పరీక్షల కారణంగా నటి మాళవిక కళ్యాణ వైభోగమే చిత్ర ప్రమోషన్‌కు వెళ్లకపోవడం వివాదం అయింది. నయనతార లాంటి ఇంకొందరు కూడా ప్రమోషన్‌లో పాల్గొనరు. అందుకు రెండు కారణాలుంటాయి. ఆ సమయంలో పరీక్షలో, మరొక ముఖ్య కార్యక్రమమో ఉండటం ఒక కారణం కాగా చాలామంది తారలు ఫుల్‌మేకప్‌తో తెర వేల్పులుగా కనిపించి స్టేజిమీద సాదాసీదాగా ఒరిజినల్‌గా కనిపిస్తే జనంలో తేలిక భావం కలగవచ్చన్న భయం రెండో కారణం. తెరమీదకాక బయట నటీనటుల్ని సమాజ వాతావరణంలో చూసి షాక్‌అయిన వారున్నారు మరి! అయినా అగ్రిమెంటులో ముందుగానే ప్రమోషన్ గురించి రాసుకుంటే సమస్య ఉండదు కదా.
-ప్రభాస్, గాంధీనగర్

తాత-మనవడు
మార్చి 8 తేదీ వెనె్నలలో కామెడీ హీరోలు గురించి సేకరణకర్త తాత-మనవడు గురించి రాయడం మరవడం బాధ కలిగించింది.
రాజబాబు హాస్య నటుడిగా రంగప్రవేశం చేసి తనదైన శైలిలో ఇటు పద్మనాభం, అటు అల్లు లాంటి సీనియర్ మధ్యలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందడంతోబాటు రాఘవగారు నిర్మించిన దాసరిగారి దర్శకత్వంలో తాత-మనవడు చిత్రంలో కథానాయకుడుగా నటించి శహభాష్ అనిపించుకున్న రాజబాబు ఆ తర్వాత కాలంలో తనే ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డునపడ్డాడు చిత్రాలు నిర్మించి తానే కథానాయకుడిగా నటించిన ఘనాపాటి రాజబాబు.
సేకరణకర్త మరిచినా ఈ విధంగా గుర్తుచేసుకుంటున్నాం.
- మంగం ఆనందరావు, వేగివారిపాలెం