Others

వైవిధ్యమైన పాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగ వైకల్యంతో నాగార్జున వీల్‌చైర్‌కి పరిమితమయ్యే దృశ్యాలు ‘ఊపిరి’ చిత్రంలో వున్నాయి. చిత్రం షూటింగ్ సమయంలో -అది భరించలేక ఆ చిత్రం చేయొద్దని అఖిల్ తండ్రికి చెప్పాడట. ఎంతైనా సీనియర్, నటన అంతే అర్థం తెలిసిన వాడు కనుక నాగార్జన ఆ సినిమాని ధైర్యంగా చేశాడు. సినిమాకు తగినంత కష్టపడ్డాడు. ఈ రోజు దాని ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
తాతని ధిక్కరించే సీన్లు చేయలేనని నాగచైతన్య ‘మనం’ చిత్రంలో భీష్మించాడట. మొత్తానికి అప్పట్లో అతన్ని ఒప్పించారు. చిత్రం పూరె్తైంది. గోప్ప ఫలితం దక్కింది. అసలు -ఈతరం హీరోల దృష్టిలో నటన అంటే ఏమిటి? ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్, మూడు యుగళగీతాలు, నాలుగైదు ఫైట్లు, డాన్సులు- అంతేనా? తమిళ చిత్రాలు చూడండి. హీరోలు ఎన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారో! అలాంటి పాత్రలు మనవాళ్లు చెయ్యడానికి భయపడతారు. సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కనపెడితే, ఒక స్టేజ్ దాటిన తరువాత వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుని చేయడమే సీనియర్‌గా గుర్తింపు.
అన్నిరకాల పాత్రలూ పోషించినప్పుడే నటన పరిపూర్ణమవుతుందని నాగార్జునలాంటి వాళ్లను చూసి ఇప్పుడొస్తున్న హీరోలు గుర్తించాలి. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి సాహసం చేయాలి.

- పవన్‌పుత్ర, ఓ పాఠకుడు, రామారావుపేట