Others

గ్లామర్‌ని వాడుకోమంటోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా భామ ఇలియానాకు బాలీవుడ్‌లో సెటిలవ్వాలనే ఆలోచన కలిగి ఇక్కడ జోరుగా అవకాశాలు ఉన్నా కూడా కాదని బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ అడపా దడపా అవకాశాలు అందుకున్నా కెరీర్ పరంగా మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో తన అందాల్ని ఎరవేస్తూ హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. తాజాగా ఈ భామ అక్షయ్‌కుమార్ సరసన రుస్తుం చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఈమెది సాధారణ ఇండియన్ అమ్మాయి పాత్రేనట. మరో హీరోయిన్‌తో గ్లామర్‌ను పండించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో నేను గ్లామర్‌కు రెడీ అని, గ్లామర్‌కోసం నన్ను వాడుకోండని దర్శక, నిర్మాతలకు చెబుతోందట! అయినా వారు ఇలియానా పాత్ర పరిధి పెంచే అవకాశం లేనట్టే తెలుస్తోంది! సౌత్‌లో గ్లామర్ గర్ల్‌గా సంచలనం క్రియేట్ చేసిన గోవా భామ అందాలు బాలీవుడ్‌కు పెద్దగా నచ్చలేదేమో!