తెలంగాణ

వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాదాయ శాఖ మంత్రి సమీక్ష

హైదరాబాద్, డిసెంబర్ 5: వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టు దేవాదాయ శాఖ మంత్రి ఎన్.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష జరిపారు. దేవాలయంలో రెండు ప్రాకారాలు, మహా మంటప నిర్మాణంపై చర్చించారు. వేద పాఠశాల ఏర్పాటుపై శృంగేరి పీఠాధిపతి సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం త్వరలో దేవాదాయ అధికారులను శృంగేరీ పీఠానికి పంపాలని నిర్ణయించారు. రూ.60 కోట్ల వ్యయంతో గుడి చెరువు చుట్టూ విస్తరణ పనులు, రింగ్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అలాగే గుడి చెరువు వద్ద నిర్మించ తలపెట్టిన ఆధ్యాత్మిక పార్కుకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అధారిటీ ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు. త్వరలోనే అభివృద్ధి కమిటీని నియమించనున్నారు. సమీక్షా సమావేశంలో దేవాదాయ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమీషనర్ కృష్ణవేణి, వేముల వాడ ఈవో రాజేశ్వర్ పాల్గొన్నారు.