వీరాజీయం

‘జమిలి’కి ఇది సమయం కాదు సుమా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పళళ్ఘూజ.ష్యఖౄశజఒఆబఘౄజ.ష్యౄ

నిజానికి ‘ఒక్క ఐఢియా దేశాన్ని మార్చేస్తుంది’ అన్నమాట జిఎస్‌టి విషయంలో ఏమో గానీ, జమిలి ఎన్నికల విషయంలో చలామణి అయ్యేటట్లు లేదు. అయినా ప్రధాని నరేంద్ర మోదీజీ మనసులో మాట కనుక దేశ వ్యాప్తంగా అది చర్చలలో షికార్లు కొడుతోంది. దేశంలో మొట్టమొదట 1952లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి కాని, 1954లోనే కొత్త రాష్ట్రాలు కేరళ, పంజాబు పోలింగ్ బూత్ వైపు పరుగులు తీశాయి. ఎన్నికలు జరిగాక అనుకోని అవాంతరాలు, అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప కొత్త ఎన్నికలు రాజ్యాంగ రీత్యా సాధ్యం కావు. అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలైపోతే అక్కడితో స్థిరంగా- కేంద్రంలోను, రాష్ట్రాలలోను కూర్చుని పరిపాలన కొనసాగింవచ్చు అన్న ఆశ- కేవలం రంజు అయిన చర్చలకు మాత్రమే బాగుంటుంది తప్ప అది ఆచరణ సాధ్యమా? అన్నది కేవలం ప్రధాని మోదీ మనసులోనే- ఇంకా శిశువుగా పాలు తాగుచున్నది. అయితే, ఈ ‘జమిలి’ ఎన్నికల ఐడియా ఇదివరకే- వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలి అంటే ‘లోహ పురుషుడు’ లాల్‌కిషన్ అద్వానీ తన మనసులో మాటగా- 2012లోనే జమిలి ఎన్నికల ఐడియాని అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖాస్త్రం సంధించి మరీ తెరమీదకి తెచ్చాడు.
కానీ, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తితో నెలకొన్న ఫెడరల్ సిస్టం- కీడెంచి మేలెంచమన్నట్లున్నది. కేంద్రం దారి కేంద్రానిదే, ప్రాంతీయ ఎన్నికల దారి వాటిదే అన్న రీతి ప్రజాస్వామ్యాన్ని మూడు సంక్షోభాలు- ఆరు ఆందోళనలుగా ఎన్నికల జాతరలు కొనసాగాయి. ఓడిపోయిన పార్టీ తపన ఆగకుండా మళ్లీ ఎన్నికల దాకా ఆర్తనాదాలు చేస్తునే ఉంటుంది. ఈ నేపథ్యంలో నుంచి సంకీర్ణ రాజకీయాలు పుట్టొకొచ్చాయి. వింత పొత్తులు, విచిత్ర పార్టీ కలయికలు ఇవన్నీ ‘కిస్సా కుర్సీకా’ చూపెట్టిన మాటలే.. అదంతా ఓ నాటి భారతం- ఎన్‌డిఏ, యుపియ్యేలు ఏర్పడ్డాక దేశ రాజకీయాలు లూజుగానే అయినా రెండు ముఖ్య కూటములుగా స్థిరపడటంతో కేంద్రంలో ఈ భావం మారిపోయింది.
కేంద్రం తీరు ఒకటి, రాష్ట్రాల రీతి మరొకటిగా వుండి- భారతీయ జనతాపార్టీ పుంజుకోవడానికి దారితీసింది. కానీ, బండ మెజారిటీ వున్న పార్టీకి బాస్- అరివీర భయంకరుడయిన నరేంద్ర మోదీ బుర్రనిండా నిత్యనూతనంగా- నోట్ల రద్దు మొదలు జిఎస్‌టి దాకా ఐడియాలు రావడంతోబాటు- దేశ పటం తెల్లరిపాటికి అలాగే వుంటుందా? అన్నది అనుమానం అయిపోయింది. అనడానికి ‘సబ్కా సాథ్’ అంటున్నా హమారా హుకుం జారీ రహేగా- అన్న ధోరణి పార్టీలోనూ, దేశంలోనూ తలఎత్తుతున్న దశలో విపక్ష హోదా సంపాదించుకోలేకపోయినా- ఇంగువ కట్టిన గుడ్డగా మిగిలిన కాంగ్రెస్ పార్టీమీద- సానుభూతి ఒకటి ‘పిల్లతెమ్మరలుగా’ ఎదురురావడం- పోయిన సంవత్సరం జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కొంచెం కొంచెంగా మోదీజీ, అమిత్‌షాలకి కాస్త ఎదురుదెబ్బలా తగిలింది. ‘ఏ భాయ్ జరా దేఖ్కే చలో’ అన్న వార్నింగ్ బెల్స్ కొట్టాయి. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల జోరుని, తీరుని కూడా మోదీ గాలి నిలవరించలేకపోడం- ఇవాళ్టి వర్తమాన దేశ రాజకీయ ‘చిత్రం’. కేంద్రంలో పాతుకుపోయిన పార్టీలో ఉలికిపాటుకు తెచ్చింది. యుపిలో యోగిని పెట్టగలిగినంత యోగం కలిసివచ్చినప్పటికీ - మోదీ సొంత గడ్డ గుజరాత్- అప్రతిహత అఖండ విజయాలన్నమాటకి- సొడ్డు పెట్టిన రీతిలో కంగు తిన్పించాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లలేదనీ- రుజువు చేస్తే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ కాదు సామీ- కష్టాలు లేని సంక్షేమ రాజ్యం కావాలని ప్రజలు ఎలుగెత్తినట్లయింది. పోలింగు బూత్‌ల దగ్గర- ఏటిఎం క్యూల క్షోభని జనం వెళ్లబోసుకుంటూ ముందుకు సాగడాన్ని చూడలేదు. భాజపా పార్టీని ‘్థంకు ట్యాంకు- థింకు ట్యాంకు’ అంటూ ఎవరన్నారు? అది ‘అమిత్ షా మోదీజీలేగా.
మోదీ సంస్కరణలు- కొన్ని రాష్ట్రాల ప్రజలలో చాలామందికి ఇష్టం లేదేమో అన్న అనుమానం- గుజరాత్ ఎన్నికలు- గట్టి దెబ్బతీసి మరీ రుజువు చేయడంతో- ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న ఐడియాకి బలం చేకూరింది. ఒకేసారి ఎన్నికలు - అసెంబ్లీకి, లోక్‌సభకి చేసి పడేస్తే బోలెడంత ఖర్చు, సమయం ఆదా అవుతాయి అన్న మనసులోని మాట గట్టిగా బయటపెట్టారు. దీనికి వూతంగా కాంగ్రెసు రాజ్యసభ్యుని ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాచప్ప సుదర్శన్ కమిటీ కూడా జమిలికి జై అన్నది. ఒకేసారి సామూహిక సత్యనారాయణవ్రతం లాగా, కళ్యాణ మహోత్సవంలాగా లాగించేస్తే- ఎంతో ఖర్చు, సమయం, శ్రమా వగైరా కలసివస్తాయి అన్న ఐడియా సారుగారి బుర్రలో బాజా వాయించేస్తోంది. హల్లో సీఈసీ సారూ.. మీరేమంటారు? అంటే- మేము రెడీ అన్నారు కొత్త ఈసీ బాస్‌గారు కూడా.
1952 తరువాత ఏకాండీ ప్రక్రియగా ఎన్నికలు సాధ్యం కాలేదు.. ఒక్క ఆంధ్ర, తెలంగాణ, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మాత్రం- ఒకేసారి కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జమిలిగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక బాకాయేగా రాష్టప్రతి ప్రసంగం- ఇటీవల రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలో కూడా జమిలి ఐడియా చోటుచేసుకున్నది. దేశం అంతా ఒకటే ఎన్నికలు, ఒకటే అవ్వాలి అన్న మోదీజీ ఐడియా బ్రహ్మాండమే గానీ రాజ్యాంగం సమాఖ్య ప్రతిపత్తిని ఉటంకిస్తూనే పురుడు పోసుకున్నందున ఒక రాష్ట్రంలో గవర్నమెంటును తీసేసి జనరల్ ఎన్నికల దాకా ప్రక్కన కూర్చోబెట్టి- మేము వున్నాం సెంటర్లో పాలిస్తాము అంటే కుదరదు. అసెంబ్లీలో మెజారిటీ పోగొట్టుకున్న పార్టీ బేరసారాలు చేసుకోవచ్చును- మధ్యంతర ఎన్నికలకు రెడీ అవవచ్చును- మనసులో మాట అక్కడ చెల్లదు- చలోమంటూ ఎన్నికలకి ఏర్పాట్లు చెయ్యడం ఈసీ విధి అయితే వాటిని నిర్వహించడం కేంద్ర సర్కారు పని- మోదీజీ ఐడియాకి ఎదురులేదు, ఎందుకంటే మోదీ గాలి అంటారో, వేవ్ అంటారో అది ఆయన విమానాలలో తిరుగుతున్నప్పుడు క్షణక్షణానికి జోరందుకున్నందువల్ల భాజపా ఎదురులేని పార్టీ అయ్యింది. ఓ పెద్దాయన అంటే- సీనియర్ సిటిజనుడు జోకేడు కూడాను.. ‘ఆయనకేమిటండీ.. ఇంట్లో ఇల్లాలి పోరు లేదు- పార్లమెంటులో విపక్షాల పోరు జోరు రెండూ నాస్తి.. విదేశాలలో పూల రంగడేన’ని. అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో నవంబర్ ఎనిమిది డేటు (పెద్దనోట్లు రద్దు) మరొక్కటి రాదు.
ఒకే దేశం కనుక ఒకే పన్ను - జిఎస్‌టి తెచ్చిన మేధావికి- ఆధార్ కార్డు మీద సుప్రీం కోర్టుని తల బద్దలు కొట్టుకునేలాగ చేస్తున్న ఆయన మరో ఆంబిషన్ పెట్టుకున్నాడు. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ‘నక్కో’- కాంగ్రెస్సు రహిత దేశ్ అన్నాడు- గరీబీ హటావో అన్నట్లు- కాని ఇంగువ కట్టిన గుడ్డ- పార్టీ- గుజరాత్‌లోనే దాక్కొని వుంది సుమా అని తెలిసింది. ఎన్నికలకి వెళ్ళడం బెటరా? అన్న ఐడియా కూడా వస్తోంది. ఎన్నికలంటే మాటలా? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం- అంటే అతి పెద్ద వోటర్లేగా. అతి ఎత్తుఅయిన హిమాలయాలు- అయ్యా! అలాగే అతి లోతయిన హిందూ మహాసముద్రము- ఇక్కడే వున్నట్లు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు- అరవై రకాల ఆలోచనలు వున్నాయి. ఎన్నికల సంఘం వారి లెక్కల ప్రకారం జనరల్ ఎన్నికలకు, చెలరేగే హింసాతిరేకానికి కూడా లెక్కలున్నాయ్- ఎన్నికలకి మొత్తం ఎనిమిది వేల కోట్ల రూప్యములు ‘ఖర్చ్ కర్నా పడేగా..’ అనగా ఏటా భారీగా ఖర్చన్నమాట- వోటర్ల సంఖ్యతో తులాయించి చూస్తే ఓటరు ఒక్కింటికి ఇరవై ఏడు రూపాయలు పడుతుందని పేపర్లో చదివాను- అమ్మో? అని గుండె బాదుకునే ఖర్చు కాదిది. శాంతి భద్రతలకి- పార్టీ ప్రతిష్ఠకి- అభ్యర్థి అవసరానికి మత్రమే పై ఖర్చు. పైగా కేంద్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం రాష్ట్రాలలో ప్రెసిడెంటు రూలు పెట్టి- అన్నిరకాల ఎన్నికలని ఓ గాట కట్టాలి అంటే సరంజామా ఏదీ? మందీ మార్బలం ఎక్కడివాళ్లక్కడ పనికిరారాయే.. సైన్యం దిగి యుద్ధం కోసం రెడీగా వుంటే తప్ప- పార్టీల పౌరుషం ఆగదాయే- ఈలోగా ఓ స్పీడు బ్రేకరు వచ్చింది- రాజస్థాన్ అనే సొంత స్టేటులో మూడు సీట్లు- అందులో రెండు పార్లమెంటు స్థానాలు పోయేయి. భారీ లాస్‌గా సోదిలోకి రాకుండా చేద్దామనుకున్న పార్టీ- పైలట్ సచిన్ అనే కుర్రాడి ఆధ్వర్యంలో గెలిచింది- బెంగాల్ సంగతి పక్కనబెట్టండి. అక్కడ ప్రాంతీయ పార్టీ వుంది.
ఎన్నికలు ఈ ఏడాది లేవు కాని ఈ ఏడాది ఎన్నికలకి పోయే రాష్ట్రాలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో బాటు రాజస్థాన్ కూడా వున్నది. రెండు పార్లమెంటు స్థానాలు పోవడం అంటే పదహారు అసెంబ్లీ సీట్లు, ప్లస్ పోయిన ఒక సీటు కలిపితే మొత్తం పదేడు విధానసభ సీట్లకి సొడ్డు అన్నమాట. అవతల దక్షిణాదికి మోదీజీకి వేవ్‌లెంగ్త్‌లో బాగా డిఫరెన్స్.. పోనీ-ఇటు ఈసీ రిపోర్టు చూద్దామా? అంటే జమిలికి సూత్రప్రాయంగా రెడీ కాని 2018 దాకా సాధ్యం కాదు- ఇప్పుడేగా మీరు నిధులు మంజూరు చేసారు అన్నాడు ఈసిగారు- మహారాష్టల్రో గ్రామాల్లో హీటు ఎక్కువయిపోయింది- అందుకనే బడ్జెట్‌ను సీనియర్ (విమర్శకులు వాళ్లేగా) సిటిజనులని - రైతుల్నీ దువ్వడానికి వాడుకున్నారు. వచ్చేసారి 2024 నాటికి ఇంకా ‘అచ్చాదిన్ వస్తాయేమో?’ ఈలోగా జమిలికి రెడీ అవుదాము అనుకోక తప్పదు మోదీజీకి
బెటర్ ఫేస్ ది అసెంబ్లీ ఎలెక్షన్స్.. ఫస్ట్.. గో టు కర్నాటక..!

veeraji.columnist@gmail.com