Others

ముస్లిం దేశంలో శివపూజలు (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోని చెక్వాల్ జిల్లాలో అతి పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించి శివరాత్రి సందర్భంగా అభిషేకాది పూజాలు, జాగరణలు చేయడానికి 175 మంది హిందువులు ఈమధ్య వాఘా గేట్‌ను దాటి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు.
‘హిందుస్తాన్, పాకిస్తాన్ భాయ్ భాయ్’ అంటూ ఆలింగనాలు, కరచాలనాలు అయిన తరువాత ఈ శివభక్తులు కటాస్‌రాజ్ ఆలయానికి చేరుకున్నారు. ఈనెల 11 వరకూ వీరి తీర్థయాత్ర కొనసాగుతుంది. వీరికి కావలసిన సదుపాయాలన్నీ తమ దేశం చేస్తున్నదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. భారత్‌లో ఎన్నో శివాలయాలుండగా ఎన్నో అవస్థలు పడి పాక్ వెళ్లడం ఎందుకుటా? అంటే- కటాస్‌రాజ్ గుడి వద్ద తటాకంలో స్నానం చేస్తే సకల పాపాలూ హరించిపోతాయని భక్తుల నమ్మకం.
‘కటాస్’ అన్నమాట ‘కటాక్ష’ అన్నమాటకి వచ్చిన మార్పు. ఈ తటాకం రెండొందలకుపైగా లోతున్న జీవ సరస్సు. ఇది మహాశివుని కన్నీటి ధారలతో ఏర్పడ్డదని అంటారు. శివుని కటాక్షంతో ఏర్పడ్డ ‘పుష్కర్ కటాస్ రాజ్’ దేవాలయ సముదాయం చాలా పెద్దది. మహాభారత కాలం నాటి ఈ ప్రాచీన ఆలయంలో శివలింగాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రతిష్ఠించాడని చెబుతుంటారు. పాండవులిక్కడే అజ్ఞాతవాసం చేశారట! శివపార్వతుల కల్యాణం జరిగిందీ, సతీవియోగంతో మహాదేవుడు కన్నీరు మున్నీరైపోయినదీ ఇక్కడేనంటారు.
చారిత్రక స్థలాల్లో ఇది ఒక ‘అజూబా’ అంటే- అద్భుతం. రామాలయం, హనుమంతుని మందిరం, రంగురంగుల కుడ్య చిత్రాలున్న మందిరాలు, ఒక మ్యూజియం ఇక్కడ వున్నాయి. క్రీస్తు పూర్వం 300 నాటి కటాస్‌రాజ్ యాత్ర పూర్తయ్యాక పాదయాత్ర చేస్తూ భక్తులు లాహోర్ చేరుకుని అక్కడున్న కృష్ణ మందిరాన్ని దర్శించి, తిరుగు ప్రయాణం కడతారని పాక్‌లోని ‘డాన్’ పత్రిక ప్రముఖంగా రాసింది. కటాస్‌రాజ్ శివాలయ సముదాయం నిండా సొరంగాలున్నాయి. వాటికి కిటికీలూ, దారులూ, గాలి వెల్తురూ కోసం ఏర్పడి వున్నాయి. కాకపోతే శివాలయంలో ముందుగా దర్శనమిచ్చే ‘నంది’ విగ్రహం లేదు. ఇదీ ఓ విశేషమే.
ఆ విమానంలో అంతా స్ర్తిలే!
మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా గగనవీధిలో ఓ అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకి నాన్‌స్టాప్‌గా ఎగిరే బోయింగ్ విమానం ఒకటి గగన వీధుల్లో - మగ సాయం లేకుండా 17 గంటల సుదీర్ఘ ప్రయాణం (14,500 కి.మీ) జేగీయమానంగా సాగించింది! ఇందులో కెప్టెన్ క్షమతా వాజపేయి గాక మరి నలుగురు ‘పైలటమ్మ’లు వున్నారు. 500 కి.మీ వేగంతో ‘అమ్మాయిల గగనయానం’ అటు అమెరికాకు సాగుతుండగా, ఇటు మన దేశంలో కూడా స్ర్తిల గౌరవార్థం అంతా అతివలే నిభాయించే దేశీయ విమానయానాన్ని కూడా మొదలుపెట్టింది ఎయిర్ ఇండియా.
‘మగవాడి రాజ్యం’ అనుకున్న ‘గగనయాన రంగం’లో 1985లోనే ఒక చిన్న విమానాన్ని మొత్తం మహిళలే నిర్వహించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఇండియన్ వుమెన్ పైలట్స్ సంఘం అధ్యక్షురాలు హరిప్రీత్‌సింగ్ డే అందరికీ జ్ఞాపకం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇలా గగనసీమలోనూ జరిగింది. ‘లేచింది మహిళా లోకం, దిద్దరిల్లింది అంతరిక్షం’ అంటూ పురుషలోకం కీర్తించదా మరి!
బందిపోటుకి ‘విద్యుత్’ షాక్!
ఇపుడు 91 ఏళ్ల వయోవృద్ధుడిగా, బ్రహ్మకుమారీ సంస్థ శాంతిదూతగా జీవిస్తున్న పంచమ్‌సింగ్ చౌహాన్- ఒకప్పుడు ‘గబ్బర్‌సింగ్‌లకు గబ్బర్‌సింగ్’ అన్నంతటి భయంకర చంబల్‌లోయ బందిపోటు. 1960 దశకంలో అతని పేరు చెబితే పిట్టలు కూడా నీళ్లు ముట్టేవి కావట! అతని గ్యాంగులో 550 మంది బడా బందిపోట్లు ఉండేవారు. ఆనాడు ఈ బందిపోటును పట్టిచ్చినా, చంపినా రెండు కోట్ల రూపాయల అవార్డు కూడా వుండేది. 1972లో చౌహాన్ లొంగిపోయాడు. 125 మంది నిండు ప్రాణాలు హరించేడన్న నేరానికి, దోపిడీలకి విచారింపబడి జైలుశిక్షననుభవిస్తూ కారాగారంలోనే బ్రహ్మకుమారీ కార్యకర్తగా, ప్రచారకునిగా కొత్త అవతారమెత్తాడు.
తన గ్రామంలో ‘అఖాడా’ (తాలింఖానా) నడుపుకుంటూ అంతర్జాతీయ బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయ శాంతి సభల ఏర్పాట్లు పర్యవేక్షించే ‘పంచమ్’ ఇవాళ రెండున్నర లక్షల రూపాయల ఎలక్ట్రిక్ బిల్ ‘కట్టలేదన్న నేరం’మీద ‘అరెస్ట్ వారెంట్’ అందుకుని గడ గడా వణికిపోయాడు. ‘నా పరువు పోయింది. నేను విషం మింగేస్తాను’ అంటున్నాడు. భోపాల్‌లో తన గృహాన్ని 35 ఏళ్ల క్రితమే బ్రహ్మకుమారీల సంస్థకి యిచ్చేశాడుట. పాపం! దాని ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుండా వాళ్లు పంచమ్ సింగ్ చౌహాన్‌ని ముంచేశారుట. దోపిడీలు, హత్యలకూ పేర్గాంచిన ఈ మాజీ బందిపోటు ఇపుడు- ‘నన్ను, నా కుటుంబాన్ని బ్రహ్మకుమారీలు ముంచేశారండయ్యా!’ అంటూ వాపోతున్నాడు. మా అమ్మాయి నగలు కూడా వాళ్లకే యిచ్చేశానండయ్యా! అని కూడా అంటున్నాడు. నిన్నటి భయంకర ‘పులి’ నేడు ‘పిల్లి’ అయిపోయాడు, పాపం..! విధి ఎంత క్రూరమో కదా..!
నిక్కర్లకు చెల్లుచీటీ..?
ఆర్.ఎస్.ఎస్. (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) పరివార్ కవాతుకి అటల్ బిహారీ వాజపేయి అయినా, లాల్ కిషన్ అద్వానీజీ అయినా ఖాకీ నిక్కర్, తెల్లచొక్కా, నల్లటోపీ, కాన్వాస్ షూస్ ధరించి వస్తారు. నియమ నిబంధనల విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు ‘యమా స్ట్రిక్ట్’ అంటారు మిగతా పార్టీల నాయకులు కూడా. ఈనెల 11-13 తేదీల్లో నాగపూర్‌లో జరిగే ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’లో ఈ దుస్తుల మార్పు విషయం చర్చించి ఓటింగ్ ద్వారా- ఖాకీ నిక్కర్లకు బదులు ‘బ్లూ’ ట్రౌజర్లు లేదా ‘గ్రే’ కలర్ ప్యాంట్లు వేసుకోమందామా? అని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నిజానికి, ఈ ఖాకీ నిక్కర్లను సర్‌సంఘ్ చాలక్ కె.బి.హెగ్డేవార్ గారే 1924లో నిర్దేశించారట. 1930లో ‘నల్లటోపీ’ అవతరించింది అన్నది చరిత్ర. 2010లో కాబోలు- కాన్వాస్ పటకాలకి బదులు ‘తోలుబెల్టులు’ వేసుకోవచ్చునన్న ఆదేశాలు వచ్చాయి.
మొత్తంమీద ఈ మార్పులకు ‘కార్యకారణ మండల్’ ఏనాడో సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఆన్‌లైన్ మెంబర్‌షిప్ డ్రయివ్ 2012లో మొదలైందిట. దీంతో మెంబర్‌షిప్ తెగ పెరిగిపోతోందిట. అయితే ఆడపిల్లలకి ‘శాఖా’లు లేవు- ‘మిలన్’లో చాలామంది ఆడపిల్లలు చురుకుగా పాల్గొంటున్నారేమోగానీ- యువతీమణులకు కూడా ‘శాఖా’లుండాలనీ కోరితే తప్పా? అంటూ ఒక కబడ్డీ విద్యార్థిని అడిగింది. మరి ‘సంఘ్’ పెద్దలే చెప్పాలి దానికి జవాబు. క్రమశిక్షణని ఒక తపస్సుగా చెప్పే రీతి ఏదైనా గొప్పదే!
*

-వీరాజీ