వీరాజీయం

షాపింగ్‌కి వేళాపాళా అక్కరలేదిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమండోయ్! దోమలమందయిపోయింది!’’ పసిపిల్లాడికి గ్రైప్ వాటర్ అయిపోతే కంగారుగా కేక వేసినట్లు- ‘‘మళ్లీ దుకాణం కట్టేస్తాడు సందుమొగ సేఠ్’’- అంటూ మొగుణ్ని కంగారు పెట్టేస్తుంది ఓ ఇల్లాలు.
‘‘అందుకే ఆన్‌లైన్‌లో కొట్టడం నేర్చుకో. నీకు మొబైల్ వుందా?’’ అంటాడు భర్తగారు. ‘‘దోమలమందు కోసం ఆన్‌లైనా? ఆన్ ద వే తెచ్చేసుకోవాలిగానీ. నేనే ఆగుదును కానీ, అక్కడ ముక్కేదిరా? అంటే యిలా త్రిప్పి అలా చూపించినట్లు కిలోమీటరున్నర దూరం తిరగాలి. అంచేత నాన్నాజీ ఆటో వచ్చేస్తుంది అని ఇంటికి దూసుకొచ్చేశానంటుంది భార్యామణి.
మనం సన్‌డే షాపింగ్ పెట్టుకున్నాం. ఏ రెస్టారెంట్‌లోకి పోవాలన్నా, లేదా ఏదేనా ‘బొమ్మ’చూద్దామన్నా- ఓ వారం రోజుల సేలరీ క్షవరమేగా? అందుకని ఎంచక్కా వీకెండ్‌కి ‘మెగామాల్’కి చెక్కేస్తున్నాం’’ - అంటున్న యిల్లాల్ని- గారడీ చేసేవాడు ఏదో ట్రిక్కు చేసేముందు చూసినట్లుగా చూశాడు- డాళింగ్ వైఫ్‌ని- స్మార్ట్ హజ్బెండు. (ఇండియా షైనింగ్)
‘డోంట్‌వర్రీ, ఇకమీదట మన పవిత్ర భారతదేశంలో రాత్రుళ్లల్లో దేవాలయములు మాత్రమే మూయబడును. ఇరవై నాలుగుబై సెవెన్ తెల్సుగా? అలాగ ఏటికి ఏడాదీ- లీపు సంవత్సరం అయితే 366 రోజులూ దుకాణములు - అవి సూపర్ టాపర్ ర్యాంకర్, మోసం, దగాలాంటి రకరకాల ఏ టైపు షాపులయినా వీధి చివర (నుక్కడ్ షాపులు) బడ్డీ దుకాణములయినా తెరచియే యుండుటకు- గవర్నమెంట్ గంటకొట్టిమరీ లైన్ క్లియర్ యిచ్చేసిందహో!....
సినిమాలు, రెస్టారెంట్లు, షాపులు వగైరా తిండి- మరియు నాన్ తిండి అమ్మే ఎయిర్ కండిషన్డ్ రంగు దీపాల అద్దాల షాపులన్నీ ‘దీపాలార్పడం’ చెయ్యవు. బేరాలు చూసుకోడమే పని. కేంద్ర ప్రభుత్వం 2015 మాడల్ షాపింగ్ ఏక్ట్‌కి ‘నిశానీ’ పెట్టేసింది! ‘ఓపిక’- అంతే, పగలూ, రాత్రీ ఏకం చేస్తూ వ్యాపారం చేసుకో- టాక్సులు కట్టుకో- మామూళ్లు పంచుకో. నో ‘‘ఆస్కర్’’- నో ‘‘టెల్లర్’’. అందరూ ‘రిటైల్డ్’యజమానులే! కేవలం బార్‌లు, డ్యాన్సు క్లబ్బులు మాత్రమే యింతకాలం రాత్రి సుఖాల్ని పంచిబెడుతున్నాయి. ఇకమీదట రుూ విచక్షణ చెల్లదు. అందరికీ రేరుూ, పగలూ అమ్ముకొనే, లాభాలు క్రుమ్ముకునే స్వేచ్ఛ వుంటుంది’అన్నది కేంద్ర ఉత్తర్వులోని సారాంశం అదీ...
ఈ ‘చట్టాల చట్రా’నికి పార్లమెంటు ముద్ర అక్కరలేదు. రాష్ట్రాల గవర్నమెంట్లు- కావల్సిన మార్పులుచేర్పులుతో దుకాణాల మీద రాబడి పెంచుకోవచ్చును అన్న స్వేచ్ఛకూడా కలదు...
ప్రధానమంత్రి మోదీ మహాశయుడు చాలాసార్లు బాధపడ్డాడు.
‘‘కోట్ల పెట్టుబడితో - అది కొంటే యిది ‘ఫ్రీ’- ‘‘ఇది తింటే అది ‘‘కొసరు’’అంటూ దగద్ధగాయమానంగా- జేగీయమానంగా- మైళ్లకొద్దీ దూరం సాగే షాపులెట్టి- అందులో రంగురంగుల జీన్స్, ఫ్రాక్స్ అమ్ముతూ గేటుదగ్గర వొళ్లంతా తడిమేసి, లోపలికి రానిచ్చి, జనాల్ని ఆకర్షించి సరుకులను, నిత్యకార్నివాల్- నిరంతర ఎగ్జిబిషన్ లాగా అమ్ముకుంటున్న ‘మాల్స్’వాళ్లు ‘‘మాలామాల్’’అయిపోడం ఏమిటీ? మగడూ, పెళ్లాం- తల్లీకూతురూ, నాన్నా అబ్బారుూ- యిలాగే అంతా కుటుంబ సభ్యులు సరుకుల కొట్లు నడుపుకుంటూ బేరాలు లేక, సుఖం లేక, సరదా లేక అల్లాడిపోడం ఏంటీ? అందరికీ ఒకటే ‘‘రూల్’’- ఇండియా ఓపెన్ కంట్రీ. యుగయుగాలుగా స్వాగత ద్వారాలు అందరికీ తెరిచి వుంచిన ఈ దేశంలో- చిన్న పచారీ కొట్టువాడు- సందు మొగన బడ్డీకొట్టువాడు ‘‘సమయానికి’’కట్టుబడి వుండాలా? అక్కరలేదుట- అది, మోదీ ఉవాచ!
దేశంలో కోటి నలభై లైసెన్స్‌డ్ షాప్స్‌న్నాయి. నాలుగు కోట్ల మందికి యివి బ్రతుకుతెరువు కల్పిస్తూ వున్నాయి. నిజానికి బడాబడా ఎస్క్‌లేటర్స్ వున్న ‘షాపింగ్ షో’ లొచ్చాకా చిన్నాచితకా పచారీ కొట్టువాళ్లు ‘మటాష్’ అయిపోతారనుకున్నారు గానీ అవలేదు. ఎంత చెట్టుకంత గాలి అన్నట్లు వుంటుంది వాళ్ల బిజినెస్సు.
కుటుంబాలకు ఫ్రెండు- కుటుంబ యజమానికి అప్పుయిచ్చువాడు- చూడగానే పల్కరించువాడు అయిన పచారీ షాప్ బాసు- లిమిటెడ్ ఏరియాలో తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. ఆమాటకొస్తే బడామాల్స్ వాళ్లే ఎన్ని టక్కులు, ట్రిక్కులూ చేసినా తెల్ల ఏనుగు మేత లాంటి ఖర్చులు భరించలేక- ‘‘మీరు-మీ మొబైల్’’ నొక్కుడు. ‘మేం మరుక్షణం మీ యింటి కాలింగ్ బెల్ నొక్కుతాం. కావల్సిన సరుకులు ఇంగ్లీషులో తెచ్చి చేరవేస్తాం. సలాంకొట్టిమరీ పైసలందుకుంటాం’’- అంటూ, యించుమించు దేశం మొత్తంమీద మూడు కోట్ల మందిని- ‘యింటి కాడ కూకో...కావల్సింది తెప్పించుకో’అన్న బద్ధకానికి అలవాటు చేశారు బడా వ్యాపారులు.
‘‘ఇలా ఇరవై నాలుగ్గంటలూ అత్తరు దీపాలెట్టేసి, జనాల్ని దోచేస్తే ఎట్లా సామీ?’’అంటే బోలెడు మందికి ఉద్యోగాలొస్తాయి. పగలు పదిమందికీ, రాత్రి ఆరుగురికీ స్పెషల్ వర్క్ దొరుకుతుంది. పైగా, ఆడా, మగా యిద్దరూ రాత్రీపగలూ ఒకేలాగ పనిచేయవచ్చును. శలవులు, పనిగంటలూ- అన్నీ ఫిక్స్‌చేస్తున్నది రుూ చట్టం.
పిజ్జా బిర్యానీల నుంచీ బజ్జీ, మిక్స్చర్‌ల దాకా- పట్టుచీర నుంచీ, లోదుస్తులు (వాటినేమిటంటారో)- వాటి దాకా- సకల వస్తు సముదాయం- అన్నిరకాల డ్రింకులు, అన్ని భాషల సినిమాలూ మనకి హమేషా హాజరుహో!’అంటున్న రుూ చట్టం- సోషలిజం చట్టం. అందర్నీ ‘బరాబర్’చేసే మంత్రం. పల్లెల్లో కూడా డే అండ్ నైట్ ఏకం అయిపోవాలి. అప్పుడు ఇండియా- దుకాణ శ్రమ జీవులకు స్వర్గం అయిపోతుంది-
రీటైల్ మార్కెట్స్ విల్ గెట్ బూస్టింగ్!