వీరాజీయం

సం‘కుల’ సమర భేరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే జమిలిగా లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న రాజకీయ పరిస్థితికీ, యిప్పుడు ఉభయ రాష్ట్రాలలో వున్న రాజకీయ స్థితిగతులకీ పోలికే లేదు. తెరాస నాయకుడు, తెలంగాణ సీఎం కేసీఆర్- ‘దీపం దేదీప్యమానంగా వెలుగుతున్నప్పుడే యిల్లు చక్కబెట్టుకుందామని’-ముందస్తు ఎన్నికల్ని జరిపించేసి- కోటలో పాగా వేసుక్కూర్చోడంతో- దేశం మొత్తం మీద ఎన్నికల తీరు ఒక రకంగాను, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో మరో రకంగాను తయారైంది.
ఈలోగా,‘వ్యక్తిగత ప్రతిష్టల’ను నాయకులు అత్యంత ముఖ్యమైనవిగా తీసుకోవడంతో ఎండలు ముదరకుండానే భయంకరమైన ‘వేడి’- తెలుగునాట అనారోగ్యకరంగా నాటుకుపోయింది. గతానుభవాన్నీ, ఫలితాలనీ బట్టి- అంచనాలు, పరిశీలనలు వెయ్యడం సాధ్యం కావడం లేదు. తెలంగాణకి యిప్పుడు ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం వల్ల ఆందోళన ఏమీ లేదు- ఎటొచ్చీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో తనకు వచ్చిన ‘‘పంతం,పట్టింపుల్నీ’’ గెల్చుకోవాలన్న తీవ్రమైన కోరిక తప్ప. కేసీఆర్‌కు ఏమీ బెంగలేదు. మోదీ ‘కాంగ్రెస్ రహిత దేశం’ అంటూనే వున్నాడు ఒక ప్రక్క గానీ, కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా దేశ ప్రజల సానుభూతినీ, అభిమానాన్నీ పెంచుకొనేలా తన ‘అనర్గళ వాగ్దాటి’ని మోదీ ప్రదర్శించడాన్ని-తటస్థ వర్గాలు జాగ్రత్తగా గమనించాయ్.
‘‘తెలంగాణాలో మోదీ కోరికని- కాంగ్రెస్ వాళ్లు- తమంతట తామే తీర్చేసుకున్నారు’’- అన్నాడో కోస్తా ఆంధ్రుడు. ‘‘పొలో’’మంటూ కాంగ్రెస్ ప్రతినిధులు- తెదేపాను వెక్కిరిస్తూ- టి.ఆర్.ఎస్. కండువాలు కప్పేసుకుంటున్నారు ఈమాటే చంద్రశేఖరరావుగారన్నాడు- ‘‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’- అని పాడుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. దేశం మొత్తం మీద స్థితివేరు, కొత్తగా ఏర్పడ్డ రుూ అన్నదమ్ముల వేరుకాపురాల సంగతి వేరు. కనుక మనం యిక్కడ పరిస్థితుల ప్రాబల్యాన్ని వేరే గణించుకోవాలి. తెల్లారేపాటికి హేమాహేమీలు పార్టీ ఫిరాయించేస్తున్నారు. ఎవరు తెదేపా పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నా దానికి యింతవరకు ఒకటే కారణం- పార్టీలో అసంతృప్తే. అనుకున్నది అందదు అన్న భయమేగానీ యిప్పుడు అది కూడా కాదు. ఫలానా నియోజకవర్గం సీటు నాకిస్తేనే నేను ‘జంప్’ చేస్తాను అంటున్నారు. నిన్నటిదాకా నోరు కడుక్కొని, ‘‘అన్‌ప్రింటబుల్’’ మాటలతో కత్తులు నూరుకున్న వాళ్లే- యివాళ మోదీ వ్యతిరేకులతో కలిసిపోతున్నారు.
డెబ్భై సంవత్సరాలయింది. దిక్కుమాలిన అతిపెద్ద ‘‘డెమాక్రసీ’’ అయిన మన దేశంలో- ఆయారాం, గయారామ్‌లు మాత్రం నశించలేదు. పైగా రుూ కప్పల తక్కెడ మేళం గాళ్లకి- ‘‘జంప్ జిలానీలు’’, ‘‘గో.పి.’’లు అంటూ ముద్దు పేర్లు కూడాను. నిన్నటిదాకా చేతులు అరిగేలా నీకు భజనలు చేస్తూ, కాళ్లిరిగేలా నీ చుట్టూ తిరుగుతున్న శాల్తీలనీ ఆశల మీద చన్నీళ్లు పోస్తూన్నారు.- కొత్తగా వచ్చిన వాడికి ‘‘అనకాపల్లి తీసుకో- నర్సరావుపేట తీసుకో’’ అంటూ సైకిలెక్కించేసుకుంటున్న తెదేపాను ఏమీ అనవేమయ్యా? అంటే- ‘‘చంద్రబాబుని వోడించడం కోసం మేం తెలంగాణ బాస్‌కి ‘జై’కొడతాం. ఇక్కడ కాంగ్రెస్‌ని భూస్థాపితం చేసినా సరే అక్కడ బాబుగారి పార్టీని కుదేలు చేస్తాం’’ అంటున్నారు జగన్ అనుయాయులు. ‘‘మరి వాళ్లనేమీ అనవేమయ్యా?’’ అంటే- ‘‘ఏందనేది? ఏమన్నా అది ఏం కాదు.. దున్నపోతుమీద వడగళ్లవానే’’- అంటున్నారు.
జగన్ మోహన్‌రెడ్డి స్థితి 2014లో వేరు. ఇవాళ పాదయాత్ర తరువాత అతని ‘పాపులారిటీ’ వేరు. సరే, ‘చంద్రబాబుగారికి అనుభవం చాలానే వున్నది’ అని చెబుతున్నారే గానీ అలాంటి అనుభవం గల నాయకుడు, ‘నేను కింగ్ మేకర్ని’ అని చెప్పుకుంటున్నవాడు డీలాపడుతున్నాడు. ఒకేసారి అంతమందితో వైరం పెట్టుకున్నాడు. అటు కేంద్రంలోనూ యిటు విశాల తెలుగుదేశం (ఐమీన్, ‘‘పార్టీ’’కాదు) లోనూ ఒకేసారి పోట్లాట తెచ్చుకుంటాడా? చెప్పండి. ఇది ‘వైరం’ కన్నా ఎక్కువ డోసు, స్పర్థ కన్నా ఎక్కువ మోతాదులో వున్న వ్యక్తిగత విభేదం.. ఇది యిరువురికీ నష్టదాయకమే.
ఇవాళ కేసీఆర్‌కీ- చంద్రబాబుకీ, మోదీకీ చంద్రబాబుకీ మధ్య కూడా బద్ధవైరం వుంది. ఒకవేళ ‘‘2014లో మాత్రం జగన్‌తో వైరం లేదా? ఎన్నికల రంగాన పోటీపడుతూ పరస్పరం నిప్పులు చెరుక్కుంటారే గానీ, లడ్డూలు పంచుకుంటారా?’’ అని ఎవరేనా అడుగుతారేమో కానీ, రుూ యిద్దరి మధ్యా కోపతాపాలు సిద్ధాంతపరం కాని స్థితికి ‘‘దిగజారాయి కదా?’’ అంటే- ఓ పెద్ద మనిషి అన్నాడు- ‘‘దిగజారాయని అనకూడదు. వాళ్లు బ్రహ్మాండమైన నాయకులు. ‘వైర వైషమ్యాలు’ ‘‘ఎగబ్రాకాయి’ అనాలి’’, అన్నాడు. అవ్వపేరే ముసలమ్మ మరి! జగన్ యివాళ పాదయాత్ర తర్వాత- ‘‘రాజన్న రాజ్యం కాదు జగనన్న రాజ్యమే తీసుకొస్తాడు’’- అంటున్న అభిమాన పరిశీలకులున్నారు. అది అట్లుండనిండు-
పై వారానికి గానీ వూడేవాళ్లు, చేరేవాళ్లు, పోయేవాళ్లు- తేలరు. జగన్ ‘టాక్టిక్సు’ ఓ స్టేజికి చేరాయి. పైగా యిప్పుడు ‘పీకే’ ఫ్యాక్టర్ ఒకటి అదనంగా వచ్చింది. ఇండియా దటీజ్ భారత్- ఎన్నికల వ్యయం చూస్తే- అది అమెరికా అధ్యక్షుని ఎన్నికల ఖర్చుకన్నా ఎక్కువ. యాభై వేల కోట్ల రూపాయలు. అనగా ఏడు బిలియన్ల డాలర్లు- రుూ ఎన్నికలకు ప్రజల బొక్కసం నుంచి ఖర్చవుతాయి. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్- అసెంబ్లీ స్థానానికైతే 28 లక్షల రూపాయలు, పార్లమెంటుకైతే 78 లక్షల రూపాయలు మాత్రమే ‘లిమిట్’ విధించారు గానీ, రుూ పైసలు ఏ అభ్యర్థికైనా- ‘‘మందు’కీ, విందుకీ, పోస్టర్లకీ అయినా సరిపోతాయా?... ప్చ్! దేశం మొత్తంమీద ఇరవై రెండు రాష్ట్రాలలో పోరాటం సాగుతుంది. ఎన్నికల రంగంలో ఎన్.డి.ఏ.; యు.పి.ఏ.లే కాదు- ‘థర్డ్ ఫ్రంట్’ ఒకటుంది. చివరి యుద్ధంలో ఎవరి కొమ్ము ఎవరు కాస్తారో? ఎవరి కొంగు ఎవరు పట్టుకుంటారో? కూడా చెప్పలేం.
‘‘నల్లధనమా? మోదీ ఐదేళ్ల రాజ్యం ఏలినాకా కూడా నల్లధనమా? అదెక్కడ వుందయ్యా?’’ అన్నాడు ఒక మిడిల్ క్లాస్ వోటరు (కొంచెం ఆశగా) ‘‘అవన్నీ కబుర్లు.. ఒట్టుతీసి గట్టున పెట్టు’’ - అందాకా అసలు వోట్లు మాయం చేశారో’’ అంటూ యిక్కడ గోల లిటిగేషన్ దశకి చేరుకుంది. దాని ప్రభావం ఎంత? ఆంధ్రా, తెలంగాణా ఎన్నికల తంతు అదంతా మరో రకం ప్రాబ్లెమ్. ఈసారి ‘సోషల్ మీడియా’, అంటూ ఒకటి వుందిగా- దాని గోల యింకా ఎక్కువయింది.. అది ‘ఏకు మేకు’లా మారింది. ఏది ఏమైనా భాజపా ‘గ్రాఫ్’ రుూ అయిదేళ్లల్లో పడిపోయిన వాస్తవాన్ని తతిమ్మా ప్రతిపక్షాలు ఎలా అంచనా వేసి, ఎదుర్కొని తమతమ వ్యూహాలు పన్నుకుంటాయో? ఏ విధంగా ఐక్యఘటనలు, ఘట్‌బంధన్‌లు నిభాయిస్తాయో? దాన్నిబట్టి వుంటుంది. సరైన స్థితి రూపుకట్టడానికి మరో పదిహేను రోజులు పట్టవచ్చు.
దేర్ విల్ బి ‘వార్’ మోర్ అండ్ ‘పీస్’లెస్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512