వాసిలి వాకిలి
కుడి ఎడమల చక్రవ్యూహాన్ని..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేను-
ప్రాణం + జీవం + ఆత్మ.
త్రిశక్తుల సంగమ నిమ్జనం.
త్రైవాహికా చైతన్య విస్ఫోటనం.
సంగమ విస్ఫోటన జీవన ప్రస్థానం.
ప్రాణ, జీవ శక్తులు భౌతిక జీవితాన్ని నిర్దేశిస్తుంటే ఆత్మశక్తి అధిభౌతిక జీవనాన్ని నియంత్రిస్తోంది. ఇక్కడ నియంత్రణ అంటే చైతన్యం అని. అంటే, ఆత్మశక్తిది అధిభౌతిక చైతన్యం అని.
ప్రాణ, జీవ శక్తుల సంగమ కేంద్రం కుండలిని... దీనే్న మానవ కుండలిని, భౌతిక కుండలిని అంటుంటాం. నా అక్షర దర్శనంలో ఈ మానవ కూడలిని ఐహిక కుండలిని.. ఈ దేహ ఐహిక చైతన్యమంతా శక్తి విస్ఫోటనమే. షట్చక్ర వ్యూహం లోనిదే ఈ చైతన్య విస్ఫోటనమంతా! షట్చక్రాలకు వేణుదండం, విస్ఫోటనానికి కుండలిని వేదికలు.మూలాధారం నుండి ఆజ్ఞ వరకు చక్ర బంధంలోను, నాడీ వాహినిలోను ఈ శక్తి ప్రభంజనాన్ని అనుభూతించగలం, అనుభవించగలం.
* * *
ప్రాణం చైతన్య వాహిని అయ్యేది పింగళ నాడి ద్వారా. మానస చైతన్యానికి వాహిక ఇడనాడి. గిక చైతన్యానికి వేదిక సషమ్న. ప్రాణ, మానస చైతన్యాలు ‘ఆజ్ఞ’ అధీనంలో ఉంటుంటే, గిక చైతన్యం ‘ప్రజ్ఞ’ అధీనంలో ఉంటంది.
ఆజ్ఞ వరకు అంటే షట్చక్ర శక్తి చాలనమంతా భౌతికానిదే అనిపిస్తుంటే సహస్రార ప్రజ్ఞ అధిభౌతికం అవుతోంది. ఇలా, మానవ కుండలినీ శక్తి చాలనమంతా షట్చక్ర విలసనంలోనే! ఆజ్ఞ వరకే!! మానవ కుండలినీ శక్తి వినియోగమంతా దేహ పరిధిలోనే.. భౌతికంగానే ఐహికంగానే. సహస్రార ప్రజ్ఞా వినిమయం గిక భామికలలో, అధిభౌతికంగా, పర సంయోగంగా. అవును, సహస్రారం ఇటు ఇహానికీ, అటు పరానికీ వారధి.
* * *
మానవ కుండలినికి కేంద్రమైన మూలాధారం నుండి ఆజ్ఞ వరకు ఒక్కో చక్రస్థానాన్ని కుడి, ఎడమలుగా దాటుకుంటూ ఇడ, పింగళ నాడుల చైతన్యం శక్తి విస్ఫోటన మవుతుంటుంది. మూలాధారం నుండి ప్రాణ శక్తి కుడివైపునకు ఎగసి స్వాధిష్ఠానం దాటుకుంటూ ఎడమ వైపునకు మళ్లుతుంది. ఎడమ నుండి మణిపూరకాన్ని దాటుకుంటూ కుడివైపునకు తిరుగుతుంది. కుడి నుండి అనాహతాన్ని చేరుకుని ఎడమవైపు ప్రయాణిస్తుంది. ఎడమ నుండి విశుద్ధిని క్రాస్ చేస్తూ కుడివైపునకు మరలి ఆజ్ఞను చేరుకుంటుంది - ప్రాణశక్తి చాలనంగా.
ప్రాణశక్తి స్వాధిష్ఠాన ప్రవేశంతో జన్యు సంబంధితాలు - కిడ్నీ తదితర వ్యవస్థలలోను, మణిపూరక ప్రవేశంతో జీర్ణకోశ వ్యవస్థలోను, అనాహత ప్రవేశంతో శ్వాసకోశ హృదయ వ్యవస్థలలోను, విశుద్ధి ప్రవేశంతో ముఖ మండలంలోని చెవులు, కళ్లు, ముక్కు, గొంతు వ్యవస్థలలోను, ఆజ్ఞా ప్రవేశంతో మెదడు తత్సంబంధిత వ్యవస్థలలోను మార్పులు తీసుకు రావటమే కాక వాటి అవస్థలను సైతం వ్యవస్థీకరిస్తుంటుంది.. పనితీరును బలపరుస్తుంటుంది.
* * *
‘నేను’ దైనందిన కర్మాచరణకు స్వతస్సిద్ధంగా ఉన్న ప్రాణశక్తి సరిపోతుంటుంది. అయితే, ప్రాణాయామ సాధనతో అందివచ్చే మరికొంత ప్రాణశక్తి వల్ల ‘నేను’లోని ఇంద్రియ వ్యవస్థలన్నీ సక్రమం అవుతూ మరింత ఆరోగ్యకర వ్యవస్థను సంతరించుకుంటాయి. గిక సాధన తపస్సగా పరిణమించినపుడు ఈ ప్రాణశక్తి మరింత అధికమై, ఇతరుల ‘బాగు’ కోసం ఉపకరిస్తుంటుంది. యోగా ట్రీట్‌మెంట్స్ జరిగేది ఈ అధిక ప్రాణశక్తి సంప్రాప్తితోనే.
అంటే, ప్రాణాయామ సాధన వల్ల లభించే ప్రాణ శక్తి మన మెరుగైన ఆరోగ్యానికి ఉపకరిస్తుంటే, నిరంతర ధ్యాన యోగ సాధనతో అందివచ్చే ప్లెంటీ ఆఫ్ ప్రాణా పదుగురికి ఉపకరిస్తూ, పది మంది ఆరోగ్య వ్యవస్థలు మెరుగవటానికి ట్రీట్‌మెంట్ రూపేణా ఉపయుక్తమవుతోంది.
ప్లెంటీ ఆఫ్ ప్రాణా సప్లై వల్ల ఇతరుల విషయంలో యోగ చికిత్స సాధ్యమవుతుంటే ‘స్వ’ విషయంలో మెదడు, మేథ పనితీరుకు మరింతగా దోహదపడుతోంది. ప్రాణా సప్లై ఎంత అధికంగా ఉంటే అంతలా మన మేధ శక్తివంతమవుతుంటుంది. ఆలోచనల ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది.
కేవలం ప్రాణాయామ సాధనతో సంపూర్ణ ప్రాణశక్తి అందుబాటులోకి రాదు. ప్రాణాయామం వల్ల నిత్య ప్రాణక్రియ కంటే కాస్తంత అధిక ప్రాణ శక్తి చేకూరుతుందంతే.. మెరుగైన ఆరోగ్య వ్యవస్థకు ఉపకరిస్తుందంత వరకే. అయితే తీవ్ర యోగ ధ్యాన సాధన వల్ల పూర్ణ ప్రాణశక్తి అందుబాటులోకి వచ్చి, ఆ పూర్ణ ప్రాణ ప్రజ్ఞతో పదుగురి ‘మేలు’కు అవకాశమేర్పడుతుంది.. ప్రాణ చికిత్స సాధ్యమవుతుంది. ఈ ప్రాణ ప్రజ్ఞకు సహస్రారం కేంద్రమవుతుంది. ఒక విధంగా ఆజ్ఞకు సహస్రారానికి దాపుల పిట్యూటరీ సమీపాన మహాకుండలిని అధిభౌతిక కుండలినిగా పరిణమిస్తుంది. ఈ ఇహ పర కుండలినిని చేరేదే విశ్వప్రాణ శక్తి.
* * *
మూలాధారం నుండి ఆజ్ఞ వరకు విస్ఫోటనమైన కుండలినీ ప్రాణ శక్తి సహస్రార కేంద్రమైన మహాకుండలినిని చేరేటప్పటికి అది ‘సూక్ష్మశక్తి’ అవుతుంది. శక్తి విస్ఫోటనం శక్తి చైతన్యమవుతుంది... ఇక్కడి ప్రాణ చైతన్యం సూక్ష్మ చైతన్యమే... ఈ పర ప్రజ్ఞతో భౌతిక దేహం నుండి సూక్ష్మ దేహం పర సీమలు ప్రయాణం ప్రారంభిస్తుంది.
ఈ సహస్రార ప్రాణశక్తి చాలనానికి కావలసింది ఆజ్ఞ కాదు. ప్రజ్ఞ. సంకల్ప సాధనతోనే, ఈ ప్రజ్ఞ తేజరిల్లుతుంది.. ఈ మహాకుండలినిది కేవల ప్రాణశక్తి కాదు.. ప్రాణ ప్రజ్ఞ. ఈ ప్రాణ ప్రజ్ఞ విశ్వ కుండలినీ ప్లెంటీ ఆఫ్ ప్రాణాకు సూక్ష్మరూపం. విశ్వ ప్రాణశక్తి సూక్ష్మాంశనే ఈ మహాకుండలిని ప్రాణ ప్రజ్ఞ. ఇక్కడి గిక సాధనతో ప్రాణ ప్రజ్ఞకు సంబంధించిన సంకల్పవే ప్రాణ స్పృహ అవుతుంది.
* * *
సంకల్ప స్పృహతో మేధను చైతన్యపరచగలం.
సంకల్ప స్పృహను ప్రాణ ప్రజ్ఞకు భూమిక చేయగలం.
అందుకే, యోగ ధ్యాన సంకల్పంతో పాజిటివ్ వైబ్రేషన్స్ చోటు చేసుకోవాలే తప్ప నెగెటివ్ వైబ్రేషన్స్ చోటు చేసుకోకూడదు. ధ్యాన యోగ సాధనలో మన స్పందనలు పాజిటివ్ అయితే విశ్వ ప్రతిస్పందనలు పాజిటివ్ అవుతాయి. నెగెటివ్‌గా స్పందిస్తే విశ్వం సైతం నెగెటివ్‌గానే ప్రతిస్పందిస్తుంది. ప్రాణాయామంలో భౌతిక ఉచ్ఛ్వాస నిశ్వాసలు చైతన్య స్పృహలో సాగితే, యోగ సాధనతో సంకల్పాలే చైతన్య స్పృహలై ప్రాణ ప్రజ్ఞకు నేపథ్యాలవుతుంటాయి. కాబట్టి దేహ చైతన్యానికి ప్రాణ శక్తి, మానసిక చైతన్యానికి ధ్యాన శక్తి మూలమవుతున్నాయి.
* * *
ప్రాణాయామ సాధనతో మానవ కుండలినీ శక్తికి పరాకాష్ఠ కుంభక, శాంభవిలు. కుంభకంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను స్తంభింపచేసి ప్రాణ శక్తిని వొడిసి పట్టుకోవటం జరుగుతుంది. శాంభవిలో రెండు కనుబొమల మధ్య ఆజ్ఞలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఐహిక కుండలినీ ప్రస్థానంలో కుంభక శాంభవిల ఫలితం కేవలం భౌతికం వరకే. దేహం వరకే.
దైహిక నేను అనారోగ్య వ్యవస్థను పారద్రోలేది ఆముష్మిక కుండలినిలోని సూక్ష్మ ప్రాణ ప్రజ్ఞనే. ఇక్కడి సూక్ష్మ ప్రాణ ప్రజ్ఞనే విశ్వప్రాణ ప్రజ్ఞతో లింక్ అవుతుంది. ఈ లింక్‌తో దైహికం దైవికంగా పరిణమిస్తుంది. ఆ దైవిక ప్రజ్ఞ అంతా విశ్వలోగిలినే.
ప్రజ్ఞాన్విత పరిణామంలో ఇలా ‘నేను’ దైహికమూ! దైవికమూ!!