రాష్ట్రీయం

బ్లాక్ లిస్టులో అమెరికా యూనివర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆందోళన
అమెరికా వెళ్లేందుకు అనుమతించని ఇమిగ్రేషన్ అధికారులు

హైదరాబాద్, డిసెంబర్ 21: జనవరి 4వ, తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలోని రెండు యూనివర్సిటీలను అక్కడి ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో అమెరికా వెళ్లాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 48మంది విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలు బ్లాక్ లిస్టులోకి ఎక్కాయి. సరైన కారణాలు చూపకుండా అక్కడి నుంచి యుఎస్‌ఎ ప్రభుత్వం ఇప్పటికే కొంత మంది విద్యార్థులను వెనక్కి పంపించిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌కు చెందిన విద్యార్థులను ఇక్కడి యూనివర్సిటీలకు వచ్చేందుకు అనుమతించొద్దంటూ ఇమిగ్రేషన్ అధికారులకు, ట్రావెల్ ఏజెంట్లకు అమెరికా ప్రభుత్వం ఆదేశంచడంతో సోమవారం అమెరికా వెళ్లాల్సిన విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో రేపు, ఎల్లుండి అమెరికా వెళ్లాల్సిన సుమారు 20మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. జనవరి 4వ, తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయంటూ ఇమిగ్రేషన్ అధికారులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో వారి టిక్కెట్లను వాపసు తీసుకోవాల్సిందిగా ట్రావెల్ ఏజెంట్లను అధికారులు ఆదేశించారు. విద్యార్థులెవరినీ అమెరికాకు రానీయవద్దంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.