తెలంగాణ

వర్సిటీల సవరణ బిల్లుకు టి.అసెంబ్లీ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. సభ ప్రారంభమైన వెంటనే విద్యామంత్రి కడియం శ్రీహరి బిల్లు గురించి మాట్లాడుతూ, వర్సిటీలను ప్రక్షాళన చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. వర్సిటీల్లో గవర్నర్ అధికారాలు తగ్గించరాదని, రాజకీయాల జోక్యం ఉండరాదని బిజెపి, టిడిపి సభ్యులు సూచించారు. గవర్నర్ పాత్రను తగ్గించాలన్న యోచన తమకు లేదని, వైస్ చాన్సలర్లు నిజాయితీగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సిఎం కెసిఆర్ అన్నారు. రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించి చట్ట సవరణలను కూడా సభ ఆమోదించింది.