వారం వారం గోచారం

వారం వారం గోచారం -- 29-7-2018 నుంచి 4-8-2018 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం. శ్రమతో గుర్తింపు. అనుకోని సమస్యలు. సోమవారం ప్రయోజనాలకు సౌకర్యాల కోసం వెచ్చిస్తారు. అనుకోని ప్రయాణాలు. సౌఖ్యం కోసం ప్రయత్నాదులుంటాయి. మంగళవారం భాగస్వామ్యాల వల్ల ప్రయోజనాలుంటాయి. పెద్దలతో అనుబంధాలు విస్తరిస్తాయి. ఉన్నత విద్య లక్ష్యాలను చేరుకుంటారు. బుధవారం ధార్మికమైన దానాలకు అవకాశం. ఖర్చులు పెట్టుబడులున్నా సంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం అధికం. నూతన కార్యక్రమాలుంటాయి. గురువారం కాలం, ధనం వినియోగంలో కొంత అసంతృప్తి. దానధర్మాల వల్ల పుణ్యబలం చేకూరే అవకాశం. ఇతరుల సహకారంతో సౌఖ్యం పెంచుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం ఉన్నత వ్యవహారాలుంటాయి. విద్యాత్మక, పరిశోధనాత్మకాంశాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. సోమవారం కమ్యూనికేషన్స్ వైపు దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సమాచారం ద్వారా కొంత ఒత్తిడి. మంగళవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. అనారోగ్య భావనలను అధిగమించాలి. బుధవారం పోటీల వల్ల ప్రయోజనాలున్నా సంతృప్తి ఉండదు. అనుకోని ఇబ్బందులకు అవకాశం ఉంది. లాభాలు కోల్పోయే అవకాశం. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళికలో లోపాలకు అవకాశం. శుక్రవారం సంతాన వర్గంతో సంప్రదింపులు. కుటుంబం, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకునే సూచనలుంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. చిన్నచిన్న ప్రమాదాలకు, సమస్యలకు అవకాశం. నిర్ణయాదుల వాయిదా మంచిది. సోమవారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో కొంత జాగ్రత్త. ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారించాలి. మంగళవారం అభీష్టసిద్ధి. ప్రణాళికలు పరిపూర్ణమవుతాయి. దైవిక, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. సామాజిక గౌరవం. భాగస్వామ్యాల్లో సంతోషం. బుధవారం పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. అనుబంధాల వల్ల గౌరవం కోల్పోవచ్చు. గురువారం అన్ని పనుల్లో ఆలస్యం. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట విలువ పెంచుకునే ప్రయత్నం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం భాగస్వామ్యాల్లో తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగాదుల వల్ల పరిచయాలు పెరిగే అవకాశం. అనుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. సోమవారం తమ నిర్ణయాదులు తమకే ఇబ్బంది పెట్టవచ్చు. వ్యర్థమైన ప్రణాళికలు. అనుకోని సమస్యలు. కాలం కోల్పోయే అవకాశం. మంగళవారం సౌకర్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త. అసంతృప్తి. బుధవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. వ్యతిరేకతలున్నా లక్ష్యాలను సాధించే ప్రయత్నం. అనుకోని ఇబ్బందులు. గురువారం పెద్దలతో వ్యతిరేకతలు తగ్గించుకోవాలి. సంప్రదింపులపై దృష్టి. సమాచారం ఇబ్బంది పెట్టే సూచనలు. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం పోటీలు వత్తిడులు చికాకులుంటాయి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. లక్ష్యాలను సాధించడంలో ఒత్తిడులు. గుర్తింపు కోసం ప్రయత్నం. సౌకర్యాల అనుభవంలో ఇబ్బందులు. సోమవారం పరిచయాలు భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవడం వల్ల అనుబంధాల్లో ఇబ్బందులు. మంగళవారం సంప్రదింపుల వల్ల మేలు కలుగుతుంది. కొన్ని లాభనష్టాలు ప్రభావితం చేస్తాయి. సమాచారం ఒకటి సంతృప్తినిస్తుంది. బుధవారం అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గురువారం అనారోగ్య భావనలు పెరిగే అవకాశం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం ఆలోచనలలో ఒత్తిడులు. తొందరపాటు నిర్ణయాలు. అనుకోని ఇబ్బందులు. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. సోమవారం అధిక లాభాలపై దృష్టి. ప్రయోజనాలున్నా సంతృప్తి ఉండకపోవచ్చు. పెద్దలతో అనుకూలత. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడుల వల్ల గుర్తింపు తగ్గవచ్చు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. రుణాదులు తీరే అవకాశం. బుధవారం సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో ఇబ్బందుల వల్ల భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. పరిచయాలు అనుబంధాల్లో ఇబ్బందులు. గురువారం గృహ వాహనాదుల్లో ఒత్తిడులుంటాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలపై దృష్టి. లాభాలు కొన్ని సంతృప్తినిస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం వాహనాది సౌకర్యాల విషయంలో తొందరపాటు కూడదు. సౌఖ్య లోపాలకు అవకాశం. ఆహార విహారాల్లో ఇబ్బందులు, శ్రమ తప్పకపోవచ్చు. సోమవారం వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఉన్నా గుర్తింపు. అనేక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. సామాజిక గౌరవం. మంగళవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ధార్మిక వ్యవహరాల్లో కాలం గడిపే అవకాశం. బాధ్యతల నిర్వహణలో సంతృప్తి. బుధవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. సొంత నిర్ణయాలు ఇబ్బంది పెట్టవచ్చు. సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవక సహకారం. గురువారం సమాచారం ఇబ్బంది పెట్టవచ్చు. కమ్యూనికేషన్స్ వల్ల సమస్యలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. సమాచార లోపం. సంప్రదింపుల్లో ఇబ్బందులకు అవకాశం. సోమవారం దూర ప్రయాణాదులపై దృష్టి. కార్యనిర్వహణ ఉన్నా అసంతృప్తి ఉంటుంది. మంగళవారం ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. ధార్మిక వ్యవహారాలు. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. ఆహార విహారాలుంటాయి. బుధవారం ప్రణాళికలకు అనుకూలం. కుటుంబంలోని ఒత్తిడులు కొంత ప్రభావితం చేస్తాయి. మాటవల్ల సమస్యలకు అవకాశం. సంతానానుకూలత. గురువారం నిల్వధనం పెంచుకునేందుకు ప్రణాళికలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, పరిశోధనలకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం పెంచుకుంటారు. కుటుంబంలో కొంత చికాకు. సోమవారం అనుకోని ఒత్తిడులు. సమస్యలు. అనవసర విషయాలపై దృష్టి. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలు. మంగళవారం పెద్దల అనుకూలత. లాభాలు ప్రభావితం చేస్తాయి. దగ్గరి ప్రయాణాలు. ఒక సమాచారం సంతృప్తినిస్తుంది. బుధవారం శ్రమతో సౌకర్యాదులుంటాయి. నిర్ణయాదుల్లో జాగ్రత్త వహించాలి. పనుల్లో ఆలస్యం. బద్ధకం తొలగించుకోవాలి. గురువారం ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. వ్యాపార వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. శుక్రవారం గృహ వాహనాదుల్లో కొంత ఇబ్బందులుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం నిర్ణయాల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. ప్రవర్తన, వ్యవహార శైలిని జాగ్రత్త పరచుకోవాలి. కార్యనిర్వహణపై దృష్టి కేంద్రీకరించాలి. సోమవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాలు అనుబంధాల వల్ల కుటుంబ సంబంధాల్లో ఇబ్బందులు. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల వల్ల ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. మాట తీరులో అనుకూలత. బుధవారం అధికారిక వ్యవహారాల్లో శ్రమ. సంప్రదింపులుంటాయి. ఖర్చులు పెట్టుబడులు. పరామర్శలకు అవకాశం. గురువారం ఆహార విహారాల్లో జాగ్రత్త. భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో తొందరపాటు కూడదు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. సౌఖ్య లోపాలకు అవకాశం. సోమవారం వ్యతిరేకతలుంటాయి. ఆత్మవిశ్వాస లోపాలు. పోటీలు ఒత్తిడులు చికాకులు ప్రభావితం చేస్తాయి. మంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, ఉద్యోగ వ్యవహారాలుంటాయి. కీర్తిప్రతిష్ఠలు. గుర్తింపు లభిస్తుంది. బుధవారం కుటుంబంలో అనుకూలత. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొన్ని లాభాలున్నా ఆర్థిక నిల్వలు అంతగా పెరగకపోవచ్చు. గురువారం మాటతీరులో సంతృప్తి. ప్రయోజనాలు ఆశించినంతగా లభించవు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శుక్రవారం పోటీలు ఒత్తిడులను అధిగమించాలి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. ఆశింపు అధికం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లక్ష్యాలను సాధించే మార్గంలో ఒత్తిడులుంటాయి. సోమవారం ఆలోచనల్లో ఒత్తిడి. ఊహలతోపాటు అపోహలూ ఉంటాయి. సంతానవర్గం కోసం ఖర్చులు తప్పవు. ప్లానింగ్‌లో జాగ్రత్త. మంగళవారం గౌరవ లోపాలకు అవకాశం. ఖర్చులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. దానధర్మాల వల్ల అనుకూలత. బుధవారం శారీరక ఒత్తిడులు. ఆత్మవిశ్వాస లోపం. వృత్తి ఉద్యోగాదుల్లో బాధ్యతలు అధికం. శ్రమ తప్పదు. గురువారం అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. సామాజిక గౌరవం శ్రమతో సాధ్యం. మనోభీష్టాలు కొన్ని నెరవేరుతాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ