వారం వారం గోచారం

వారం వారం గోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సౌకర్యాలపై దృష్టి. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. ఆహార విహారాలలో అనుకూలత. బుధ గురువారాల్లో నూతనమైన ఆలోచనలు. సృజనాత్మకత. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. మనోభీష్టాలకు అనుకూలం. కొత్త పనులకు రూపకల్పన. సంతాన వర్గంతో అనుకూలత. లాభాదులపై దృష్టి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. శారీరకమైన ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం. శుక్ర శనివారాల్లో వ్యతిరేకతలు అధికం. పోటీలు చికాకు పెట్టవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపార, ఆధ్యాత్మిక ప్రయాణాలు. అనవసర ఖర్చులు. శత్రు భావనలు పెంచుకోవద్దు. పోటీలు పెట్టుకోవద్దు. ఆర్థిక సమస్యలుంటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సంప్రదింపులకు అనుకూలం. ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. సహకారం లభిస్తుంది. సోదర వ్యవహారాల్లో జాగ్రత్త. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలుంటాయి. బుధ గురువారాల్లో ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యనిర్వహణ. గృహ వాహనాది వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి. అనవసరమైన ఖర్చులుంటాయి. శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. లాభాలపై దృష్టి. పెద్దల వల్ల అనుకూలత. వ్యాపార ప్రయోజనాలుంటాయి. కొన్ని మంచి సంఘటనలు జరిగే అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమ మంగళవారాల్లో కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. మాటల వల్ల ఇబ్బందులకు అవకాశం. నిల్వధనం తగ్గిపోయే అవకాశం. అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. శ్రమలేని ధన సంపాదనకై ప్రయత్నం. తెలియని ఒత్తిడి, భయాదులుంటాయి. బుధ గురువారాల్లో ప్రభుత్వ సహకారం కోసం ప్రయత్నం. అధికారులతో సంప్రదింపులుంటాయి. సోదర వర్గంతో కొంత అనుకూలత. దూర ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుక్ర శనివారాల్లో సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. గృహ వాహనాది వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆహార విహారాల కోసం ఖర్చులుంటాయి. సామాజిక హోదా పెంచుకుంటారు. స్ఫురణ శక్తి పెరుగుతుంది. విహార యాత్రలకు అవకాశం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ మంగళ వారాల్లో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. కార్యనిర్వహణలో అనుకూలత. నిర్ణయాదులు సంతృప్తినిస్తా. శ్రమ ఉన్నా ఫలితాలలో అనుకూలత. శారీరక సంతృప్తి అధికం. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. బుధ గురువారాల్లో కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. నిల్వధనంపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. మాటల్లో కొంత అధికారిక ధోరణి. అనుకోని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనారోగ్య భావనలుంటాయి. కొంత జాగ్రత్త అవసరం. శుక్ర శనివారాల్లో సహకార లోపాలకు అవకాశం. వ్యాపారాదుల సంప్రదింపుల్లో సమస్యలుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. యాత్రలపై దృష్టి సారించే అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమ మంగళవారాల్లో విహారాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణావకాశాలు. పెట్టుబడులకు అనుకూలత. దానధర్మాలవల్ల మేలు. ఆహారాదుల కోసం వెచ్చిస్తారు. వ్యతిరేకతలు అధికం. పోటీలు తట్టుకుని మెలగాలి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మంచి పనుల కోసం కాలం ధనం ఖర్చు అయ్యే సూచనలు. బుధ గురువారాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు. వ్యవహారాల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యనిర్వహణలో సంతృప్తి. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడులుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శుక్ర శనివారాల్లో కుటుంబంలో ఒత్తిడులుంటాయి. ఆర్థిక నిల్వలపై దృష్టి. మాటలో చమత్కారం పెరుగుతుంది. శ్రమలేని సంపాదనలపై దృష్టి. అనుకోని సంఘటనలు. వ్యాపారాదుల్లో కొంత ఇబ్బందులకు అవకాశం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ మంగళవారాల్లో లాభాలపై దృష్టి ఆశించిన లాభాలు అందక సమస్యలు. తొందరపాటు కూడదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గ సంతృప్తి. క్రియేటివిటీ పెంచుకుంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. బుధ గురువారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. అధికారిక వ్యవహారాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. రోగాలపై విజయం సాధిస్తారు. కొత్త పనులపై దృష్టి. శుక్ర శనివారాల్లో ఆనందంగా గడిపే ప్రయత్నం. శ్రమ ఉన్నా సంతోషం పెరుగుతుంది. నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు అనుబంధాల్లో ఆశించిన సంతృప్తి లభించకపోవచ్చు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ మంగళవారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారులతో ఒత్తిడులుంటాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సామాజిక గౌరవాన్ని పెంచుకునే యత్నం. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాదుల వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు సరిగా రాక ఎదురుచూస్తారు. కార్యనిర్వహణలో ఆశించిన లాభాలు అందకపోవచ్చు. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో అనుకూలత. శుక్ర శనివారాల్లో మంచి పనుల కోసం, సౌఖ్యం కోసం ఖర్చు చేస్తారు. వ్యాపారాల కోసం పెట్టుబడులు, ప్రయాణాలు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు పెరిగే అవకాశం. పోటీలు ఒత్తిడులున్నా అధిగమించాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ మంగళవారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. అన్ని పనుల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. సంతృప్తి అధికం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సేవక జన సహకారం ఆశించినంతగా దొరకకపోవచ్చు. సోదర వర్గంతో చికాకులకు అవకాశం. బుధ గురువారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణలో సంతృప్తి. పెద్దల అనుకూలత. శ్రమతో గౌరవం లభిస్తుంది. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. ఇల్లు, వాహనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. శుక్ర శనివారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అయినా పెద్దల అనుకూలత లభిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో ఊహించని సంఘటనలు. అనుకోని ప్రయోజనాలు. శ్రమలేని ప్రయోజనంపై దృష్టి. కొంత అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాలు వాయిదా వేయాలి. కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. బుధ గురువారాల్లో లక్ష్యాలను సాధించే యత్నం. అన్ని పనుల్లో శుభ పరిణామాలు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సంతృప్తిగా గడుపుతారు. పనుల్లో పురోగతి. సంప్రదింపుల్లో జాగ్రత్త. ప్రయాణాలుంటాయి. సహకార లోపాలకు అవకాశం అధికం. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలు. అధికారులతో, వ్యాపారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ మంగళవారాల్లో భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. పరిచయాలు, అనుబంధాల్లో తొందరపాటు కూడదు. జాగ్రత్తగా గమనించి అడుగు ముందుకు వేయాలి. సంతోషం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాలు నూతనమైనవి తీసుకోవచ్చు. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. నిర్ణయాదులను వాయిదా వేయాలి. తొందరపాటు కూడదు. ఆకస్మిక సమస్యలు. అధికారుల వల్ల ఇబ్బందులు. కుటుంబంలో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. వ్యవహారాల్లో అనుకూలత. నిల్వధనం పెంచుకుంటారు. శుక్ర శనివారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న పనులు దైవానుకూలతతో పూర్తవుతాయి. సంతృప్తి కలుగుతుంది. పెద్దలతో సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకారం ఆశించిన విధంగా లభించకపోవచ్చు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో వ్యతిరేకతలు అధికవౌతాయి. పోటీ రంగంలో జాగ్రత్త వహించాలి. రుణాలు పెరిగే సూచనలు. రోగ నిరోధక శక్తి తగ్గవచ్చు. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. సంతృప్తి కోసం వెచ్చిస్తారు. దానధర్మాల వల్ల ఇంకా అనుకూలత. ప్రయాణావకాశాలు. బుధ గురువారాల్లో పరిచయాలు ఇబ్బంది పెట్టే అవకాశం. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. అధికారులతో కొంత జాగ్రత్త. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణ. సంప్రదింపులు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో కొంత జాగ్రత్త. అనుకోని ఇబ్బందులున్నా ప్రయోజనాలుంటాయి. ఊహించని సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ మంగళ వారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లాభాలు ఆశించినంతగా దొరకకపోవచ్చు. ప్రయోజనాల విషయంలో రాజీ ధోరణి తప్పదు. బుధ గురువారాల్లో వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. కార్యనిర్వహణలో అనుకూలత. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. వ్యర్థంగా కాలం, ధనం వెళ్లిపోయే అవకాశం. శుక్ర శనివారాల్లో భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాదుల్లో జాగ్రత్త వహించాలి. నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. ప్లానింగ్‌కు అనుకూలం. వ్యవహార దక్షత పెరుగుతుంది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744