వారం వారం గోచారం

వారం వారం గోచారం (8.12.2019 నుంచి 14.12.2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అనేక కార్యక్రమాలను నిర్వహించే నైపుణ్యం. శారీరకమైన ఒత్తిడులున్నా అనేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాలలో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో శ్రమ ఉంటుంది. వారం మధ్యమంలో కుటుంబంలో ఒత్తిడులుంటాయి. బంధువర్గ వ్యవహారాలను చర్చిస్తారు. అధికారికమైన సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లోనూ చికాకులకు అవకాశం ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. సుదూర ప్రయాణాల విషయాలలో జాగ్రత్త వహించాలి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి కోసం ప్రయత్నం. వ్యతిరేకతలు అధికవౌతాయి. పోటీలు చికాకులను అధిగమించాలి. శత్రు రుణ రోగాదులు అధికవౌతాయి. పరామర్శలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. వారం మధ్యమంలో నిర్ణయాదుల్లో అనుకూలత. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం లభిస్తుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. వ్యాపారానుబంధాలు మెరుగుపడతాయి. అధికారులతో కొంత మెలకువగా ప్రవర్తించాలి. నూతన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. నిర్ణయాదుల్లో కొన్ని లోపాలకు అవకాశం. కళారంగాల వారికి సమస్యలు. వారాంతంలో కుటుంబంలో ఒత్తిడులు. బంధువర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతృప్తినిస్తాయి. అనేక రూపాల్లో ప్రయోజనాలకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడులకు అవకాశం. సృజనాత్మక కార్యక్రమాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సంతానవర్గ వ్యవహారాల్లో ఘర్షణ. కొత్త పనులను నిర్వహిస్తారు. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. కాంపిటీషన్స్‌లో అనుకూలత. వ్యాపారాదుల్లో ముఖ్య నిర్ణయాదులు తీసుకోవాల్సి వస్తుంది. విశ్రాంతి కోసం ప్రయత్నం. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులు. వారాంతంలో నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. అనేక కార్యక్రమాల బాధ్యతలున్నా నిర్వహణ సమస్యలుంటాయి. భాగస్వామ్యాల్లో ఇబ్బందులు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సమస్యలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పదోన్నతుల కోసం ప్రయత్నిస్తారు. సౌకర్యాల విషయంలో జాగ్రత్త. సౌఖ్యం కోసం ఎదురుచూసినా దొరకక పోవచ్చు. శ్రమతో కార్యక్రమ నిర్వహణ, గుర్తింపు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ. వ్యాపారాల్లో ప్రయోజనాలు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. ఆలోచనల్లో కొంత వత్తిడి. సృజనాత్మక శక్తి పెంచుకుంటారు. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత చికాకు తప్పకపోవచ్చు. వారాంతంలో వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలకు అవకాశం. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారికి అనుకూలత, పరామర్శలుంటాయి. విశ్రాంతి లోపం సంభవం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. విద్య, ఉద్యోగం, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల వారికి గుర్తింపు. సుదూర ప్రయాణాలపై ఆసక్తి. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. సహకార లోపాలకు అవకాశం. సంప్రదింపులలో ఒత్తిడులు. వార్తల వల్ల మానసికమైన చికాకులు. వారం మధ్యమంలో వృత్తిలో ఉన్నతి. ఉద్యోగంలో పదోన్నతి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. తండ్రివర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సౌకర్యాల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఆహార విహారాల్లో కొన్ని సమస్యలుంటాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. శ్రమ రహితమైన లాభాల జోలికి వెళ్లవద్దు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. నూతన కార్యక్రమాల నిర్వహణలో చికాకులు.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. చికాకులను అధిగమించాలి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో తొందరపాటు కూడదు. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం. బంధువర్గంతో జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో అత్యున్నత కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రయత్నం. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. వైజ్ఞానిక, విద్యా రంగాల వారికి గుర్తింపు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాదులకు అవకాశం. సోదర వర్గంతో సంప్రదింపులుంటాయి. వ్యాపారాదుల్లో ఇతరుల సహకారం కూడా లభిస్తుంది. వారాంతంలో వృత్తిలో అనుకూలత. ఉద్యోగాదుల్లో గుర్తింపు. సామాజిక గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు అధికం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. నూతన స్నేహానుబంధాలు. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఆలోచనల్లో వత్తిడులుంటాయి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార, జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ఇబ్బందులు ఎదురు కావచ్చు. అనారోగ్య భావనలుంటాయి. ఊహించని సంఘటనలు. శ్రమలేని ప్రయోజనాలపై దృష్టి. వ్యవహారాల్లో లోపాలుంటాయి. శ్రమ, ధనం, కాలం వ్యర్థం కావచ్చు. కుటుంబ, ఆర్థికాంశాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠల వల్ల సంతృప్తి. సుదూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మేలు కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ పోటీలు ఎదురుకావచ్చు. వ్యతిరేకతలు అధికవౌతాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు కోసం ప్రయత్నం. రుణాదులను అధిగమిస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. కాంపిటీషన్స్‌లో విజయం సాధిస్తారు. తొందరపాటు ఖర్చులు. పెట్టుబడులుంటాయి. విశ్రాంతి లోపం. వారం మధ్యమంలో పరిచయాలు పెంచుకుంటారు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల సమాచారం లభిస్తుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం. శారీరక ఒత్తిడులుంటాయి. వ్యాపార భావాలు పెంచుకుంటారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వారాంతంలో అన్ని కార్యక్రమాల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాల్లో లోపాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. ప్రయోజన దృష్టి అధికం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సృజనాత్మకత పెంచుకుంటారు. సంతానవర్గ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలుంటాయి. సంతోషంగా కాలం గడుపుతారు. వారం మధ్యమంలో పోటీ భావాలు పెరుగుతుంటాయి. కాంపిటీషన్స్‌లో విజయం. కార్యక్రమాల నిర్వహణలో శ్రమ తప్పకపోవచ్చు. ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలపై దృష్టి. అధికారిక, వ్యాపార ప్రయాణాలకు అవకాశం. విశ్రాంతి లోపం. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. వారాంతంలో వ్యాపార, జీవిత భాగస్వాములతో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాల వల్ల కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త పనుల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో సంతోషం. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. విందులు వినోదాలుంటాయి. గృహ వాహనాది వ్యవహారాల్లో నూతన నిర్ణయాదులకు అవకాశం. ప్రయాణాలుంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి. శ్రమాధిక్యం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత పెరుగుతుంది. కార్యనిర్వహణకు ప్రణాళికలుంటాయి. ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభించినా వారి పట్ల కొంత అప్రమత్తంగానే మెలగాలి. సంతానవర్గంతో సంతోషం. అభివృద్ధి కనిపిస్తుంది. వారాంతంలో వ్యతిరేకత ప్రభావాలు అధికం. పోటీలు, చికాకులను అధిగమించాల్సి వస్తుంది. కార్యనిర్వహణలో ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదర వర్గంతో కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. కొన్ని వార్తల వల్ల కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం. అసంతృప్తి. సుదూర ప్రయాణాల విషయంలో అడ్డంకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవధ్యానం మంచిది. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సంతృప్తి అధికం. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలుంటాయి. గృహ వాహనాది వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు అత్యధికం. పదోన్నతులపై దృష్టి. వారాంతంలో సంతానవర్గ వ్యవహారాల్లో సంతోషం. వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం. క్రియేటివిటీ పెంచుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలు ప్రాధాన్యం వహిస్తాయి. బంధువర్గంతో అనుకూలత. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. మాట తీరులో శుభ పరిణామాలున్నా కొన్ని అనుకోని ఇబ్బందులు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. చిన్నచిన్న అసౌకర్యాలకు, ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గ వ్యవహారాల్లో ముందడుగు. దగ్గరి ప్రయాణాలుంటాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. లక్ష్యాలను సాధించడంలో కొంత జాగ్రత్త అవసరం. కొంత దైవధ్యానం, దానం చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త. గృహ వాహనాదుల విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు కూడదు.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ