వారం వారం గోచారం

వారం వారం గోచారం (24.11.2019 నుంచి 30.11.2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు, స్నేహానుబంధాలకు అనుకూలం. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టు వ్యవహారాలలో ఇబ్బందులు. కొత్త పనులపై దృష్టి. వ్యాపార వ్యవహారాలు చర్చిస్తారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. శ్రమాధిక్యం. వ్యతిరేకతలు అధికవౌతాయి. ఊహించని సంఘటనలుంటాయి. అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. చికాకులు పెరిగే అవకాశం. దైవధ్యానం, దానాదుల వల్ల కొంత ఊరట కలుగుతుంది. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. అనేక కార్యక్రమాల రూపకల్పన.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం. కాంపిటీషన్స్ విషయంలో మరింత శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార వ్యవహారాల్లో కొంత అనుకూలత ఉంటుంది. రుణాదులు ఇబ్బంది పెట్టవచ్చు. వారం మధ్యమంలో భాగస్వామ్యాలపై దృష్టి. అధికారిక వ్యవహారాలు రాణిస్తాయి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒకింత అనుకూలత ఉన్నా అప్రమత్తంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు శ్రమకు గురిచేసే అవకాశం. వారాంతంలో అన్ని పనులూ ఇబ్బంది పెట్టే అవకాశం. గౌరవ లోపాలు. అనారోగ్య భావాలు. నైరాశ్య ధోరణి ఉంటుంది. ముఖ్య నిర్ణయాదుల వాయిదా మంచిది. ఊహించని సంఘటనలు జరిగే అవకాశం.

ఘ్ఘమిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్లానింగ్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వ్యాపారాదుల్లో కొంత భావనలుంటాయి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. వారం మధ్యమంలో పోటీ రంగంలో గుర్తింపు. శ్రమ అధికం. వ్యతిరేకతలపై విజయం. శ్రమ ఉన్నా ఫలితం సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. రుణాదుల గూర్చిన చర్చ ఉంటుంది. శత్రు భావనలు పెరిగే అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. మొండితనం తగ్గించుకోవాలి. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాల విషయంలో ఇబ్బందులకు అవకాశం. ఆధ్యాత్మికమైన ప్రయాణాలకు అనుకూలత.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల గూర్చి చర్చించే అవకాశం. ప్రయాణాల విషయంలో కొంత ముందు జాగ్రత్త అవసరం. విందులు వినోదాలపై దృష్టి. వ్యాపారాదులకు అనుకూలం. సౌఖ్యంగా ఉంటున్నా ఏదో ఘర్షణ ఉంటుంది. విద్యార్థులు ఫలితాల విషయంలో కొంత జాగ్రత్త పడటం అవసరం. వారం మధ్యమంలో ఆలోచనల్లో కొంత ఒత్తిడికి అవకాశం. సంతాన వ్యవహారాల్లో కొంత శ్రమ తప్పకపోవచ్చు. క్రియేటివిటీ, ప్లానింగ్ పెరిగినా చికాకుగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. కొత్త పనులపై దృష్టి. అధికారిక వ్యవహారాలపై చర్చ ఉంటుంది. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. వారాంతంలో పోటీలు ఒత్తిడులు పెరుగుతుంటాయి. గుర్తింపు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వార్తల వల్ల ప్రయోజనాలుంటాయి. మీడియా రంగం వారికి అనుకూలత. అపోహలకు కూడా అవకాశం. సోదర వర్గంతో చికాకులుంటాయి. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం. వారం మధ్యమంలో ఆహార విహారాల కోసం ప్రయత్నం. సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. ప్రయాణాలకు అవకాశం. విందులు వినోదాలపై దృష్టి ఉంటుంది. మాతృవర్గ బంధువుల కార్యక్రమాలు ఇబ్బంది పెడతాయి. శ్రమాధిక్యం. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. కొన్ని నిర్ణయ లోపాలకు అవకాశం. క్రియేటివిటీ ఉన్నా ఆశించిన గుర్తింపు ఉండకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత చికాకు ఉండే అవకాశం. స్పెక్యులేషన్స్ ఇబ్బంది పెట్టవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ, బంధువర్గ వ్యవహారాలు చర్చిస్తారు. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం మాటల వల్ల కోల్పోయే అవకాశం ఉంది. వౌనంగా ఉండటం మేలు. వ్యాపారాదుల్లో కొంత అనుకూలత. కొన్ని అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది. పెద్దలతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరవర్గ వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. కొత్త వార్తలున్నా కొన్ని అపోహలకు అవకాశం ఉంటుంది. పాత మిత్రుల నుండి సమాచారం అందుతుంది. వారాంతంలో ఆహార విహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. గృహ వాహనాదుల విషయంలోనూ నిర్ణయాలు వాయిదా వేయాలి.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో శారీరక ఒత్తిడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్నా తొందరపాటుకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు అధికం. శ్రమాధిక్యం. గుర్తింపు కోసం ప్రయత్నం. వ్యాపారాదుల్లో కొంత ముందడుగు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నిర్ణయాదుల విషయంలో మరొక్కసారి గమనించుకోవడం మంచిది. వారం మధ్యమంలో కుటుంబ సంబంధాలపై దృష్టి. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. మాటల్లో కొంత అధికారిక ధోరణి ఉంటుంది. బంధువర్గ వ్యవహారాల్లో చికులు. అధికారిక వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కొన్ని నష్టాలకు అవకాశం. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి. వారాంతంలో సంప్రదింపులుంటాయి. సేవకవర్గ సహకారం. పెద్దలతో సంప్రదింపులుంటాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో వ్యర్థమైన ఖర్చులుంటాయి. విశ్రాంతి లోపం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో ముందు జాగ్రత్త అవసరం. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం. కాలం ధనం శ్రమ కోల్పోయే అవకాశం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. శారీరకమైన వత్తిడి తప్పకపోవచ్చు. కొద్దిపాటి అనారోగ్యం ఉంటుంది. కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. నిర్ణయాల వల్ల ధన వ్యయం అయ్యే సూచనలు. వేరు వేరు బాధ్యతల నిర్వహణకు తగినంత దైవ సహకారం తీసుకోవాలి. అధికారిక వ్యవహారాల్లోనూ జాగ్రత్త. వారాంతంలో కుటుంబం, బంధువర్గ అంశాలు కీలక పాత్ర వహిస్తాయి. మాటల్లో అనుకూలత.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)ఈ వారం ప్రారంభంలో వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలను ఆశిస్తారు. పెద్దవారితో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. వ్యాపారంలో అనుకూలత. వేరు వేరు పనులపై దృష్టి ఉంటుంది. ఆలోచనలు ఫలిస్తాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. వారం మధ్యమంలో కాలం ధనం వ్యర్థం అవుతుంది. ఏదో అధికారిక వ్యవహారాల కోసం ప్రయాణాలు కొనసాగిస్తారు. తండ్రి వర్గానికి సంబంధించిన వారి వ్యవహారాలపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. పరామర్శలకు అవకాశం. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనుల్లోనూ అనుకూలత. కొత్త బాధ్యతలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణలో కొంత బద్ధకం, ఆలస్యం కూడా అవకాశం ఉంది. అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. పనిచేసే చోట కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. గౌరవలోపాలు రాకుండా చూసుకోవాలి. శ్రమాధిక్యం. వారం మధ్యమంలో వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ. పెద్దల ఆశీస్సులు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆశించిన లాభాలున్నా కొంత ఒత్తిడి ఉంటుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. గౌరవం కోసం వెచ్చిస్తారు. విందులు వినోదాలు విలాసాలుంటాయి. ఆరోగ్యం కోసం వెచ్చించాలి. ధార్మికమైన ప్రయాణాలుంటాయి. దానధర్మాలు అధికంగా నిర్వహించాల్సి వస్తుంది.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొత్త పనుల నిర్వహణ. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి ఉన్నా ఎక్కడో ఇబ్బందులు కూడా ఉంటాయి. సుదూర ప్రయాణ లక్ష్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. వైజ్ఞానిక పరిశోధనలకు అనుకూలం. విద్యా వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం పెరిగినా శ్రమ అధికం. పితృవర్గ వ్యవహారాలు పూర్తి చేస్తారు. కార్యాలయాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ అనుకూలత. పెద్దల ఆశీస్సులు. స్ర్తివర్గంతో అనుకూలత. సేవక వర్గ సౌజన్యం. ఆధ్యాత్మిక వ్యవహారాలు. ఆలోచనలకు రూపకల్పన. సంతృప్తి. సంతానవర్గ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలుంటాయి. ప్రమాదాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. ఊహించని నష్టాలు ఉంటాయి. సంఘటనలు కొన్ని ఇబ్బంది పెడతాయి. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి కేంద్రీకరించకూడదు. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అయినా అసంతృప్తి ఉంటుంది. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారించడం మంచిది. శక్తి సముపార్జన వల్ల మరింత మేలు కలిగే అవకాశం ఉంటుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గౌరవం పెంచుకుంటారు.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ