వారం వారం గోచారం
వారం వారం గోచారం (8-9-2019 నుంచి 14-9-2019 వరకు)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు. అసంతృప్తి. నిరాశ కలుగుతుంది. సుదూర ప్రయాణ భావనలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. తప్పనిసరిగా దానధర్మాలు చేయాలి. పుణ్యలోపాలకు, చికాకులకు అవకాశం. ఉన్నత విద్యారంగంలోనూ, కీర్తి ప్రతిష్టల విషయంలోనూ జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పదోన్నతులకు, సామాజికమైన గుర్తింపులకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. ఆహార విహారాలకు, సౌకర్యాలను పెంచుకోవడానికి అవకాశాలుంటాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు సంభవం. కొత్త పనులపై దృష్టి. క్రియేటివిటీ పెంచుకుంటారు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలలో ఒత్తిడులుంటాయి. సృజనాత్మకత లోపం. నిర్ణయాదుల్లో ఆలస్యం తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్ల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. సంతానవర్గ వ్యవహారాల్లో లోపాలుంటాయి. తొందరపాటు కూడదు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ఊహలు అధికవౌతాయి. అపోహలకు కూడా అవకాశం ఉంది. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. పోటీ రంగంలో గుర్తింపు. రోగ రుణాదులపై విజయం. కాంపిటీషన్స్‌లో విజయం సాధిస్తారు. ఖర్చులు, పెట్టుబడులు తప్పకపోవచ్చు. విందులు విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరామర్శలకు అవకాశం. వారాంతంలో భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదుల్లో జాగ్రత్త. అన్ని పనుల్లోనూ ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణ బాధ్యతలు శ్రమకు గురి చేస్తాయి. ఆలస్య నిర్ణయాలుంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లోనూ అపోహలకు అవకాశం. చెప్పుడు మాటలు వినవద్దు. వారం మధ్యమంలో దాచుకునే సంపదను పెంచుకుంటారు. బంధువర్గంతో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం. సంతృప్తి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉన్నా అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలకు అవకాశం ఉంటుంది. ఊహించని సంఘటనలున్నా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వారాంతంలో సంప్రదింపులుంటాయి. కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. మంచి వార్తలు వినే అవకాశం.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు ఇబ్బంది పెట్టే అవకాశం. నిర్ణయాదులు తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య కార్యాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ జాగ్రత్త. తొందరపాటు కూడదు. మాట విలువ తగ్గుతుంది. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత సంతోషం కలుగుతుంది. వారాంతంలో వృత్తిలో అనుకూలత. అనేక కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. హోదా పెంచుకునే ప్రయత్నం.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ప్రాథమిక విద్యా రంగంలోని వారికి శ్రమ అధికం. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో చికాకులు ఏర్పడే అవకాశం. సౌఖ్య లోపం. సామాజిక గౌరవం పెంచుకోవడానికి అధికంగా కృషి చేయాలి. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు ఒక పర్ఫెక్ట్ రూపం. ప్లానింగ్‌తో జీవనం ఉంటుంది. వైజ్ఞానిక ధోరణి. క్రియేటివిటీ పెంచుకుంటారరు. కొత్త పనుల నిర్వహణ సంతోషాన్నిస్తుంది. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలపై దృష్టి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. వారాంతంలో పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పరామర్శలకు అవకాశం. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. విశ్రాంతి లోపం ఉంటుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వ్యతిరేక ప్రభావాల వల్ల శ్రమాధిక్యం ఉంటుంది. వారం మధ్యమంలో నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు దగ్గరయ్యే సూచనలు. విజయ సాధన. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. దాచుకున్న సంపదను పెంచుకునే ఆలోచనలు.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామితో అపోహలకు అవకాశం ఉంటుంది. మానసిక బలహీనతకు అవకాశం ఉంది. ఇతరుల ప్రభావాలకు లోబడకుండా ఉండాలి. సామాజిక అనుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు. ఆలోచనల్లో ఒత్తిడులు. నిర్ణయాదులు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఊహించని సంఘటనలుంటాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులకు అవకాశం. కార్యనిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వారాంతంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రణాళికలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. వ్యవహారాల్లో విజయం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవకవర్గ సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలకు మంచిది. కమ్యూనికేషన్స్‌లో ఇబ్బందికి అవకాశం. వార్తల వల్ల కొంత మానసికమైన వత్తిడి ఉంటుంది. సమస్యలను వినడం వల్ల చలించిపోయే అవకాశం. దేశాంతర ప్రయాణాదులకు, ప్రయత్నాలకు అవకాశం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తున్నా అసంతృప్తి తప్పదు. వారం మధ్యమంలో ఆహార విహారాల్లో అనుకూలత. సంతోషంగా గడుపుతారు. సౌఖ్యం పెరుగుతుంది. విద్యారంగంలోని వారికి అభివృద్ధి. పిల్లలకు సంతోషం. మాతృవర్గం వారు కొత్త పనులను నిర్వహిస్తారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఉద్యోగాదుల్లోనూ శుభ పరిణామాలుంటాయి. వారాంతంలో క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త నిర్ణయాలుంటాయి.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. సరియైన లాభాలు లేక ఇబ్బందులు పడతారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. అపోహలకు అవకాశం. అన్ని పనుల్లోనూ అప్రమత్తం. క్రియేటివిటీ పెరిగినా కార్యక్రమాల్లో మాత్రం ఒత్తిడులే. ఆధ్యాత్మిక దృష్టి వల్ల మేలు. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. అన్ని పనుల్లోనూ శ్రమ ఉన్నా ఫలితాలు తప్పవు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా కాలం గడుపుతారు. దానధర్మాల వల్ల పూర్ణమైన ఆనందం. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీలు ఒత్తిడులను అధిగమిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యతిరేకతలు అధికం. అన్ని పనుల్లోనూ ఒత్తిడులు తప్పవు. రుణ రోగాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. శత్రు భావనల నుండి దూరంగా మెలగాల్సి ఉంటుంది. ఖర్చులు, పెట్టుబడుల్లోనూ జాగ్రత్త అవసరం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. పరామర్శలకు అవకాశం. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక, భాగస్వామ్య అనుబంధాలలో అనుకూలత. సంతోషంగా గడుపుతారు. విందులు వినోదాలకు అవకాశం ఉంటుంది. శ్రమాధిక్యం. పాత మిత్రుల కలయిక లేదా సమాచారం అందుతుంది. వారాంతంలో ముఖ్య కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్త వహించాలి. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు, కుటుంబ ఆర్థికాంశాల్లోనూ ఇబ్బందులకు అవకాశం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలోనూ, బంధువర్గ వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం తగ్గిపోవచ్చు. మాటల్లోనూ చికాకు ఉంటుంది. మాట విలువ తగ్గిపోతుంది. దాచుకున్న సంపదపై మమకారం తగ్గించుకోవాలి. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపుల్లో అనుకూలత. ఇతరుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మిత్రుల గొంతులు వింటారు. సుదూర ప్రయాణ లక్ష్యాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. దైవ ధర్మ కార్యాలకు దానాదులు అవసరం. వారాంతంలో ఆహార విహారాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో సమస్యలు అధికం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. పనిచేసే చోట కొన్ని సమస్యలు ఉండే అవకాశం. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాదులకు అనుకూలత. శ్రమతో కార్యాలు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనం సంతోషాన్నిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. కొత్త పనులపై దృష్టి. సోదర వర్గంతో గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మక వ్యవహారాలపై దృష్టి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు తప్పవు. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలు, విహార యాత్రలుంటాయి. విశ్రాంతి లభిస్తుంది.